31, మార్చి 2026, మంగళవారం

ఏ ఐ నేర్చుకోండి ఫ్రీ గా

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ..

ప్రస్తుతం ఇది ప్రతి రంగము లో  కీలకంగా మారింది. ఏఐ ప్రవేశంతో పని విధానాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనితో విద్యార్థుల నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు అందరూ తమ డొమైన్లో ఏ ఐ  టూల్ స్ ఉపయోగించడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం గురించి ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలామందికి ఏఐ కోర్సులు ఎక్కడ ,ఎలా అందుబాటులో ఉన్నాయో తెలియదు. ఐఐటీలు, ఐఐఎస్సి, ఐఐఎంలు, పలు ప్రభుత్వ వేదికలు ,అదే విధంగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉచితంగానే కోర్సులను అందిస్తున్నాయి .

వీటి గురించి అన్ని వివరాలు ఇలా..

1. స్వయం ప్లాట్ఫారం ..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఆన్లైన్ విద్యావేదిక ఇది.  ఐఐటీలు , ఐఐఎస్సీ ల ద్వారా 110 కి పైగా ఏఐ కోర్సులను అందిస్తున్నది .కోర్సులు ఉచితం, సర్టిఫికేషన్ కావాలంటే కొంత ఫీజు చెల్లించాలి .

పి ఎం కె వి వై..

 ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 స్కీం ద్వారా ఆన్లైన్ శిక్షణ .ఏఐ, మెషిన్ లెర్నింగ్ ,రోబోటిక్ పై అవగాహన పెంచుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కీం ద్వారా దాదాపు 50 వేల మంది  శిక్షణ పొందారు .

ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ..

ఇది కేంద్ర ప్రభుత్వం మరియు నాస్కాముల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ ప్రోగ్రాం. 500 కు పైగా కోర్సులు.. ఏఐలో డిజిటల్ ఫ్లూయెన్సీ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ ..

ఏ ఐ లో కెరీర్ కోసం బలమైన పునాది వేసుకునేందుకు ఇది దోహదపడుతుంది .

యువ ఏ ఐ ..

ఇండియా ఏఐ మిషన్ ద్వారా" ఏ ఐ ఫర్ ఆల్ "ప్రోగ్రామ్ ఇది. ఒక్కొక్క కోర్సు నాలుగు నుంచి నాలుగు, ఐదు గంటల వ్యవధిలో ఉంటుంది. ఏ ఐ బేసిక్స్ పై అవగాహన కల్పించేందుకు శిక్షణ పొందవచ్చు .

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు..

 ఐబీఎం.. ఏఐ ఫర్ బిగినర్స్, ఎంఎల్ బేసిక్ టూల్స్, ఫంక్షనాలిటీ,

 గూగుల్ క్లౌడ్.. జనరేటివ్ ఏఐ ..టెక్స్టింగ్, కోడ్ జనరేషన్, చాట్ బాట్స్ రూపకల్పన, ఫ్రీ సర్టిఫికేషన్ .

మైక్రోసాఫ్ట్ ఓపెన్ సోర్స్ .. టెన్సార్ ఫ్లో, పై టార్క్ ,ఐ ఓ టి, ఎంఎల్ , డేటా  సైన్స్, ఉచిత సర్టిఫికేషన్.

 ఆన్త్రోపిక్..

 కోర్సెరా ద్వారా ఆంత్రోపిక్ ఏ ఐ కోర్సులు.. ఏఐ ఫండమెంటల్, అప్లికేషన్స్ ,ఇంటిగ్రేషన్ ..

ఐఐటీలు ఐఐఎస్సీ కోర్సులు..

 ఐఎఎస్సి బెంగళూరు ..

ఏఐ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్,  ప్రోగ్రామింగ్ విత్ జనరేటివ్ ఏఐ.

 ఐఐటి గువాహటి..

 ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ, థియరీ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ.

 ఐఐటి ముంబై, ఢిల్లీ ..

ఎగ్జిక్యూటివ్ అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏ ఐ అండ్ డేటా సైన్స్.

ఐఐటి  చెన్నై..

 ఏఐ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ క్లాస్ 11, 12 విద్యార్థుల కోసం.

 ఐఐటీ ఖరగ్పూర్ అండ్ రూర్కి..

 హాండ్స్ ఆన్ అండ్ షార్ట్ టర్మ్  కోర్సులు .

మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్..

 ఐఐఎం బెంగుళూర్ ..

ఏ ఐ ఫర్ మేనేజర్స్, జనరేటివ్ అండ్ డేటా అనలిటిక్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ .

ఐఐఎం ముంబై ..

 ఏ ఐ,అనలిటిక్స్,  డిస్ రప్టివ్ టెక్ లో ఆన్లైన్ సర్టిఫికేషన్.

 ఐఐఎం అహ్మదాబాద్, కోల్కతా, లక్నో..

 ఆన్లైన్ర్ ఏ ఐ కోర్సులు..

   అంతర్జాతీయంగా..

 హార్వర్డ యూనివర్సిటీ ..ఇంట్రడక్షన్ టు ఏఐ విత్ పైథాన్.

 యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి..

 ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఐ,రియల్ వరల్డ్ ఏఐ అప్లికేషన్స్..

 

ఇతర ప్లాట్ఫార్మ్స్..

  గ్రోక్ ఏ ఐ..  ఏ ఐ బిగినర్ కోర్సును అందిస్తోంది. ఇందులో ఫౌండేషన్ ,ప్రాంప్ ఇంజనీరింగ్ మరియు కంటెంట్ క్రియేషన్ పై శిక్షణ ఉంటుంది ..

ఇలా నేర్చుకోవచ్చు..

 మొదట బేసిక్ ఏఐ, ఎంఎల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి( పైథాన్, మరియు డేటా హాండ్లింగ్)

 హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి.

 ఏ ఐ సర్టిఫికేషన్ పూర్తి చేసుకోవడం ద్వారా రెజ్యూమెల్లో చూపించుకోవచ్చు.

 కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఇండస్ట్రీ టూల్స్( గూగుల్ ఏ ఐ,ఐబిఎం వాట్సన్ ,మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఏ ఐ) నేర్చుకోవాలి.

 ఈ కోర్సులన్నీ ఇంటర్నెట్ ద్వారా తక్కువ సమయంలోనే ఉచితంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్రాక్టికల్ ప్రాజెక్టులు, సర్టిఫికేషన్ లు పూర్తి చేసుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంచుకొని జాబ్ మార్కెట్లో అవకాశాలు విస్తృతంగా దక్కించుకోవచ్చు .

సూచనలు..

 కొత్తగా నేర్చుకునే వారైతే ఎలిమెంట్స్ ఆఫ్ ఏఐ లేదా ఇంట్రడక్షన్ టు ఏ ఐ తో మొదలుపెట్టాలి.

ప్రాక్టికల్ కోర్సులు కావాలనుకుంటే.. గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ ,స్వయం ఏఐ/ ఎంఎల్ కోర్సులు నేర్చుకోవచ్చు. రెజ్యూమ్ లో  చూపడానికి సర్టిఫికేషన్ కావాలనుకుంటే.. కోర్సెరా, స్వయం ,గూగుల్, ఐబిఎం అందించే ప్రోగ్రామ్స్ పూర్తి చేయడం మంచిది .

ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ..

 ప్రస్తుతం పలు ఇన్స్టిట్యూట్ లు, సాఫ్ట్వేర్ సంస్థలు అందించే ఆన్లైన్ ఉచిత కోర్సులతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. కారణం ఏమిటంటే వీటి మాడ్యూల్స్ ను ఇండస్ట్రీ నిపుణుల సహాయంతో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా మాడ్యూల్స్ లోనూ మార్పులు చేస్తున్నారు. దీనితో రియల్ టైం నాలెడ్జి సొంతమవుతుంది.

30, మార్చి 2026, సోమవారం

ఉచిత శిక్షణ @ నసురుల్లాబాద్

 కెనరా బ్యాంక్ వారి సహకారంతో నసురుల్లాబాద్, కామారెడ్డి జిల్లా లో ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ప్రారంభం అయింది.కేంద్రాన్ని ప్రారంభించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కు చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఉచిత శిక్షణ పొందడానికి అర్హులని అన్నారు.

తగిన ధృవ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించి శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని సూచించారు..

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఏప్రిల్ ఒకటి నుంచి 2026 27 ఆర్థిక సంవత్సరానికి గాని పలు కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తారు .

ఏకకాలంలో నిరుద్యోగ యువతకు ,మహిళలకు తొమ్మిది రకాల కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు .హాస్టల్ వసతి కల్పిస్తారు .కోర్సు పూర్తయిన తర్వాత ధ్రువపత్రము, మరియు టూల్ కిట్స్ అందిస్తారు. అభ్యర్థులు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు సిఫారసు చేస్తారు .ఈ అవకాశాన్ని 19 నుంచి 50 ఏళ్లలోపు వారు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.

పురుషులకు ..

ద్విచక్ర వాహన, సెల్ ఫోన్ ,సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్, సర్వీసింగ్, మరమ్మత్తులు,  ఫోటోగ్రఫీ ,ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్ , ప్లంబింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. 

స్త్రీలకు ..

టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, వస్త్ర బ్యాగుల తయారీ ,కొవ్వొత్తుల తయారీ ,పుట్టగొడుగుల పెంపకం తదితర అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.

 సమర్పించాల్సిన జిరాక్స్ పత్రాలు..

 అభ్యర్థులు కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా( పాసర్ /ఫెయిల్), అయిదు ఫోటోలు, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు సమర్పించాలి. ఇతర వివరాలకు కార్యాలయ సమయాలలో నేరుగా సంప్రదించవచ్చు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ @ డిచ్ పల్లి

 డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ..  08461-295428


డిచ్ పల్లి లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 2026-27 ఆర్థిక సంవత్సరం లో ఏప్రిల్ 1 నుంచి వివిధ రకాల ఉచిత స్వయం ఉపాధి శిక్షణ  ప్రారంభమైంది..

ఏక కాలంలో 10 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.. శిక్షణా సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తారు.. కోర్సు పూర్తి అయిన తర్వాత ధ్రువపత్రం,టూల్ కిట్స్ అందిస్తారు..

అభ్యర్థులు సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలకు సిఫార్సు చేస్తారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన 19 నుండి 45 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవికుమార్ కోరారు..

ఈ కింది 10 అంశాల్లో శిక్షణ ఇస్తారు..

టైలరింగ్, మగ్గం వర్క్,బ్యూటీషియన్, CC కెమెరా ఇన్స్టలేషన్ మరియు రిపేరింగ్, ఏసీ ఇన్స్టలేషన్ అండ్ రిపేరింగ్, ఫోటోగ్రఫీ, తేనెటీగల పెంపకం, కూరగాయల నర్సరీ, పచ్చళ్ళ తయారీ, పుట్ట గొడుగుల పెంపకం

కావలసిన జిరాక్స్ పత్రాలు..

 ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా ( పాస్ /ఫెయిల్ ),5 ఫొటోలు, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు 

సందేహాల నివృత్తికి..

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్లోని ఆసక్తి కల యువతీ యువకులు తమ సందేహాల నివృత్తికి ఆఫీసు వేళల్లో 08461-295428 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు డైరెక్టర్ రవికుమార్..

29, మార్చి 2026, ఆదివారం

ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ

 ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

టాలెంట్ మేనేజర్ అనవిలాసిని,శిక్షకుడు విశ్వనాథ మోహన్ లతో కలిసి కరపత్రం ఆవిష్కరించారు. స్కిల్ ఇండియా కార్యక్రమం కింద పదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన ,16 నుండి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.శిక్షణ అనంతరం మల్టీ నేషనల్ కంపెనీలో 6 నెలలు అప్రెంటిస్ షిప్ చేయాలని సూచించారు. సందేహాల నివృత్తికి 76739 76699 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ఉచిత రైలు .. గ్యాలంట్రీ అవార్డీలకు..

 వేలాది సైనికులకు లబ్ధి చేకూరే విధంగా భారత ప్రభుత్వం, అసాధారణ శౌర్యం ప్రదర్శించి గ్యాలంట్రీ అవార్డులు పొందిన సైనిక,నావికాదళ,వైమానిక దళ వీరులకు ఉచిత రైలు సౌకర్యం కల్పించింది..

జీవితాంతం  ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ  రక్షణ శాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది.వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేసింది..వారితో ఒక సహచరుడు కూడా ఈ సౌకర్యం పొందవచ్చు..

అవార్డు పొందిన వీరుడు మరణించినట్లయితే అతని భార్య లేదా భర్త.. మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు ఈ సౌకర్యం పొందవచ్చు.

అవార్డు మరణానంతరం వచ్చినట్లయితే అతని తల్లి దండ్రులకు ఈ ప్రయోజనం కలుగుతుంది.

ఈ పథకం కింద లబ్ధిదారులు ఒక సహచరుడితో కలిసి జీవితాంతం ఇండియన్ రైల్వే లో ఉచితంగా ప్రయాణించవచ్చు.ఆయా రైళ్లలోని ఏసీ చైర్ కార్, ఫస్ట్ క్లాస్,సెకండ్ ఏసీ  వంటి సౌకర్య వంతమైన తరగతులలో ప్రయాణించవచ్చు.

సైనికులకు గౌరవ ప్రదమైన ప్రయాణం కల్పించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్రం తెలిపింది.ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రక్షణ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వేలాది మంది సైనిక కుటుంబాలకు లబ్ధి కలగనుంది.

పరమ వీర చక్ర, మహా వీర చక్ర, వీర చక్ర,అశోక చక్ర, శౌర్య చక్ర వంటి పురస్కారాలు యుద్ధం, అత్యవసర పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేస్తారు. గ్యాలంట్రీ అవార్డులు సైనికుల ధైర్యం,త్యాగాలకు ప్రతీకగా నిలుస్తాయి..

