27, అక్టోబర్ 2026, మంగళవారం

ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆన్ లైన్ లో జస్ట్ మీ పేరు, గోత్రం ఇస్తే చాలు. వారే మీ సంకల్పం తో పూజ చేస్తారు. విశేషం ఏమిటంటే ఆ పూజ ను మీరు లైవ్ లో కూడా చూడవచ్చు. 

ఉచితంగా దొరుకుతున్న ఈ దివ్యమైన అవకాశాన్ని వదులుకోకండి.



శ్రీ వినయ్ అగర్వాల్, షాజహాన్ పూర్.

 పేదల ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు అంటే ఎంతో ఆందోళనగా ఉంటుంది ఎలా చేయాలా అని. అలాంటి పేద కుటుంబాలలో ఆశల దీపం వెలిగించి ఎంతో సహాయకారిగా ఉంటున్నారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ కు చెందిన నమ్కీన్ వ్యాపారి వినయ్ అగర్వాల్. 

నాకు సోదరీమణులు లేరు , కానీ ఏ ఇంట్లో కూడా డబ్బులు లేకపోవడం కారణంగా ఆడపిల్ల పెళ్లి ఆగిపోకూడదు ..అనే ఆలోచనతో 2023 లో 11 మందికి,2024 లో 21 మందికి ,2025 లో 51 మంది యువతులకు వివాహాలు అన్నీ తానై జరిపించారు వినయ్ అగర్వాల్ గారు.

ఈ 2026 వ సంవత్సరంలో ఏకంగా 101 జంటలకు ఒకే వేదికపై జీవితాలను కలిపారు.ఇప్పటివరకు మొత్తం 184 మందికి వారి వారి మత ఆచారాల ప్రకారం ఘనంగా వివాహాలు జరిపించారు.జంటలకు టీవీ లు, ఫ్రిజ్ లు, బెడ్ లు సహా ఇంటికి అవసరమైన సామాగ్రినీ ఉచితంగా అందిస్తారు . అత్యంత పేద కుటుంబాలకు చెందిన యువతులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వినయ్ అగర్వాల్ తెలిపారు. ఏటా లబ్ధిదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతానని ఆయన వెల్లడించారు.

26, అక్టోబర్ 2026, సోమవారం

ఉచిత కాశీ మరియు అయోధ్య యాత్ర

 కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్ వద్ద గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైశ్య నిరుపేద భక్తుల కోసం ఏర్పాటుచేసిన" అయోధ్య మరియు కాశి ఉచిత యాత్ర " కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గంప శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర మూడవ సంవత్సరానికి చేరుకోవడాన్ని అభినందించారు. వైశ్య నిరుపేద భక్తుల కోసం గంప శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో ఈ యాత్రను ఏర్పాటు చేయడం, సుమారు 8 రోజుల పాటు సాగే యాత్ర కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను ఏర్పాటు చేసి దాదాపు 45 కుటుంబాల సభ్యులను "అయోధ్య, కాశీ క్షేత్రాలకు ఉచితంగా తీసుకువెళ్లడం"  చాలా గొప్ప విషయం అన్నారు. యాత్రకు బయలుదేరిన భక్తులకు ఎలాంటి  అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారని అన్నారు. అయోధ్య రాముడు మరియు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో భక్తుల యాత్ర సుఖంగా సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, వైశ్య సంఘం ప్రతినిధులు, బిజెపి నాయకులు మరియు యాత్రకు బయలుదేరిన భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు. 

నిరుపేదలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ

 బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సర్జరీలు..

ప్రమాదవశాత్తు శరీరం కాలిపోయి తీవ్ర గాయాల పాలైన నిరుపేద బాధితులకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్లు బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ / బి ఎస్ ఎం ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. పెగా సిస్టం సంస్థ ఆర్థిక సహకారంతో చేపట్టనున్న ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమై ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని వారు తెలిపారు. ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీలను భరించలేక చికిత్సకు దూరంగా ఉంటున్న బాధితుల కోసం ముందుకొచ్చిన పెగా సిస్టం సంస్థకు ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలను ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మాటిక్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరగనున్నట్లు వారు తెలిపారు.

కాలిన గాయాల బాధితులకు అండగా నిలుస్తూ వారికి పునరావాసం కల్పించేందుకు నిహారి మండలి చేస్తున్న కృషి గొప్పది.2009 లో తీవ్ర కాలిన గాయాలకు గురైన తాను ఆర్థిక ఇబ్బందుల వల్ల అవసరమైన సర్జరీలు చేయించుకోలేక పోయానని , తర్వాత జర్మనీ వైద్యుల సహకారంతో ఉచితంగా శస్త్ర చికిత్సలను చేయించుకున్నట్లు తెలిపారు.

ఆ కష్టాలు మరెవరికీ వద్దన్న సంకల్పం తో " బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్" 2014లోస్థాపించానని.. కార్పొరేట్ సంస్థ ల సహకారం తో 420 ఉచిత శస్త్ర చికిత్సలు చేయించినట్లు ఆమె తెలిపారు . బాధితులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని ఆమె పేర్కొన్నారు.

 పెగా సిస్టం సంస్థ సహకారంతో " బర్న్స్ టు షైన్ - 2026 " కార్యక్రమం చేపట్టానని,ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలోని అర్హులైన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ల కోసం 7680974918 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు. 

ఉచిత రీల్స్ శిక్షణ @సాయి ప్రీతమ్, నిజామాబాద్

 బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కాగానే ఉన్నత చదువుల  కోసం యూఎస్ ,లండన్ కు వెళ్లాలని అమ్మానాన్నలు చెప్పినప్పటికీ నిజామాబాద్ లోని దుబ్బ ప్రాంతానికి చెందిన సాయి ప్రీతం వినిపించుకోలేదు. ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదని సొంతంగా స్టార్టప్ ప్రారంభించారు .స్థానికంగా ఉన్న గిరిరాజు కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే తల్లితండ్రులపై ఆధారపడకుండా ప్రైవేటు ఉద్యోగం చేసిన అతడు ,తన సంపాదనతో ఒక నాన్ వెజ్ దుకాణం నిర్వహించారు .అప్పట్లో ప్రమోషన్ కోసం చేసిన రీల్స్ తన ఆలోచనను మార్చాయి అంటున్నాడు ఈ యువకుడు .ఇతనికి ఇన్స్టాలో 16,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు .ఆ తర్వాత ఎంబీఏ చేస్తూనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని నెలకొల్పారు." రీల్స్ మేకింగ్ పై ఆసక్తి ఉన్న యువతకు ఉచిత శిక్షణ " ఇస్తున్నారు. ఇటీవలే పాడ్ కాస్ట్ రంగం లోకి కూడా ప్రవేశించారు.  సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు .అంతటితోనే ఆగిపోకుండా కేసరి అనే పేరుతో బైక్ లపై వాణిజ్య ప్రకటనల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు .సొంత నగరమైన నిజామాబాదులోనే పేరు సంపాదించడం మరియు మరో 10 మందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది అని, అమ్మానాన్నలు సుజాత ,చంద్రశేఖర్ సన్నిహిత మిత్రుల సహకారం మరచిపోలేను అని సాయి ప్రియతమంటున్నారు. 

23, అక్టోబర్ 2026, శుక్రవారం

ఫ్రీ స్కూల్ మెటీరియల్@పెరంబూర్, తమిళనాడు.

 తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ గారి సొంత నియోజక వర్గం " పెరంబూర్". ప్రస్తుతం ఇచట ఉచితంగా పేదలకు విద్యా ఉపకరణాలను అందించే సరికొత్త సదుపాయాన్ని కల్పించారు. శర్మ నగర్ మొదటి మెయిన్ రోడ్ లో ఉన్న MLA కార్యాలయం భవనం గోడకు వెలుపలి వైపు ఒక షెల్ఫ్ ఏర్పాటు చేశారు. ఈ షెల్ఫ్ లో విద్యార్థులకు ఉపయోగపడే పెన్నులు, పెన్సిల్ లు, బ్యాగులు, నోటు పుస్తకాలు తదితర వస్తువులను ఉంచారు. విద్యార్థులు నేరుగా ఇక్కడికి వచ్చి ఎవరి అనుమతి లేకుండా స్వేచ్ఛగా , సొంతంగానే తమకు కావలసినవి తీసుకోవచ్చు. 

ఈ వసతిని పలువురు పేద తల్లి దండ్రులు,విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు.

పే టీ ఎం, ఏ యూ బ్యాంక్.. ఉచిత రూపే క్రెడిట్ కార్డు

 పే టీ ఎం, ఏ యూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో "జీవిత కాల ఉచిత రూపే క్రెడిట్ కార్డు" ను ప్రారంభించాయి. అర్హత గల యూపీఐ ఖర్చులపై 2%, ప్రయాణ బుకింగ్ లు , బంగారం కొనుగోళ్లపై 5% వరకు రివార్డులు లభిస్తాయి. విమాన టికెట్ల బుకింగ్ పై గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులు ఏడాదికి 12 సార్లు " ఉచితంగా విమానాశ్రయ లాంజ్" లలోకి ప్రవేశించవచ్చు. యాప్ లో ఈ కార్డును పొందవచ్చు. 

తరచుగా ప్రయాణాలు చేసేవారు ఎయిర్ పోర్ట్ లాంజ్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే కుటుంబాల కోసం ఈ కార్డు ఉపయోగ పడుతుంది. ఈ కార్డు భారత దేశపు తొలి ఫ్యామిలీ లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డు.దీనికి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజులు ఉండవని ఈ రెండు సంస్థలు తెలిపాయి.నిత్యావసరాలు , క్యాబ్ రైడ్స్ కు చెల్లింపులు సహా అర్హత గల పే టీ ఎం యూపీఐ చెల్లింపులపై ఏ యూ ఎస్ ఎఫ్ బి క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రత్యేకత. పే టీ ఎం ద్వారా బుక్ చేసుకున్న రౌండ్ ట్రిప్ ఫ్లయిట్ టికెట్లపై దీన్ని పొందవచ్చు.నలుగురు కుటుంబ సభ్యుల వరకు లాంజ్ యాక్సెస్ పొందవచ్చు.

ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...