సదా శివనగర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ యాక్టివ్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ యోసెఫ్ తెలిపారు. ఈ శిబిరం లో విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్ బేసిక్స్, ఇండోర్ గేమ్స్, డాన్స్ వంటి కార్యక్రమాలు నేర్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Monday, 8 June 2026
Wednesday, 27 May 2026
వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరం
నిజామాబాద్ లోని గంగస్థాన్లోని వివేకానంద ఆడిటోరియంలో రామకృష్ణ సేవా సమితి వారు వివేక్ సంస్కార వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును సంస్థ తరఫున మంగళవారం ఏర్పాటు చేశారు .వక్తలు మాట్లాడుతూ బాలల హక్కులు ,సంరక్షణ ,చట్టాలపై అవగాహన కల్పించారు . సెల్ఫోన్ వ్యసనం అనర్థాల గురించి వివరించారు. చిన్నారులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని న్యాయ సేవా సంస్థ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది రాజకుమార్ సుబేదార్ సూచించారు.
Saturday, 9 May 2026
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి..సిరికొండలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు నిర్వహించనున్న వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి రాజేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 25 వరకు నిర్వహించనున్న వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మండలంలోని పి ఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు అయిన వెల్లడించారు. విద్యార్థులకు క్రాఫ్ట్ ,కరాటే ,స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ డ్రాయింగ్, డాన్స్, సంగీతం, యోగ ,ఆటలు, నృత్యం, చిత్రలేఖనం, సృజనాత్మక అభివృద్ధి తదితర అంశాలలో శిక్షణ కొరకు శిక్షణ శిబిరాల నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకునే విద్యార్థులు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల సూచించారు. 9290559309 మరియు 9490771237 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.
ఏర్కెట్ల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉచిత సమ్మర్ క్యాంప్ ఫోన్ నెంబర్..9848512511
Friday, 8 May 2026
వైదిక గణితంలో ఉచిత శిక్షణ
వైదిక గణితంలో ఉచిత శిక్షణ.. మరియు ఫ్రీ సమ్మర్ క్యాంప్..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల శ్లోక పాఠశాల బ్రాంచి 2 లో ఉచిత వైదిక గణిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల సీఈఓ జాలిగామ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరగనుంది అన్నారు. 9 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు .శిబిరాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...