25, మార్చి 2026, బుధవారం

ఉచిత యోగా శిక్షణ @కామారెడ్డి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో గల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ప్రతిరోజు ఉదయం పూట యోగా శిక్షణ ఇస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో వచ్చే వారు  ప్రస్తుతం 50 కి పైగా వచ్చి యోగ నేర్చుకుంటున్నారు. వారి వారి వ్యక్తిగత అనారోగ్యాలకు అనుగుణంగా యోగాసనాలు శిక్షకుడు లింగం నేర్పిస్తున్నారు.

ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులలో అనేకమంది ప్రజలు చర్మవ్యాధులు ,వెన్ను నొప్పి సంబంధిత వ్యాధులు స, డిస్క్ లోపాలు తదితర సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతూ ప్రైవేటులో లక్షల రూపాయలు  ఖర్చుపెట్టినా తగిన ఫలితం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో , సంప్రదాయ వైద్యానికి పెద్ద పీట వేస్తూ కేంద్రం నేషనల్ ఆయుష్ మిషన్ పేరుతో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు యోగ శిక్షకులు ఒక వైద్యుడు ఒక అటెండర్ ను నియమించారు. ఎంతోమంది ప్రజలు వీటిని వినియోగించుకుంటూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఉచితంగా సేవలు అందడంతో ప్రజలు ఆర్థిక భారం తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

22, మార్చి 2026, ఆదివారం

ప్రతి శని, ఆది వారాల్లో ఉచిత టెలి మెడిసిన్ సేవలు

 శ్రీ సత్యసాయి ప్రాణమిత్ర "ఉచిత టెలి మెడిసిన్"  సేవ కోసం ప్రతి శని ,ఆదివారాలలో ఫోన్ ద్వారా అన్ని వ్యాధులకు" ఉచితంగా సలహాలు ,వైద్యము"  పొందవచ్చును అని శ్రీ సత్య సాయి సేవ సమితి ,కామారెడ్డి కేంద్రం నిర్వాహకులు తెలిపారు .

"శని , ఆదివారాలలో " ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 080-4717 9797 నంబర్ కు ఫోన్ చేస్తే 24 మంది వైద్యులు అందుబాటులో ఉంటారని ,ఇట్టి సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కోసం వినియోగించుకోవాలని కోరారు..

13, మార్చి 2026, శుక్రవారం

ఉచిత శిక్షణ @ నిజామాబాద్

 నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయ్ మెంట్ జెనరేషన్,మార్కెటింగ్ మిషన్ egmm, నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం హెల్త్ కేర్ సెక్టార్,కంప్యూటర్స్ విభాగాల్లో శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

18 నుండి 35 ఏళ్ల వయసు గల, పదవ తరగతి,ఆ పైన ఉత్తీర్ణత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు యెండల టవర్స్ ఎదురుగా గల నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని డైరెక్టర్ మంజుల ఆకాశ పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫోటో ,కుల ధృవీకరణ పత్రంతో ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు

ఉచిత క్యాన్సర్ చికిత్స @9394010215

 క్యాన్సర్ ముందస్తు గుర్తింపున కు నేషనల్ మాస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్ ప్రారంభించాలని బిఆర్ఎస్ ఎంపీ బీ పార్థసారధి రెడ్డి గారు రాజ్యసభలో అన్నారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు కేంద్రం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. దేశం క్యాన్సర్ హెల్త్ ఎమర్జెన్సీ దిశగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియకు వసతులు లేకపోవడం ,ప్రజల్లో క్యాన్సర్ ముందస్తు లక్షణాలపై అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని అన్నారు.

 మన దేశంలో క్యాన్సర్ చికిత్స, మందులు, ఖర్చుతో కూడుకోవడంతో పేదలు అంత డబ్బు వెచ్చించలేకపోతున్నారని వివరించారు. క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న సమయాన మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. 

ముందస్తు లక్షణాలు గుర్తించకపోవడంతోనే.. 

దేశంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ చికిత్స సెంటర్లు ఢిల్లీ ,ముంబై, హైదరాబాదులో ఉన్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం కష్టంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . నాట్ ఫర్ ప్రాఫిట్ క్యాన్సర్ దవాఖానాలకు కేంద్రం కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు.

క్యాన్సర్ చికిత్సకు 1500 బెడ్లతో సింధు హాస్పిటల్ 

సామాజిక బాధ్యతగా హైదరాబాదులో 1500 బిడ్డలతో సింధు హాస్పిటల్ నిర్మించినట్లు పార్థసారథి రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులంతా ఒకసారి ఈ దవాఖానను సందర్శించాలని ఆహ్వానించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో క్యాన్సర్ బాధితులు ఉంటే సింధు దవాఖానకు రిఫర్ చేయాలని ఆయన కోరారు. వాళ్లందరికీ "ఉచితంగా సేవలు "అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు .ఈ మేరకు ఉచిత చికిత్స పొందాలనుకునేవారు 9394010215 నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...