తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ..
సహకార రంగానికి సంబంధించి 160 కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8భాషలలో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతి దారులు,విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ ఐ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు.ఇందుకోసం ప్రత్యేకంగా savidya.coop పేరిట ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది.
సవిద్య అంటే సహకార విద్యాలయం .ఇది దేశంలోనే మొట్ట మొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు,విద్యార్థులు, ఎగుమతి దారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ ' సహకార్ సే సమృద్ధి ' చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణ ను అందిస్తుంది.
వ్యవసాయ పద్ధతులు ,ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160 కి పైగా ఉచిత వీడియో కోర్సులు . తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషలలో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను ఉపయోగించి కంటెంట్ ను వ్యక్తిగతికరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా ఙ్ఞానాన్ని అందించేందుకు ఏ ఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది. వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ,పంట దిగుబడిని మెరుగుపరచు కోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధనా అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు ఎగుమతి దారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు , అంతర్జాతీయ వాణిజంపై అవగాహన పొందడానికి అవసరమైన కోర్సులను సైతం ఇందులో పొందుపరచడం విశేషం.
నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ , క్రిబ్కో వంటి సహకార సంస్థలు సహకార విద్య ప్లాట్ ఫామ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 వేల సహకార సంఘాలను రెండు కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయడమే దీని లక్ష్యం.
మీరు savidya.coop లో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకుని , సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.
No comments:
Post a Comment