Saturday, 27 June 2026

ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్

 క్వాలిటీ థాట్, అన్ అకాడమీ సెంటర్ ల సంయుక్త నిర్వహణలో..

 క్వాలిటీ థాట్ , అన్ అకాడమీ సెంటర్ మాదాపూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న" క్యూటీ యూ ఎన్ ఏ నీట్ మిషన్ 100 ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్ " కార్యక్రమాన్ని శుక్రవారం మాదాపూర్ లోని అన్నకాడమీ  సెంటర్లో ప్రారంభించారు . క్వాలిటీ థాట్ ఫౌండర్, అన్ అకాడమీ సెంటర్ ఫ్రాంచైజీ భాగస్వామి రమణ భూపతి కార్యక్రమాన్ని ప్రారంభించగా ,ఫౌండేషన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరు ,జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వెంకట్ పవన్ ,అనస్తీసియ విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మడాల ,ఎయిమ్స్ ట్రామా సర్జన్ డాక్టర్ దామోదర్ కాకుమాను పాల్గొన్నారు. జులై 1 నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో 150 మంది రెసిడెన్షియల్ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ,వసతి, భోజనం అలాగే 500 మంది డే స్కాలర్ లకు ఉచిత తరగతులు అందిస్తామని రమణ భూపతి తెలిపారు .ఆసక్తిగల విద్యార్థులు 9160 9341 49 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

No comments:

Post a Comment