నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బెజ్జారపు లింబాద్రి తెలిపారు .గత 60 ఏళ్లుగా ఈ చేప మందు కోసం జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని ఆయన తెలిపారు. ఆస్తమా, దగ్గు ,దమ్ము వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చేప ముందు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని లింబాద్రి పేర్కొన్నారు.
Monday, 8 June 2026
సోను సూద్ ఉచితం అంబులెన్స్ సేవలు
సోనూ సూద్ ఉచిత అంబులెన్స్ ల పంపిణీ, ఉచిత ఆటోల పంపిణీ, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులలో ఉచిత నిత్యాన్నదానం.
అంబులెన్స్ ని స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదేనని నటుడు సోనుసూదన్నారు. ఆదివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద సోను సూద్ మరియు మాల్యవీ కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు" ఉచితంగా ఆటోలను "పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి ,అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ,నగరంలోని దమ్మాయిగూడ, చిలుకానగర్ ప్రాంతాల నిరుపేద ఆటో కార్మికులకు ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన అంబులెన్స్ను స్వయంగా నడిపి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ సంకిరెడ్డిపల్లి, మరియు అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోనుసూద్" ఉచిత అంబులెన్స్ ను "వినియోగించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు .జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు "ఉచితంగా ఆటోలను" అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం వంటిదని సొసైటీ వ్యవస్థాపకులు కొండ కృష్ణమ్మను అభినందించారు సోనూ సూద్. కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ 2004లో ప్రారంభించిన ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ గాంధీ, నిలోఫర్ ఆసుపత్రి లలో నిత్యాన్నదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
వన్ హెల్త్ ఫార్మసీ వారి ఉచిత ఆరోగ్య పరీక్షలు
వన్ హెల్త్ ఫార్మసీ మల్లారెడ్డి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది హెల్త్ ఎసెన్షియల్స్ మరియు ఔషధాలపై 20 శాతం నుండి 70 శాతం వరకు డిస్కౌంట్.
వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కొనుగోళ్లపై 10000 రూపాయల విలువైన" ఆరోగ్య పరీక్షలు ఉచితంగా" నిర్వహిస్తారు లేదా" ఉచిత పిల్ బాక్స్" అందజేస్తారు
హౌస్ నెంబర్ 5-3-113
నిజాంసాగర్ చౌరస్తా
Nh 44 రోడ్డు
కామారెడ్డి జిల్లా
తెలంగాణ
9121812181 ,8309867689
పార్థ డెంటల్ వారి ఫ్రీ ఆఫర్
డెంటల్ హాస్పిటల్స్ లో ప్రముఖ సంస్థ అయిన పార్థ డెంటల్స్ వారు ఈ నెల అంటే జూన్ 2026 మొత్తం ఒక ఉచిత చికిత్స ఆఫర్ ప్రకటించింది.
అది invisalign open day ఆఫర్. ఈ ఆఫర్ లో ఫ్రీ కన్సల్టేషన్ ,ఫుల్ మౌత్ ఎక్స్ రే, రూ.15000 విలువైన డిజిటల్ స్కాన్ ను ఫ్రీ గా ఇస్తున్నారు.
పార్థ డెంటల్ లో aligners మీద 50000 నుండి 90000 డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కని దంత ఆరోగ్యాన్ని పొందండి.
అపాయింట్మెంట్ కొరకు..040-41420000 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.
పార్థ డెంటల్.. స్కిన్..హెయిర్....
4 రాష్ట్రాలలో.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక / బెంగళూరు, తమిళనాడు /చెన్నై ..
గో వైర్లెస్ , గో ఫర్ అలైనార్స్ ..పెద్దలకు,యువకులకు,పిల్లలకు .. మెటల్ బ్రెసెస్ లేకుండా అలైనార్స్ తో మీ చిరునవ్వును తీర్చిదిద్దుకోండి.
వాట్సప్ 85007 79000 ..
Friday, 5 June 2026
కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం
మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.
"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..
కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..
రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.
Wednesday, 27 May 2026
1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు
ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..
ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.
ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.
ఈ - దార్ పోర్టల్ అంటే..
ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..
పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.
వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.
రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.
బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు.
సత్వర వైద్యం అందుబాటులోకి..
కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు
ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.
ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..
ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.
ఉచిత ఫిజియోథెరపీ చికిత్స
భిక్కనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు వైద్యుడు నవీన్ సాయి ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మానసిక ఉపేశమానం కలుగుతుందన్నారు. ప్రతి మంగళ, గురువారం భవిత కేంద్రంలో ఈ ఉచిత ఫిజియోథెరపీ శిబిరం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఆర్పి మహేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బీర్కూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు " ఉచిత కంటి పరీక్షలు " నిర్వహించారు. మోతి బిందు ఉన్న 11 మందిని బోధన్ లయన్స్ క్లబ్ దవాఖానకు తరలించినట్లు వైద్యుడు సతీష్ తెలిపారు. వీరికి అక్కడ " ఉచితంగా మోతి బిందు శస్త్ర చికిత్స "చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ సభ్యులు సాయి కృష్ణ, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Monday, 25 May 2026
RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం
నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Monday, 18 May 2026
అఖండ జ్యోతి కంటి ఆసుపత్రి బీహార్
బీహార్ లోని సరాన్ జిల్లాలో ఆదివారం కంటి ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ఆదాని హాజరయ్యారు .సరౌన్ జిల్లా కేంద్రం శివారులలో 150 కోట్ల రూపాయల మేరకు ఆదాని ఫౌండేషన్ సహాయంతో భారీ స్థాయిలో ఇక్కడ అఖండ జ్యోతి కంటి ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు .ఇక్కడి మస్తీ చాకులో ఆసుపత్రి పూర్తి అయితే వార్షికంగా మూడు లక్షలకు పైగా కంటి ఆపరేషన్లు జరుగుతాయి. వేయి మంది కంటి వైద్యులకు అవసరమైన అధునాతన శిక్షణ అందుతుంది .శంకుస్థాపన కార్యక్రమానికి ఆదాని, ఆయన భార్య అదానీ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రీతి ఆదానీ హాజరయ్యారు. కార్యక్రమం నేపథ్యంలో ఆదాన్ని దంపతులు మాట్లాడారు తాము సేవనే ధర్మంగా పరిగణిస్తామని ప్రకటించారు .మొత్తం మీద ఇక్కడ ఆసుపత్రికి 500 కోట్ల రూపాయల మేర వ్యక్తిగత సహాయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తాము చేపట్టబోయే దీర్ఘకాలిక మానవీయ, సామాజిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల దిశలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా గౌతమ్ ఆదనీ తెలిపారు.
జన్నేపల్లిలో ఉచిత వైద్య శిబిరం
నవీపేట మండలంలోని చన్నేపల్లిలో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. కోశాలేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురికి దంత పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ మూడుసు గంగాధర్ ఉపసర్పంచ్ వీరేందర్రావు ఐద్య సిబ్బంది ప్రసూన మనీత్ రావు, అనిల్, అజయ్ కార్తికేయ భరత్ పాల్గొన్నారు.
Saturday, 2 May 2026
ఫ్రీ కన్సల్టేషన్ @ కామారెడ్డి
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల కీర్తి హాస్పిటల్ నందు రోగులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చూడబడును.
మూడు రోజుల పాటు ఫ్రీ కన్సల్టేషన్ కలదు.కావున రోగులు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నిజాంసాగర్ చౌరస్తానందుకల కీర్తి హాస్పిటల్ ,జనరల్, సర్జికల్ ,డెంటల్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ లో సంప్రదించి ఉచితంగా సేవలు పొందవచ్చు. ఫోన్ నెంబర్ 08468469989 , సెల్ నెంబర్ 9392242750 నందు పూర్తి వివరాలకు సంప్రదించవచ్చు.
Saturday, 11 April 2026
ఉచిత కంటి వైద్య శిబిరం@మాక్లూర్
మాకూర్ మండల పరిధిలోని ఆర్టీసీ కాలనీలోని మాక్లూర్ పోలీస్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఆటో డ్రైవర్లు మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి చూపు అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యం పై ముఖ్యంగా కంటిచూపుపై దృష్టి పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కాపాడవచ్చును సూచించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఐ డ్రాప్స్ అందించినట్లు పేర్కొన్నారు .
ఇందులో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ మాక్లోర్ ఎస్సై 2 మొగులయ్య నవీపేట్ ఎస్సై టు యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Thursday, 9 April 2026
10 న ఉచిత ఆయుష్ వైద్య శిబిరం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోఎస్ కాలనీలో ఈ నెల 10వ తేదీన ఉచిత మెగా ఆయుష్ ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత తెలిపారు .ప్రజా పాలనా, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు ఎన్జీవోఎస్ కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు .
ఈ సందర్భంగా హోమియోపతి ,ఆయుర్వేదం ,యునాని పరీక్షలు ఉచితంగా జరపనున్నట్లు తెలిపారు. ఉదయం 6:30 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా నిర్వహణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కామారెడ్డి పట్టణ ప్రజలు ,పరిసర ప్రాంతాల ప్రజలు, 14వ వార్డు ప్రజలు హోమియోపతి ,యునాని, ఆయుర్వేద పరీక్షలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య అధికారులు హాజరవుతారని తెలిపారు .
ఈ కార్యక్రమంలో హోమియోపతి, ఆయుర్వేద, యునాని యోగ డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జునైద్ బేగం, డాక్టర్ విజయ, డాక్టర్ దేవయ్య, ఫార్మసిస్ట్ కిషోర్ ,యోగ మాస్టర్ బాల్ లింగం తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 8 April 2026
నేడు పెద్ద మల్లారెడ్డి లో వైద్య శిబిరం
భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆర్వీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ సాయ గౌడ్ ,ఉప సర్పంచ్ చైతన్య మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో ఆర్విఎం ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని అన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శాస్త్ర చికిత్సలు ,ఇతర మెరుగైన వైద్యం కావాల్సిన వారిని గురువారం ప్రత్యేక వాహనంలో ఆర్విఎం ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు.
