Monday, 15 June 2026

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి హైదరాబాద్ క చెందిన పి జె ఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గోదావరిఖనిలోని సింగరేణి హై స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు, అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం నుండి ఈ నెల 25వ తారీకు వరకు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను అందజేస్తామని చెప్పారు. జులై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment