Saturday, 25 July 2026

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి..


ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం కోసం హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇందులో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మొక్కలను పొందడం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు మొబైల్ నెంబర్ సమర్పించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది.

ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గోపిడి రోహిత్ తెలిపారు.

Thursday, 23 July 2026

ఉచిత సంతాన సాఫల్య శిబిరం

 జూలై 24 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించనున్నట్లు మాతృశ్రీ హాస్పిటల్ యాజమాన్యం కామారెడ్డి వారు తెలిపారు ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్స్ మరియు మాతృశ్రీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కన్సల్టేషన్ ఉచిత కౌన్సిలింగ్ ఉచిత టెస్టులు థైరాయిడ్ పరీక్ష రక్తపరీక్ష షుగర్ టెస్ట్ టి ఎఫ్ టి ఎఫ్ ఎస్ హెచ్ ప్రోలాక్టింగ్ సిమెంట్ అనలైసిస్ వారి వారి అవసరాలను బట్టి ఉచితంగా చేయబడును చాలా రోజుల నుండి పిల్లలు పుట్టని వారు తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి రావాలని సూచించారు

 గంజి గట్ ఎదురుగా రామారెడ్డి రోడ్డు కామారెడ్డి.

సంప్రదించవలసిన నెంబర్లు 89850 39634 మరియు 92203 15983.

రామానంద తీర్థ లో ఉచిత శిక్షణ

 రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సులలో ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపింది అకౌంట్స్ అసిస్టెంట్స్ డైలీ ప్రైమ్ బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ కంప్యూటర్ అడ్వాన్స్ వెల్డింగ్ ఆటోమొబైల్ టీవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది ఈనెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డు కుల దృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థకు నేరుగా హాజరు కావాలని సూచించింది పూర్తి వివరాలకు 9133 908000 మరియు 9133 90 811 1మరియు 9133 908222 మరియు 9948 466 11 1 నెంబర్ లలో సంప్రదించాలని కోరింది

Saturday, 18 July 2026

150 మందికి ఉచిత శిక్షణ

 యూపీఎస్సీ పరీక్షలు 2027 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందించనున్నది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన 150 మందికి నిపుణులతో కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్ లతో పాటు నెలకు 5000 రూపాయల స్టయిఫండ్ ,5 వేల రూపాయలు పుస్తక భృతిని ప్రభుత్వం అందించనుంది.

డిగ్రీ ఉత్తీర్ణులై నిర్దేశిత ఆదాయ పరిమితిలో ఉన్న తెలంగాణ అభ్యర్థులు జూలై నెల 17వ తేదీ నుంచి ఆగస్టు నెల ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్  16వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి అదే నెల 24 నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఉచితంగా.. న్యాయ సహాయం

 న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి సలహాలు,సూచనలు తీసుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. న్యాయ వాదులను సంపాదించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు న్యాయ పరమైన సలహాలు,సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం " టెలీ లా"విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఎలాంటి ఫీజు చెల్లించకుండానే హైకోర్టు న్యాయ వాదుల నుంచి " ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు మాతృ భాష లోనే పొందే అవకాశం ఉంటుంది.

అపాయింట్ మెంట్.. 

దరఖాస్తుదారుడు ముందుగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ మీ సేవా, కామన్ సర్వీస్, డిజిటల్ సేవా కేంద్రాల్లో ఏదైనా ఒక దానిని సంప్రదించాలి. హైకోర్టు లాయర్ లతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉచితంగా అపాయింట్మెంట్ నమోదు చేస్తారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన సమయానికే హై కోర్టు న్యాయవాది స్వయంగా దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడతారు.

అందే సేవలు ఇవే..

వరకట్న వేధింపులు, లైంగిక నేరాలు, గృహ హింస,ఉపాధి,మహిళలు,పిల్లలు, వృద్ధుల మౌలిక హక్కులు, ప్రసూతి ప్రయోజనాలు, భూ తగాదాలు, వాహన చట్టాలు,FIR నమోదు, అరెస్ట్ చేసిన వ్యక్తిని నిర్బంధించడం, RTI, CAA, NRC, అట్రాసిటీ కేసులు, ఆస్తి గొడవలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో అవరోధాలు తదితర సమస్యల గురించి న్యాయ వాదుల నుంచి "ఉచితంగా" సలహాలు,సూచనలు పొందవచ్చు.

Sunday, 5 July 2026

కీర్తి హాస్పిటల్ లో ఉచిత కన్సల్టేషన్

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో గల కీర్తి హాస్పిటల్ లో జూలై 4 5 6 వ తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున ఉదయం 10 గటల నుండి రాత్రి 8 గంటల వరకు రోగులకు ఉచితంగా కన్సల్టేషన్ నిర్వహిస్తున్నామని ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు కావున కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరారు.




Thursday, 2 July 2026

ఒడిశా లో ఉచిత విద్య

 కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గతంలో ప్రకటించారు .బుధవారం రాత్రి ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది. కార్యక్రమం తర్వాత మోహన్ స్వయంగా విలేకరులకు ఈ విషయం చెప్పారు .ఏడాదిలో 38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ,రుసుములు ఉండవని స్పష్టం చేశారు. డ్రాప్ ఔట్లు తగ్గించడం, గుణాత్మకమైన విద్యా బోధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

డిగ్రీ విద్యార్థులకు ఉచిత ఆర్ష విద్య ప్రశిక్షణ

 దేశభక్తి దైవభక్తి గల డిగ్రీ విద్యార్థులకు ఉచిత వసతితో ఆర్ష విద్య ప్రశిక్షణ ఇవ్వనున్నట్లు కామారెడ్డి ఆర్య సమాజం ప్రతినిధి ఆచార్య సత్య మిత్ర తెలిపారు. వివిధ కళాశాలలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు యధావిధిగా తమ కోర్సులతో పాటు ఆర్ష విద్యా ప్రశిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు .

ప్రశిక్షణలో వాల్మీకి రామాయణం ,మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు ,షోడశ సంస్కారాలు, సత్యార్థ ప్రకాశం, ఋగ్వేదాది భాష్య భూమిక ,సంస్కృత భాష, వేదాంగ ప్రకాశ నేర్పిస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశాల కొరకు 79895 13668 మరియు 93475 91380 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.