Showing posts with label ఫ్రీ స్పోర్ట్స్ కోచింగ్. Show all posts
Showing posts with label ఫ్రీ స్పోర్ట్స్ కోచింగ్. Show all posts

Thursday, 14 May 2026

ఉచిత త్రో బాల్ శిక్షణ శిబిరం

ఈషా గ్రామోత్సవం..ఆటలు,వేడుకలు,పురోగతి



14 ఏళ్ళు మరియు ఆ పైబడిన గ్రామీణ మహిళల కోసం ఉచిత త్రోబాల్ శిక్షణ శిబిరం. సులువైన మరియు ఆసక్తికరమైన పద్ధతిలో ఈ ఆటను నేర్చుకోండి. అనుభవజ్ఞులైన కోతుల వద్ద శిక్షణ పొందవచ్చు. అలాగే ఈశా గ్రామోత్సవం కోసం మీ సొంత  జట్టును ఏర్పాటు చేసుకోండి. పాల్గొని ఐదు లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం పొందండి. 

కొత్త వాళ్లు కూడా సులభమైన పద్ధతిలో త్రో బాల్ నేర్చుకునే అవకాశం ఇది. సరదా ఆటలు వినోద కార్యక్రమాలలో పాల్గొనండి. నిపుణులైన కోచ్ల నుండి ప్రత్యేక శిక్షణ పొందండి. ప్రతిరోజు అల్పాహారం అందించబడుతుంది. ఈషా గ్రామోత్సవం కోసం మీ సొంత జట్టును ఏర్పాటు చేసుకొని పాల్గొని ఐదు లక్షల రూపాయలు బహుమతి పొందే అవకాశం పొందండి.

పరిమిత సీట్లు ..ఇప్పుడే చేరండి..


వేదిక ..సిరిసిల్ల ..రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం

తేదీ ..మే 13 నుండి 17 వరకు 

ఈరోజే రిజిస్టర్ చేసుకోండి..

Isha.co/grm-camp 

మరిన్ని వివరాలకు..8300030999


తేదీ ..మే 20 నుండి 24 వరకు 

వేదిక.. కరీం నగర్, తెలంగాణ.


తేదీ ..మే 27 నుండి 31 వరకు 

వేదిక.. వరంగల్, తెలంగాణ 


తేదీ.. మే 27 నుంచి 31 వరకు 

వేదిక..చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ 


తేదీ ..మే 27 నుంచి 31 వరకు 

వేదిక.. విశాఖ పట్నం , ఆంధ్రప్రదేశ్ 


తేదీ ..మే 18 నుంచి 22 వరకు 

వేదిక .. పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ 


తేదీ మే 20 నుంచి 24 వరకు 

వేదిక.. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్..


ఉచిత క్రికెట్ శిక్షణ @ కామారెడ్డి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి ఉచిత వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బుధవారం ప్రారంభమైంది.. కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్ జిల్లా క్రీడా అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రీడా అని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి హెచ్సీఏ ఉచిత శిక్షణను అందిస్తోందని తెలిపారు . అండర్ 15 అండర్ 19 ఓపెన్ కేట ఏరియాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా రాష్ట్ర సయి సెలక్షన్లలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు క్రీడలు యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మానసిక ధైర్యాన్ని , ఉజ్వల భవిష్యత్తును అంతిస్తాయని తెలిపారు కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజం అలీ ఖాన్ కోచులు రామకృష్ణ రియాజ్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Friday, 8 May 2026

సంస్థాన్ నారాయణపూర్ లో ఉచిత శిక్షణ

 సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగ, టైక్వాండో ,వాలీబాల్ వంటి క్రీడలలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. యోగ వలన విద్యార్థులకు ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయని ,టైక్వాండో శిక్షణ ద్వారా తమ ఆత్మ రక్షణ లభిస్తుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. 

శిక్షణ సమయం.. 

ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు.. మరల సాయంత్రం 5:00 నుండి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వ్యాయామంలో మెలకువలు నేర్పి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వాలీబాల్ శిక్షణ ఇస్తున్నారు .సాయంత్రం అరగంట పాటు టైక్వాండో ద్వారా ఆత్మ రక్షణలో మెలకువలు నేర్పి, అరగంట పాటు పెద్దలపట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను, స్ఫూర్తి దాతల జీవిత విశేషాలను బోధిస్తున్నారు..

పౌష్టికాహారం.. 

శిక్షణ సమయంలో ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, ఒక అరటి పండును అందజేస్తున్నారు. ప్రతిరోజు తీసుకోవలసిన ఆహారం గురించి చక్కని అవగాహన కల్పిస్తున్నారు. 

నాలుగు సంవత్సరాలుగా శిక్షణ..

 జిల్లా యువజన క్రీడా శాఖ, సంస్థాన్ నారాయణపూర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులను నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. బాలగోని యాదయ్య సలహాతో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు చిలువేరు సైదులు ఉచిత  శిక్షణ మొదలుపెట్టారు. గ్రామానికి చెందిన శికిల మెట్ల ప్రభాకర్, శ్రవణ్ ,బత్తుల మురళి, ధనుష్, యశ్వంత్ రవి ,సురేష్ సహకారంతో శిక్షణ కొనసాగుతుంది. విద్యార్థులకు గుర్రం కృష్ణ ,మల్లేష్ ,భరత్ అనే మాస్టర్లు టైక్వాండోలో శిక్షణ ఇస్తున్నారు. 

గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము వేసవి సెలవులలో విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచనతో యోగా వాలీబాల్ ఆత్మ రక్షణ కోసం టైక్వాండోస్ శిక్షణ ఇస్తున్నాము పెద్దల పట్ల సమాజం పట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను తెలియజేస్తున్నాము భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులు నారాయణపురం నుండి తయారు కావాలన్నదే లక్ష్యం అని స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ చిలువేరు సైదులు అన్నారు.

Wednesday, 6 May 2026

వేసవిలో క్రీడా శిబిరాలు

 వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ సిద్ధమైంది. ఇందుకోసం ఆయా మండలాలలో క్రీడలలో నైపుణ్యం కలిగిన వారిని శిక్షకులుగా నియమించింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 క్యాంపులు రూరల్ ప్రాంతాలలో, 10 క్యాంపులు అర్బన్ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో సుమా రు 20 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూరల్ ప్రాంతాలలో 5000 అర్బన్ ప్రాంతాలలో 7500 చొప్పున శిక్షకులకు ఇవ్వనున్నది. మే ఒకటి నుంచి జూన్ 7 వరకు ఈ శిబిరాలను వహించండి నిర్వహించనున్నారు. 

అర్బన్ లో నిర్వహించే క్రీడలకు మాత్రమే ఫీజు.. రూరల్ ప్రాంతంలో ఉచితం..

 అర్బన్ ప్రాంతాలలో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజు  చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ప్రాంతంలో క్రీడలకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పని క్రీడలలో అతనిటిక్స్ క్రీడాకారుడు 400 రూపాయలు చొప్పున బాస్కెట్బాల్కు 400 రూపాయలు బ్యాడ్మింటన్ కు వెయ్యి రూపాయలు క్రికెట్ 700 టేబుల్ టెన్నిస్ 700, స్కేటింగ్ స్విమ్మింగ్ టెన్నిస్ కు ఎనిమిది వందల రూపాయల చొప్పున ఫీజు నిర్ణయించారు..

రూరల్ ప్రాంతాలలోని శిబిరాలకు వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు.

Saturday, 2 May 2026

వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 గాంధారి మండలంలోని పెట్ సంఘం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభించినట్లు వాలీబాల్ కోచ్, వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారిణ, ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ వాలీబాల్ కోచ్ సోనియా సమక్షంలో శిబిరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు, ఆసక్తి గలవారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అంతర్జాలంలో 100 రూపాయలతో దరఖాస్తు చేసుకొని శిక్షణ పొందవచ్చని ఆమె తెలిపారు .శిబిరానికి బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున నెదర్లాండ్ కు చెందిన" లెట్స్ కీప్ ది బాల్ ప్లేయింగ్ ఫౌండేషన్ "వారు చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.



Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Tuesday, 28 April 2026

విద్యార్థులకు పోలీసుల ఉచిత వేసవి శిక్షణ శిబిరం..

 నార్నూర్ మండలంలోని విద్యార్థుల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మే నాలుగవ తేదీ నుండి 30వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రెండు నుండి పదవ తరగతి విద్యార్థులకు యోగ కరాటే కబడ్డీ వాలీబాల్ అంశాలలో "  ఉచిత శిక్షణ " ఇస్తారు. 

ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీ లోపు నార్నూర్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలి వివరాల కోసం 8712659942 లేదా 8712659961 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై కోరారు.

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉ...