నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.
మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.
విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.
మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.