ఆసుపత్రికి ఉచితంగా సి ప్యాప్ యంత్రం అందజేత
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీప్యాప్ యంత్రాన్ని కొందరి వైద్యులు ఉచితంగా అందజేశారు. ఆసుపత్రిలో విజయవంతంగా ఇన్స్టాలేషన్ పూర్తయింది.
ఈ యంత్రాన్ని హైదరాబాదులోని అంకుర ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి ఇన్స్టాలేషన్ చేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఎం సి హెచ్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ మరియు డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షించారు.
యంత్రం సక్రమంగా పనిచేస్తూ ,రోగులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు. ఈ యంత్రం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యుల తెలిపారు.
ఈ సందర్భంగా ఈ యంత్రాన్ని ఉచితంగా అందజేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Saturday, 4 April 2026
ఉచిత వైద్య శిబిరం @ రెంజల్
ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెంజల్ జిల్లాపరిషత్ పాఠశాల లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నాయకుడు నల్ల నవీన్ కుమార్ తెలిపారు.
రెంజల్ మండలం, పరిసర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇట్టి వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని ,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.
ఇట్టి మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ,మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. శుక్రవారం నాడు ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు .
ఈ కార్యక్రమంలో కాలేవార్ సంజీవ్, సాయి ప్రకాష్, సాయి కమార్ ,సంజయ్, గంగరాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 1 April 2026
ఉచిత మెగా జాబ్ మేళా @ మెదక్
మెదక్ జిల్లాలో ని యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం కోసం ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏప్రిల్ 2 వ తేదీన మెదక్ ప్రైవేట్ ఐటిఐ ప్రాంగణంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ అపోలో ఫార్మసీ లో పని చేయుటకు డి. ఫార్మసీ, బి ఫార్మసీ , ఎం ఫార్మసీ అర్హత ఉన్న వారు అర్హులని అన్నారు.వయసు 18 నుండి 35 మధ్య ఉండాలని ,జీతం 20 వేలవరకు లభిస్తుందని తెలిపారు.25 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు.17 వేల వరకు జీతంతో 20 ట్రైనీ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.
టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతలతో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..
బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ,న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, అర్హతలతో 5 ప్రొడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ..12 వేల వరకు జీతంతో..
ఆసక్తి,అర్హతలు గల వారు,అనుభవం, ఫ్రెషర్స్ కూడా తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళా కు రావాలని సూచించారు.
మిగతా వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం
మన కామారెడ్డి లోని వివేకానంద కాలనీ ఆర్యవైశ్య సంఘం రిజిస్టర్ నెంబర్ 565 కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పటల్ వారిచే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం ,వివేకానంద కాలనీ, మునిసిపల్ ఆఫీస్ ప్రక్క వీధిలో, కామారెడ్డిలో ఏప్రిల్ 5వ తేదీ 2026న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది
ఉచిత కన్సల్టేషన్ మరియు చెకప్, ఉచిత మందులు, ఉచిత ఎక్స్ రే చేయబడును. డాక్టర్స్ సలహా మేరకు .
3000 విలువ గల బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష కూడా చేయబడును.
ఒక్క రోజులోనే 38 మోకీలు మార్పిడి చేసిన అనుభవం కలిగిన శ్రీకర హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ కొమురవెల్లి ఎమ్మెస్ తో రోబోటిక్ మోకీలు మార్పిడి ఆర్థోస్కోపీ మరియు ప్రామాణిక నిపుణులు .
వివరాలకు 9000992998 మరియు 9866113630 లలో సంప్రదించండి.
నిర్వాహకులు ..
వలిపీశెట్టి లక్ష్మీరాజం ..అధ్యక్షులు
తాటిపాముల వెంకటకృష్ణ ..ప్రధాన కార్యదర్శి
కంకణాల శేఖర్ ..కోశాధికారి
పాత సత్యం.. గౌరవ అధ్యక్షులు
Monday, 30 March 2026
ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం
10-3-2026 నుండి 9-4-2026 వరకు
పశువులలో సంభవించే గాలికుంటు వ్యాధిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.
గాలికుంటు వ్యాధి ద్వారా పశువులు అనారోగ్యానికి గురై పాలు సరిగా ఇవ్వకపోవడం ,ఇంకా పలు రకాల సమస్యలు వస్తాయి.నోట్లో పుండ్లు పడతాయి. తీవ్ర జ్వరం వస్తుంది.
వీటిని నివారించి ఆవులు, గేదెల ఆరోగ్యాన్ని కాపాడడానికి
ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు..
ప్రభుత్వ వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ వారు గ్రామానికి వచ్చినప్పుడు ఆవులు, గేదెల కు టీకాలు వేయించి ఈ " జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం" ను విజయ వంతం చేయాలని కోరుతున్నారు...
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...











