నిరుద్యోగుల కోసం ఇక నుంచి" ప్రతి నెలా ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ వేల్పుల విజేత తెలిపారు. గత నెల నిర్వహించిన మెగా జాబ్ మేళా లో 4620 మంది టామ్ కామ్ లో నమోదు కాగా 120 మంది జర్మనీ లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు.
వారందరూ జర్మనీ భాష నేర్చుకోవడానికి " ఫ్రీ కోచింగ్ సెంటర్" ను ఏర్పాటు చేశామని తెలిపారు.
నిజామాబాద్ నగరంలో మంగళ వారం 168 పోస్టులకు( నర్సులు,రిసెప్షనిస్ట్, ఫార్మసిస్ట్ , షోరూం మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ,మెకానిక్) ఉచిత జాబ్ మేళా నిర్వహించగా 52 మంది సెలెక్ట్ అయ్యారని ,వారికి ప్రూండెన్స్ హాస్పిటల్, అపోలో ఫార్మసీ, మహీంద్రా షోరూం ల నుండి వచ్చిన ప్రతినిధులు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ లెటర్స్ అందచేశారని తెలిపారు.
ఇకనుంచి ప్రతి నెలా నిరుద్యోగుల కోసం " ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.