బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కాగానే ఉన్నత చదువుల కోసం యూఎస్ ,లండన్ కు వెళ్లాలని అమ్మానాన్నలు చెప్పినప్పటికీ నిజామాబాద్ లోని దుబ్బ ప్రాంతానికి చెందిన సాయి ప్రీతం వినిపించుకోలేదు. ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదని సొంతంగా స్టార్టప్ ప్రారంభించారు .స్థానికంగా ఉన్న గిరిరాజు కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే తల్లితండ్రులపై ఆధారపడకుండా ప్రైవేటు ఉద్యోగం చేసిన అతడు ,తన సంపాదనతో ఒక నాన్ వెజ్ దుకాణం నిర్వహించారు .అప్పట్లో ప్రమోషన్ కోసం చేసిన రీల్స్ తన ఆలోచనను మార్చాయి అంటున్నాడు ఈ యువకుడు .ఇతనికి ఇన్‌స్టాలో 16,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు .ఆ తర్వాత ఎంబీఏ చేస్తూనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని నెలకొల్పారు." రీల్స్ మేకింగ్ పై ఆసక్తి ఉన్న యువతకు ఉచిత శిక్షణ " ఇస్తున్నారు. ఇటీవలే పాడ్ కాస్ట్ రంగం లోకి కూడా ప్రవేశించారు. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు .అంతటితోనే ఆగిపోకుండా కేసరి అనే పేరుతో బైక్ లపై వాణిజ్య ప్రకటనల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు .సొంత నగరమైన నిజామాబాదులోనే పేరు సంపాదించడం మరియు మరో 10 మందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది అని, అమ్మానాన్నలు సుజాత ,చంద్రశేఖర్ సన్నిహిత మిత్రుల సహకారం మరచిపోలేను అని సాయి ప్రియతమంటున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి