తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం కోసం ప్రభుత్వ ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శశి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ముస్లింలు, బౌద్ధులు ,పార్సలు, సిక్కులు ,జైనులు తదితర మైనార్టీ వర్గాలకు చెందిన విద్యావంతులు నిరుద్యోగ మైనారిటీ యువతకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనుబంధమైన ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ సంస్థల ద్వారా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ,డిజిటల్ బిజినెస్ మొదలగు వాటిల్లో" నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ "అందిస్తామని తెలిపారు. ఎంపికైన సంస్థలు శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శిక్షణ సంస్థ లు మూడేళ్ల పనితీరుకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రాజెక్టు రిపోర్ట్ తో జత చేసి హార్డ్ కాపీలను ఈనెల 15 సాయంత్రం 5 గంటలకు లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం కామారెడ్డి లోని రూమ్ నెబర్ 222, కలెక్టరేట్లోని రెండో అంతస్తులో సమర్పించాలని సూచించారు.
No comments:
Post a Comment