Wednesday, 27 May 2026

శుభకార్యాలకు ఉచిత స్టీల్ ప్లేట్లు గ్లాసులు

 పాలిథిన్ ప్లేట్ల వాడకంతో ఆరోగ్యం తో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొన్ని గ్రామాల పాలకవర్గాలు పాలిథిన్ ప్లేట్లపై యుద్ధం ప్రకటించాయి. కేవలం నిషేధం ఉత్తర్వులకే పరిమితం కాకుండా ఆచరణాత్మక దిశగా అడుగులు వే స్తున్నారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు నడుం బిగించాయి. ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు వాడటానికి శ్రీకారం చుట్టాయి. ఆలయాలలో శుభకార్యాల లో సామూహిక భోజనాలకు స్టీల్ ప్లేట్లనే వాడుతున్నారు. వందల మంది జనం భోజనం చేసేలా ఈ ప్లేట్లను విరాళంగా అందిస్తూ దాతలు సైతం సహకరిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఉద్యమంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తరిస్తుంది. 

కమ్మర్పల్లిలోని పాటి హనుమాన్ ఆలయం  ఉంది. కొన్ని ఏళ్లుగా ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నార . పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని భోజనం చేస్తారు. వీరంతా ఉపయోగించిన ప్లేట్లతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ఆరోగ్యానికి ప్రమాదమని గ్రహించిన ఆలయ నిర్వాహకులు స్టీల్ ప్లేట్లను వినియోగించాలని నిర్ణయించారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఆలయానికి విరాళంగా అందించి సహకరించారు. ఈ స్ఫూర్తి గ్రామంలో జరిగే జాతరలు శ్రీరామ నవమి, వినాయక చవితి ఉత్సవాలలో కొనసాగింది .ప్రస్తుతం ఊరిలో ఉత్సవం ఏదైనా స్టీల్ ప్లేట్ల వాడకం పక్కాగా అమలు అవుతుంది. తాజాగా శుక్రవారం దేవి ఆలయం వద్ద సైతం స్టీల్ ప్లేట్లే వాడాలని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానించింది .భక్తులు పెద్ద ఎత్తున ప్లేట్లు ,గ్లాసులు విరాళంగా అందించారు. ఈ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పక్క గ్రామాలు కమ్మర్పల్లి స్టీల్ ప్లేట్లను తీసుకెళ్లి తమ గ్రామాల ఉత్సవాలలో ఉపయోగించుకుని తిరిగి ఇచ్చేస్తున్నారు.


ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్లు ,250 గ్లాసులు కొనుగోలు చేశారు .గ్రామంలో జరిగే వేడుకలు ఇతర కార్యక్రమాలలో ఉపయోగించుకోవాలని తీర్మానం చేశారు. గ్రామ మహిళా సమాఖ్యలకు అందజేసి అందుబాటులో ఉంచారు. ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించడంతో క్రమంగా వారిలో మార్పు మొదలైంది. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో సైతం ప్లాస్టిక్ వాడొద్దని పాలకవర్గం తీర్మానించింది .వాడకం క్రమంగా తగ్గుముఖం పట్టింది.

ఉచితంగా అందించారు..

శుభకార్యాలు ఇతర కార్యక్రమాలలో ప్లాస్టిక్ వస్తువులు వాడకాన్ని తగ్గించాలని అనుకున్నారు నందిపేట సర్పంచి సిలిండర్ లింగం. వెంటనే సమస్య పరిష్కారానికి కార్యాచరణ మొదలుపెట్టారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా స్టీల్ వస్తువులు వాడాలని సూచించారు. ఇందుకు తన సొంత ఖర్చులతో ఐదువేల స్టీల్ ప్లేట్లు 5000 గ్లాసులు కొనుగోలు చేసి గ్రామానికి "ఉచితంగా "అందించారు. 

సొంత డబ్బుతో కొనుగోలు..ఉచితంగా పంపిణీ 

 నవీపేటకు చెందిన నాంపల్లి వసంత్ అతడు స్నేహితులు రమేష్, శిరినాగిరి కలిసి సొంత డబ్బుతో 500 స్టీల్ ప్లాన్యాలు 400 గ్లాసులు కొనుగోలు చేశారు. వీటిని ఇప్పటివరకు 13 వివాహాలు 30 శుభకార్యాలకు ఉచితంగా అందించారు. గత ఏడాది వసంత్ తన కూతురు వివాహ వేడుకను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించారు.




No comments:

Post a Comment