Friday, 13 March 2026

ఉచిత శిక్షణ @ నిజామాబాద్

 నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయ్ మెంట్ జెనరేషన్,మార్కెటింగ్ మిషన్ egmm, నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం హెల్త్ కేర్ సెక్టార్,కంప్యూటర్స్ విభాగాల్లో శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

18 నుండి 35 ఏళ్ల వయసు గల, పదవ తరగతి,ఆ పైన ఉత్తీర్ణత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు యెండల టవర్స్ ఎదురుగా గల నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని డైరెక్టర్ మంజుల ఆకాశ పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫోటో ,కుల ధృవీకరణ పత్రంతో ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు

ఉచిత క్యాన్సర్ చికిత్స @9394010215

 క్యాన్సర్ ముందస్తు గుర్తింపున కు నేషనల్ మాస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్ ప్రారంభించాలని బిఆర్ఎస్ ఎంపీ బీ పార్థసారధి రెడ్డి గారు రాజ్యసభలో అన్నారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు కేంద్రం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. దేశం క్యాన్సర్ హెల్త్ ఎమర్జెన్సీ దిశగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియకు వసతులు లేకపోవడం ,ప్రజల్లో క్యాన్సర్ ముందస్తు లక్షణాలపై అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని అన్నారు.

 మన దేశంలో క్యాన్సర్ చికిత్స, మందులు, ఖర్చుతో కూడుకోవడంతో పేదలు అంత డబ్బు వెచ్చించలేకపోతున్నారని వివరించారు. క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న సమయాన మెడికల్ సర్జికల్ రేడియేషన్ పాంకాలజిస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. 

ముందస్తు లక్షణాలు గుర్తించకపోవడంతోనే.. 

దేశంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ చికిత్స సెంటర్లు ఢిల్లీ ,ముంబై, హైదరాబాదులో ఉన్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం కష్టంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . నాట్ ఫర్ ప్రాఫిట్ క్యాన్సర్ దవాఖానాలకు కేంద్రం కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు.

క్యాన్సర్ చికిత్సకు 1500 బెడ్లతో సింధు హాస్పిటల్ 

సామాజిక బాధ్యతగా హైదరాబాదులో 1500 బిడ్డలతో సింధు హాస్పిటల్ నిర్మించినట్లు పార్థసారథి రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులంతా ఒకసారి ఈ దవాఖానను సందర్శించాలని ఆహ్వానించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో క్యాన్సర్ బాధితులు ఉంటే సింధు దవాఖానకు రిఫర్ చేయాలని ఆయన కోరారు. వాళ్లందరికీ ఉచితంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు .ఈ మేరకు ఉచిత చికిత్స పొందాలనుకునేవారు 9394010215 నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

Wednesday, 11 March 2026

ఉచిత ఫెర్టిలిటీ క్యాంప్,12-3-2026

 ఉచిత ఫెర్టిలిటీ క్యాంప్.. ఉచిత వైద్య సలహా.. ఉచిత స్కానింగ్..

సంతాన లేమితో బాధ పడుతున్న వారు మా నిపుణుల సేవతో మీ మాతృత్వ కలను నిజం చేసుకోండి..

జీవదాన్ హాస్పిటల్, నిజాం సాగర్ రోడ్,కామారెడ్డి

తేదీ 12-3-2026 , గురు వారం రోజున,సమయం ..ఉదయం 10-00 గంటల నుంచి మధ్యాహ్నం 3-00 గంటల వరకు..

డా.. అర్చన mbbs md aiims న్యూ ఢిల్లీ 

మా ప్రత్యేకతలు..

మొదటి ప్రయత్నం లో IVF విజయ శాతం ..80%

పలు IVF వైఫల్యాల కేసుల్లో అత్యధిక విజయ శాతం 

IUI/IVF/ICSI/PGT/ అండం & ఆండ్రాలజీ సేవలు అన్ని రకాల చికిత్సలు అందుబాటులో

గూగుల్ మరియు ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవండి

Pinnacle fertility,Nizamabad Reviews (Google)

drarchana_fertility_doctor(instagram)


క్యాంప్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి IVF పద్ధతి పై రూ.30,000 తగ్గింపు IVF చికిత్స ( egg pick up,ICIS with medicine & injection )

వంధ్యత్వంతో బాధ పడుతున్న వారికి ఆశా కిరణం .. పినాకిల్ ఫెర్టిలిటీ, జె. జె.రెడ్డి హస్పిటల్ లేన్,HPS కిడ్స్ స్కూల్ ఎదురుగా , ద్వారకా నగర్, నిజామాబాద్.

రిజిస్ట్రేషన్ కోసం..9492492324,8317557490


ఉచిత శిక్షణ @ నిజామాబాద్

 నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయ్ మెంట్ జెనరేషన్,మార్కెటింగ్ మిషన్ egmm, నిపుణ్ ఎడ్యుకేషనల్ సొస...