Showing posts with label ఫ్రీ గవర్నమెంట్ సర్వీసెస్. Show all posts
Showing posts with label ఫ్రీ గవర్నమెంట్ సర్వీసెస్. Show all posts

Wednesday, 27 May 2026

1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు

 ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు  ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.

ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.

ఈ - దార్ పోర్టల్ అంటే..

ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..

పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.

రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.

బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు. 

సత్వర వైద్యం అందుబాటులోకి..

కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు

ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.

ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..

ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.





Sunday, 24 May 2026

ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు

 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మై ఆధార్ పోర్టల్ లో ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ గడువు ను పొడిగించింది. ఆధార్ కార్డు దారులు ఇప్పుడు తమ గుర్తింపు,చిరునామా ఆధార పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా 2027 జూన్ 14 వరకు అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటున్న ఆధార్ కార్డు దరుల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఆధార్ కార్డుదారులు కొత్త ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ కొత్త యాప్ లో సురక్షితమైన ఆధార్ క్యూఆర్ ఆధారిత   ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయని UIDAI వివరించింది. 

5-17 ఏళ్ల వారికి ఆధార్ సవరణ ఉచితం

 ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారికి మొదటిసారి ఆధార్ కార్డులో వివరాలను ఆధార్ కేంద్రాలలో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని UIDAI హైదరాబాద్ రీజినల్ అధికారులు తెలిపారు.

ఐదేళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్, ఐరిస్ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా ఐదు నుంచి ఏడు ఏళ్లు మరియు 15 నుంచి 17 ఏళ్లు మధ్య వయసు గల వారికి మాత్రమే నమోదు కేంద్రాలలో మొదటిసారి వివరాల సవరణలను ఉచితంగా చేస్తారు .కానీ ఈసారి ఐదు నుంచి 17 ఏళ్ల వయసు గల వారందరికీ సెప్టెంబర్  30 వరకు ఉచితంగా సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డులో చిరునామా తదితర వివరాలను ఆన్లైన్లో ఉచితంగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్ 14 వరకు ఉండగా దీనిని మరొక ఏడాది పొడిగించినట్లు తెలిపారు.

Sunday, 29 March 2026

ఉచిత రైలు .. గ్యాలంట్రీ అవార్డీలకు..

 వేలాది సైనికులకు లబ్ధి చేకూరే విధంగా భారత ప్రభుత్వం, అసాధారణ శౌర్యం ప్రదర్శించి గ్యాలంట్రీ అవార్డులు పొందిన సైనిక,నావికాదళ,వైమానిక దళ వీరులకు ఉచిత రైలు సౌకర్యం కల్పించింది..

జీవితాంతం  ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ  రక్షణ శాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది.వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేసింది..వారితో ఒక సహచరుడు కూడా ఈ సౌకర్యం పొందవచ్చు..

అవార్డు పొందిన వీరుడు మరణించినట్లయితే అతని భార్య లేదా భర్త.. మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు ఈ సౌకర్యం పొందవచ్చు.

అవార్డు మరణానంతరం వచ్చినట్లయితే అతని తల్లి దండ్రులకు ఈ ప్రయోజనం కలుగుతుంది.

ఈ పథకం కింద లబ్ధిదారులు ఒక సహచరుడితో కలిసి జీవితాంతం ఇండియన్ రైల్వే లో ఉచితంగా ప్రయాణించవచ్చు.ఆయా రైళ్లలోని ఏసీ చైర్ కార్, ఫస్ట్ క్లాస్,సెకండ్ ఏసీ  వంటి సౌకర్య వంతమైన తరగతులలో ప్రయాణించవచ్చు.

సైనికులకు గౌరవ ప్రదమైన ప్రయాణం కల్పించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్రం తెలిపింది.ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రక్షణ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వేలాది మంది సైనిక కుటుంబాలకు లబ్ధి కలగనుంది.

పరమ వీర చక్ర, మహా వీర చక్ర, వీర చక్ర,అశోక చక్ర, శౌర్య చక్ర వంటి పురస్కారాలు యుద్ధం, అత్యవసర పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేస్తారు. గ్యాలంట్రీ అవార్డులు సైనికుల ధైర్యం,త్యాగాలకు ప్రతీకగా నిలుస్తాయి..

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...