Pages

▼

19, అక్టోబర్ 2026, సోమవారం

ఎస్టీ ఐఎఎస్ స్టడీ సర్కిల్, రాజేంద్ర నగర్, హైద్రాబాద్.

 హైదరాబాదులోని రాజేంద్రనగర్ లోని మానస హిల్స్ లో తెలంగాణ ప్రభుత్వ ట్రైబల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కొనసాగుతోంది .ప్రతి సంవత్సరం 100 మంది పేద ఎస్టి విద్యార్థులకు ప్రభుత్వం" ఉచితంగా సివిల్స్ కోచింగ్ " అందిస్తోంది. ఫ్రీ హాస్టల్, ఫ్రీ బుక్స్ కోసం ప్రత్యేకంగా స్టైపండు , నెలవారీ  ప్యాకెట్ మనీ తో పాటు కంప్యూటర్ ల్యాబ్ ,లైబ్రరీ, రీడింగ్ హాల్ వంటి వసతులు కల్పిస్తున్నారు. 

ఒక్కో విద్యార్థిపై సుమారు లక్ష రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే గత ఐదేళ్ల నుంచి ప్రతి ఏటా ఈ స్టడీ సర్కిల్ నుంచి 120 మంది సివిల్ ఎగ్జామ్స్ రాస్తుండగా ఇందులో కేవలం పదిమందిలోపే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవుతున్నారు. మెయిన్స్ లో మాత్రం ఒక్కరు కూడా సెలెక్ట్ కావడం లేదు. దీంతో ఈసారి ప్రైవేట్ స్టడీ సర్కిల్కు కోచింగ్ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017- 18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 734 మంది శిక్షణ పొందగా 131 మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. 

పేద ఎస్టీ విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ ఇచ్చేందుకు ట్రైబల్ శాఖ ఇటీవల టెండర్ల ను పిలవగా ఇందులో ఆరు ప్రముఖ స్టడీ సర్కిల్ లు పాల్గొన్నాయి. తక్కువగా కోట్ చేసిన ఢిల్లీ శ్రీరామ్ ఐఏఎస్ సర్కిల్ టెండర్ దక్కించుకుంది. ఒక్కొక్క స్టూడెంట్ కు 60 వేల రూపాయలకే ప్రిలిమ్స్, మెయిన్స్ కోచింగ్  ఇచ్చేలా టెండర్ లో ఎల్ 1 గా నిలిచింది. ఇతర సంస్థలు 1 లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు కోట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థలో విద్యార్థులకు 24 గంటల ఉచిత వైఫై, 60 కంప్యూటర్లతో వేర్వేరు కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి .ప్రతి విద్యార్థికి 5000 రూపాయల విలువైన" స్టడీ మెటీరియల్ ఉచితంగా"  అందజేస్తున్నారు. ప్రొజెక్టర్లు ,స్క్రీన్లతో కూడిన 5 పెద్ద క్లాసు రూమ్ లలో నిపుణులైన ఫ్యాకల్టీ తో ఐఏఎస్ మెయిన్స్ ఆప్షనల్ సబ్జెక్టులపై కోచింగ్ ఇస్తున్నారు. 

పేద గిరిజన విద్యార్థులకు సివిల్స్ ర్యాంకులు సాధించే లక్ష్యంతో ట్రైబల్ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తొలిసారిగా టెండర్ ద్వారా ఢిల్లీ శ్రీరామ్ సివిల్స్ స్టడీ సర్కిల్ కు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది .దసరా సెలవుల తర్వాత నుంచి వచ్చే ఏడాది మేలో ప్రిలిమ్స్ పరీక్ష జరిగే వరకు 8 నెలల పాటు" 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ"  ఇవ్వనున్నారు. అలాగే గతేడాది ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన మరో 20 మందికి" ఉచిత మెయిన్స్ శిక్షణ" అందించనున్నారు. దీని ద్వారా రాబోయే రోజులలో మరిన్ని సివిల్స్ ర్యాంకులు పేద గిరిజన విద్యార్థులు సాధించేలా అంతర్జాతీయ స్థాయి మెంటార్ షిప్ బోధన అందనున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి