Tuesday, 14 April 2026

ప్రకృతి సేద్యం పై 3 రోజుల ఉచిత శిక్షణ

 సేంద్రీయ/ ప్రకృతి సేద్యం పై ఎన్టీర్ జిల్లా లోని నూజివీడు వద్ద గల కొండపర్వలోని కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రో ఎకాలజి సంస్థ లో ఈ నెల 28 నుండి 30 తేదీ వరకు 3 రోజులపాటు రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రైతులతో కలిసి పని చేసే క్షేత్రస్థాయి విస్తరణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ,రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, రైతు సంక్షేమ సంఘాలు, సహకార సంఘాలు ,బ్యాంకులు, ఉద్యాన, వ్యవసాయ, పశు విశ్వవిద్యాలయాల సిబ్బంది ఈ శిక్షణకు అర్హులని తెలిపారు .

పూర్తి వివరాలకు 8500283300 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

No comments:

Post a Comment

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉ...