ఫ్రీ హాస్పిటల్ సేవలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ హాస్పిటల్ సేవలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఉచిత వైద్యం@ అరుంధతి హాస్పిటల్.

 గండి మైసమ్మ , దుండిగల్ దారిలో ఉన్న అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ లో కేవలం టెస్టులే కాదు, రూపాయి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తారు. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 2023 లో ఈ హాస్పిటల్ ఏర్పాటైంది. ఖరీదైన సర్జరీలు ఉచితంగా చేస్తూ , రోగులకు రాయితీపై మందులు ఇస్తున్నారు. 

మల్కాజ్ గిరి MLA డా. మర్రి రాజశేఖర్ రెడ్డి తన తల్లి అరుంధతి పేరు మీద మర్రి రాజశేఖర్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆసుపత్రి ని స్థాపించారు. NABH గుర్తింపు 350 కి పైగా బెడ్ లు సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ఉచిత OPD తో పాటు రోగులకు ఉచితంగా బెడ్ లు మూడు పూటలా ఉచిత పోషకాహార భోజనం అందిస్తున్నారు. 

వీటితో పాటు ఎక్స్ రే, 24/7 సీటీ స్కాన్, ECG, అల్ట్రా సౌండ్ , రక్తం, మూత్ర పరీక్షలు వంటివన్నీ పూర్తిగా ఉచితంగా చేస్తారు. మేజర్ సర్జరీలు కూడా ఉచితంగా చేస్తారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల కోసం ఉచిత బస్సులు కూడా నడుపుతున్నారు. ఈ ప్రాంగణంలోనే మెడికల్ కాలేజీ కూడా నడుస్తుంది. 

మరిన్ని సమగ్ర వివరాలకు 8055667888 హెల్ప్ లైన్ లో సంప్రదించ వచ్చు. 

ఆర్ వీ ఎం చారిటబుల్ హాస్పిటల్

 సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వెళ్ళే దారిలో , 

రాజీవ్ రహదారి,

శామీర్ పేట్ దాటిన తర్వాత,

వంటిమామిడి విలేజ్ ,

నుండి లక్ష్మక్క పల్లి గ్రామం దగ్గర ఈ హాస్పిటల్ ఉంది.దాదాపు ప్రతీ రోజూ 1200 నుండి 1500 వరకు రోగులు వస్తుంటారు. అన్ని రకాల చికిత్సలు ఉచితంగా చేస్తారు. ఉచిత భోజనం ఉంటుంది. సీఈఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, డా యాకయ్య గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తుంది అని తెలిపారు. 

20, ఆగస్టు 2026, గురువారం

ఫ్రీ CPR ట్రైనింగ్@డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్

 


గుండె ఆగిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోసే ప్రక్రియ సి పి ఆర్ ..దీనిని ఎంతమందికి నేర్పిస్తే సమాజానికి అంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అన్నది తమ సంకల్పమని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ నర్లింగల కీర్తన యాదవ్ అన్నారు.

 అందుకే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు, కోర్టులు, పోలీసు కార్యాలయాలు సహా వివిధ చోట్ల క్యాంపులు నిర్వహించి ఇప్పటివరకు సుమారు లక్ష మందికి" ఉచితంగా సి పి ఆర్ ట్రైనింగ్"  ఇచ్చినట్లు తెలిపారు. రెడ్ క్రాస్, హ్యాండ్స్ ఆన్ హార్ట్ ఫౌండేషన్లు తమతో కలిసి పని చేస్తున్నాయని ఆమె వివరించారు. దీనితో పాటుగా కొన్ని అత్యవసర ప్రాథమిక చికిత్సలను పౌరులకు నేర్పుతున్నట్లు చెప్పారు. కరెంటు షాక్ కొట్టినప్పుడు, పాము కరిచినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు ,పిల్లలకు ఏదైనా గొంతులో అడ్డుపడినప్పుడు, బీపీ డౌన్ అయితే, షుగర్ స్థాయిలు పడిపోతే.. ఇలా ప్రాణం పోయే పరిస్థితులలో ఆసుపత్రిలో చేర్చేలోగా ఎలాంటి సహాయం అందించాలి అనేది కూడా ఈ క్యాంపెయిన్ లో భాగంగా  నేర్పుతున్నామని ఆమె వివరించారు.

 ఎవరైనా తమ కార్యక్రమంలో భాగం అవ్వాలనుకుంటే drnaari అనే ఇంస్టాగ్రామ్ పేజీ లేదా drnaari.com అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 



18, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత "అర్జంట్ కేర్ సెంటర్" @ జగిత్యాల

 గ్రామీణ ప్రాంత ప్రజలకు" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందించడమే ప్రధాన లక్ష్యంగా" శ్రీ సత్య సాయి సుజల స్రవంతి ట్రస్ట్"  ఆధ్వర్యంలో జగిత్యాల గ్రామీణ టీ ఆర్ నగర్, రాజారాం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన" సాయి స్వస్థ షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్ సెంటర్" ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల, మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు ఈ కేంద్రం ద్వారా" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను విరివిగా విస్తరింప చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. 

16, ఆగస్టు 2026, ఆదివారం

దో ఘంటే దేశ్ కే నామ్.. ఢిల్లీ వైద్యుల ఉచిత సేవ

 దేశం కోసం రెండు గంటలు.. 2 ఘంటే దేశ్ కే నామ్.. అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీ వ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. 

పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం " 2 గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు " అందించనున్నట్లు శని వారం ప్రకటించారు.కార్డియాలజీ, ఎండో క్రైనాలజీ,పీడియాట్రిక్ ,గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్టులు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం " వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్" లను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు .. వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.

15, ఆగస్టు 2026, శనివారం

ఉచితంగా.. దంత వైద్య సేవలు..

 ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు.. అయిన వారికి దూరమై, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న పిల్లలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మేమున్నాం అంటూ " లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్" సంస్థ భరోసా ఇస్తోంది. 

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్, ఐ కే ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి , బాపూజీ నగర్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో " ఉచిత దంత వైద్య సేవలు" అందుబాటులోకి తెచ్చింది. 

ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సభ్యులు ఆర్. నారాయణ, ఆర్గొండ నర్సింలు, బచ్చు లక్ష్మణ్, కే. లింగయ్య లు అతిథులుగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 180 మందికి సేవలు అందించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. 

14, ఆగస్టు 2026, శుక్రవారం

మెడి కవర్ ఆసుపత్రిలో ప్రతినెలా ఫ్రీ క్యాన్సర్ క్యాంప్

క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆంకాలజిస్టులు సూచించారు.

 కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో "ప్రతి నెల రెండో గురువారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని"  నిర్వహించనున్నట్లు మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్లు.. డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్ ,డాక్టర్ స్నేహ తెలిపారు. గురువారం హాస్పిటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొని మాట్లాడారు. 

కరీంనగర్ మెడి కవర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన మొదటి ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై" ప్రతినెలా రెండో గురువారం"  కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని "నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి అన్నారు. హాస్పిటల్ లో కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో ముఖ్యంగా "బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా " నమోదు అవుతున్నాయని తెలిపారు. మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు  అన్నారు.

 క్యాన్సర్ బారిన పడకుండా కొంతమంది నైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలని " నిర్వహిస్తోందని వైద్యులు తెలిపారు. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా క్యాన్సర్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, పిఆర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. 



13, ఆగస్టు 2026, గురువారం

వాట్సాప్ లో hi.. రూ 5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్

 భారత దేశం లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పథకం" ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన PM JAY. ఈ పథకం ద్వారా అర్హులైన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంవత్సరానికి రూ 5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది. 

ఫ్రీ గా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అత్యంత కీలకం. ఈ హెల్త్ కార్డ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుండే మీ మొబైల్ ఫోన్ లోని అధికారిక వాట్సప్ చాట్ బాట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రభుత్వ అధికారిక ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నంబర్  +91 72908 23838 కు " hi" లేదా" hello" అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. చాట్ బాట్ సూచనల ప్రకారం మై ఆయుష్మాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకుని , ఈ- కే వై సి పూర్తి చేసి నేరుగా కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

వాట్సాప్ తో పాటు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్ సైట్ అయిన beneficiary.nha.gov.in ను సందర్శించి మొబైల్ నెంబర్, OTP ద్వారా లాగ్ ఇన్ కావాలి. అడిగిన వివరాలు ఎంటర్ చేసి మీ పేరు, గుర్తింపు నంబర్ ఆధారంగా వివరాలు సెర్చ్ చేసి , ఫోటో అప్ లోడ్ చేసి అవసరమైన వివరాలు సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. 

ఈ పథకం కింద ఎలాంటి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులే. వీరితో పాటు 2011 సామాజిక ఆర్థిక కుల గణన SECC డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల లోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సులభ విధానాన్ని అనుసరించి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు. 

11, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత గుండె శస్త్ర చికిత్స @నిమ్స్, హైద్రాబాద్

 గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ లో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా . రమణ దన్నపనేని , సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ అమరేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరీక్షించి , అవసరమైన వైద్య పరీక్షల అనంతరం సర్జరీ అవసరమున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం , సీ ఎం ఆర్ ఎఫ్ ద్వారా ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఐదేళ్లుగా ఏటా ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ తన వార్షిక సోషల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను అందించనుంది.పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ లు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ తెలిపారు.

అర్హత గల చిన్నారుల తల్లి దండ్రులు సోమ వారం నుంచి శని వారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తు లోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.

ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే చిన్నారులతో నిమ్స్ కు రావచ్చని తెలిపారు.

గతంలో చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులు , సంబంధిత పత్రాలు ఉంటే వెంట తీసుకుని రావాలని, మరిన్ని సమగ్ర వివరాలకు 040-23489025 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

9, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత మధుమేహ చికిత్స@ డా. మోహన్స్ డైరెక్ట్

 మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే పెరుగుతాయి.. అనుకుంటాము కానీ కాళ్లకు పుండ్లు , కంటి సమస్యలు ,మూత్రపిండాల సమస్యలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఎదురవుతుంటాయి. అవగాహన ఉన్న వ్యక్తులు అయితే వాటన్నింటినీ గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. మరి పేదవాళ్లు, అవగాహన లేని వారు.. మధుమేహం గురించి సరిగా తెలియక, ఖరీదైన వైద్యం చేయించుకోలేక మరెన్నో సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారికి ఉచిత మధుమేహ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ వారు " డైరెక్ట్" ను ప్రారంభించారు. 

షుగర్ రోగులు ఎక్కువగా వెళ్ళే ఆసుపత్రులలో డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి ఒకటి. భారతదేశవ్యాప్తంగా 50 కి పైగా శాఖలు ఉన్న ఈ సెంటర్ కు వచ్చే రోగులలో పేదలూ ఉంటారు .అయితే వారు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఇక్కడ జీవితాంతం ఉచితంగా చికిత్స చేయించుకునే వీలు ఉంది. ఒకవేళ షుగర్ వ్యాధి ముదిరి కంటి ఆపరేషన్ తప్పనిసరి అయినా, ఫుట్ అల్సర్ కారణంగా పాదాలకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అది కూడా ఫ్రీగానే నిర్వహిస్తారు ఇక్కడ. ఆరోగ్యం పైన కాస్త అవగాహన ఉన్నవారు లేదా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పోలిస్తే.. రోజు కూలీలు, పేదలు, గ్రామాల్లో ఉండే వారికి మధుమేహం గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ ఆ లక్షణాలు కనిపించినా వైద్యం కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది కనుక నిర్లక్ష్యంగా ఉంటుంటారు, అలాంటివారికి మధుమేహ చికిత్సను ఉచితంగా అందించేందుకు" డాక్టర్ మోహన్స్"  2006 లో "డైరెక్ట్"  డయాబెటిస్ ఇంటర్నేషనల్ రీసర్చ్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించింది. మధుమేహం గురించి అవగాహన కల్పిస్తూనే పరీక్షలు చేయడం, చికిత్స అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కౌన్సిలింగ్ ఇలా అన్ని రకాల సేవలను ఆ రోగులకు జీవితాంతం అందిస్తుంది ఈ డైరెక్ట్.

మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి జన్మతః వస్తుంది. దానిని టైప్ వన్ డయాబెటిస్ అంటారు. మరొకటి టైప్ టు డయాబెటిస్ ..ఇది ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, వేళకు నిద్రపోకపోవడం, ఒత్తిడి తదితర కారణాలతో మొదలవుతుంది .రెండింటిలో టైప్ వన్ మధుమేహం చికిత్స కాస్త ఖర్చుతో కూడుకుంది. వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ, నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. అదే టైప్ టు ని తీసుకుంటే వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పులు చేసుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రెండింటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కళ్ళతో పాటు మూత్రపిండాల పైన కూడా ప్రభావం పడుతుంది. కాళ్లకు దెబ్బ తగిలి చిన్న గాయమైనా పుండుగా మారి ఒక పట్టాన తగ్గక ఆపరేషన్ వరకు వెళ్లాల్సి రావచ్చు. పేదలకు, పల్లె ప్రజలకు ఇవన్నీ పెద్దగా తెలియవు కనుక" డైరెక్ట్ " మధుమేహం గురించి తెలియజేస్తూనే వారికి ఉచిత పరీక్షలను నిర్వహిస్తుంది. సమస్య ఉందని తేలితే మందులను లేదా ఇన్సులిన్ కిట్ ను అందిస్తుంది. షుగర్ లెవెల్స్ ను అంచనా వేసే గ్లూకోజ్ సెల్ఫ్ మానిటరింగ్ మిషన్ తో పాటు అవసరమైన వారికి ఇన్సులిన్ పంప్స్ ను ఇస్తారు. ఇప్పటివరకు తమిళనాడులోని కాంచీపురం లో ఐదు గ్రామాలు ,చూనంపేట్ చుట్టుపక్కల 14 గ్రామాలు కలిపి దాదాపు 15 వేల మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉచిత చికిత్సను అందించే ప్రయత్నం చేస్తోంది" డైరెక్ట్" . 

అదే సమయంలో టైప్ వన్ డయాబెటిస్ బారిన పడిన 600 మందికి పైగా బాల నేరస్తులకు ఉచిత ఇన్సులిన్ కిట్స్ పంపిణీ చేసింది. హైదరాబాదులోనూ టైప్ వన్ బాధితులను గుర్తించి ఇన్సులిన్ అందిస్తోంది .వీటితో పాటు  చికిత్స విషయంలో సందేహాలు ఉన్నవారు తరచు ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా మొబైల్ టెలి మెడిసిన్ సేవలను ప్రారంభించింది. అంటే" డైరెక్ట్"  సిబ్బంది రోగులకు నిత్యం అందుబాటులో ఉంటారు. అదే సమయంలో ఆ నిర్వాహకులు స్థానిక స్వయం సహాయక బృందాలలోని మహిళలను, యువతను వాలంటీర్లుగా మార్చి వారి ద్వారా మధుమేహ బాధితులు తీసుకోవలసిన పోషకాహారం ,జీవన విధానంలో చేసుకోవలసిన మార్పుల పైన అవగాహన కల్పించేలా ప్రోత్సహిస్తున్నారు.

 మధుమేహానికి ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదన్న ఆలోచనతోనే డైరెక్ట్ ను ప్రారంభించాము, మధుమేహం కారణంగా కళ్ళూ లేదా పాదాలకు ఆపరేషన్లను ఆసుపత్రుల్లోనే ఉచితంగా చేస్తూ, వారు పూర్తిగా కోలుకునే వరకు మేము పర్యవేక్షిస్తాం అనే డాక్టర్ వి మోహన్ ఇందుకోసం డయాబెటాలజిస్టులు, నర్సులు, డైటీషియన్లు, టెక్నీషియన్లు, సర్జన్లు, కౌన్సిలర్లతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక పేదల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాలు, నెలసరి ఆదాయం వంటివన్నీ అంచనా వేశాకే ఉచిత చికిత్సను అందించే " డైరెక్ట్ "  టెలీ మెడిసిన్ తో పాటు తమిళనాడులోని డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి లో "ఎం విశ్వనాథన్ ఫ్రీ డయాబెటిస్ క్లినిక్ " అనే పేరుతో ఒక క్లినిక్ ను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తున్న" డైరెక్ట్"  కర్ణాటక, కేరళ, ఒడిశా ,పుదుచ్చేరి.. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 



8, జూన్ 2026, సోమవారం

సోను సూద్ ఉచితం అంబులెన్స్ సేవలు

 సోనూ సూద్ ఉచిత అంబులెన్స్ ల పంపిణీ, ఉచిత ఆటోల పంపిణీ, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులలో ఉచిత నిత్యాన్నదానం.


అంబులెన్స్ ని స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదేనని నటుడు సోనుసూదన్నారు. ఆదివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద సోను సూద్ మరియు మాల్యవీ కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు" ఉచితంగా ఆటోలను "పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి ,అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ,నగరంలోని దమ్మాయిగూడ, చిలుకానగర్ ప్రాంతాల నిరుపేద ఆటో కార్మికులకు ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన అంబులెన్స్ను స్వయంగా నడిపి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ సంకిరెడ్డిపల్లి, మరియు అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోనుసూద్" ఉచిత అంబులెన్స్ ను "వినియోగించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు .జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు "ఉచితంగా ఆటోలను" అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం వంటిదని సొసైటీ వ్యవస్థాపకులు కొండ కృష్ణమ్మను  అభినందించారు సోనూ సూద్. కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ 2004లో ప్రారంభించిన ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ గాంధీ, నిలోఫర్ ఆసుపత్రి లలో నిత్యాన్నదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

వన్ హెల్త్ ఫార్మసీ వారి ఉచిత ఆరోగ్య పరీక్షలు

 వన్ హెల్త్ ఫార్మసీ మల్లారెడ్డి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది హెల్త్ ఎసెన్షియల్స్ మరియు ఔషధాలపై 20 శాతం నుండి 70 శాతం వరకు డిస్కౌంట్. 

వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కొనుగోళ్లపై 10000 రూపాయల విలువైన" ఆరోగ్య పరీక్షలు ఉచితంగా" నిర్వహిస్తారు లేదా" ఉచిత పిల్ బాక్స్" అందజేస్తారు 



హౌస్ నెంబర్ 5-3-113 

నిజాంసాగర్ చౌరస్తా

Nh 44 రోడ్డు

 కామారెడ్డి జిల్లా

 తెలంగాణ 

9121812181 ,8309867689



పార్థ డెంటల్ వారి ఫ్రీ ఆఫర్

 డెంటల్ హాస్పిటల్స్ లో ప్రముఖ సంస్థ అయిన పార్థ డెంటల్స్ వారు ఈ నెల అంటే జూన్ 2026 మొత్తం ఒక ఉచిత చికిత్స ఆఫర్ ప్రకటించింది.

అది invisalign open day  ఆఫర్. ఈ ఆఫర్ లో ఫ్రీ కన్సల్టేషన్ ,ఫుల్ మౌత్ ఎక్స్ రే, రూ.15000 విలువైన డిజిటల్ స్కాన్ ను ఫ్రీ గా ఇస్తున్నారు.

పార్థ డెంటల్ లో aligners మీద 50000 నుండి 90000 డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కని దంత ఆరోగ్యాన్ని పొందండి.

అపాయింట్మెంట్ కొరకు..040-41420000 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

పార్థ డెంటల్.. స్కిన్..హెయిర్....

4 రాష్ట్రాలలో.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక / బెంగళూరు, తమిళనాడు /చెన్నై ..

గో వైర్లెస్ , గో ఫర్ అలైనార్స్ ..పెద్దలకు,యువకులకు,పిల్లలకు .. మెటల్ బ్రెసెస్ లేకుండా అలైనార్స్ తో మీ చిరునవ్వును తీర్చిదిద్దుకోండి.

వాట్సప్ 85007 79000 .. 

5, జూన్ 2026, శుక్రవారం

కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం

 


మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.

"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..

కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..

రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.

27, మే 2026, బుధవారం

1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు

 ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు  ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.

ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.

ఈ - దార్ పోర్టల్ అంటే..

ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..

పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.

రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.

బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు. 

సత్వర వైద్యం అందుబాటులోకి..

కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు

ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.

ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..

ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.





ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 భిక్కనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు వైద్యుడు నవీన్ సాయి ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మానసిక ఉపేశమానం కలుగుతుందన్నారు. ,"ప్రతి మంగళ, గురువారం " భవిత కేంద్రంలో ఈ "ఉచిత ఫిజియోథెరపీ శిబిరం " ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఈఆర్పి మహేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



25, మే 2026, సోమవారం

RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

 నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి  " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. 

ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

8, ఏప్రిల్ 2026, బుధవారం

ఆసుపత్రికి ఉచితంగా సి ప్యాప్ యంత్రం అందజేత

 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీప్యాప్ యంత్రాన్ని కొందరి వైద్యులు ఉచితంగా అందజేశారు. ఆసుపత్రిలో విజయవంతంగా ఇన్స్టాలేషన్ పూర్తయింది.

 ఈ యంత్రాన్ని హైదరాబాదులోని అంకుర ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి ఇన్స్టాలేషన్ చేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఎం సి హెచ్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ మరియు డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షించారు. 

యంత్రం సక్రమంగా పనిచేస్తూ ,రోగులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు. ఈ యంత్రం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యుల తెలిపారు.

ఈ సందర్భంగా ఈ యంత్రాన్ని ఉచితంగా అందజేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

25, మార్చి 2026, బుధవారం

ఉచిత యోగా శిక్షణ @కామారెడ్డి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో గల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ప్రతిరోజు ఉదయం పూట యోగా శిక్షణ ఇస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో వచ్చే వారు  ప్రస్తుతం 50 కి పైగా వచ్చి యోగ నేర్చుకుంటున్నారు. వారి వారి వ్యక్తిగత అనారోగ్యాలకు అనుగుణంగా యోగాసనాలు శిక్షకుడు లింగం నేర్పిస్తున్నారు.

ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులలో అనేకమంది ప్రజలు చర్మవ్యాధులు ,వెన్ను నొప్పి సంబంధిత వ్యాధులు స, డిస్క్ లోపాలు తదితర సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతూ ప్రైవేటులో లక్షల రూపాయలు  ఖర్చుపెట్టినా తగిన ఫలితం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో , సంప్రదాయ వైద్యానికి పెద్ద పీట వేస్తూ కేంద్రం నేషనల్ ఆయుష్ మిషన్ పేరుతో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు యోగ శిక్షకులు ఒక వైద్యుడు ఒక అటెండర్ ను నియమించారు. ఎంతోమంది ప్రజలు వీటిని వినియోగించుకుంటూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఉచితంగా సేవలు అందడంతో ప్రజలు ఆర్థిక భారం తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

22, మార్చి 2026, ఆదివారం

ప్రతి శని, ఆది వారాల్లో ఉచిత టెలి మెడిసిన్ సేవలు

 శ్రీ సత్యసాయి ప్రాణమిత్ర "ఉచిత టెలి మెడిసిన్"  సేవ కోసం ప్రతి శని ,ఆదివారాలలో ఫోన్ ద్వారా అన్ని వ్యాధులకు" ఉచితంగా సలహాలు ,వైద్యము"  పొందవచ్చును అని శ్రీ సత్య సాయి సేవ సమితి ,కామారెడ్డి కేంద్రం నిర్వాహకులు తెలిపారు .

"శని , ఆదివారాలలో " ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 080-4717 9797 నంబర్ కు ఫోన్ చేస్తే 24 మంది వైద్యులు అందుబాటులో ఉంటారని ,ఇట్టి సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కోసం వినియోగించుకోవాలని కోరారు..

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...