ఫ్రీ ఫిజియోథెరపీ చికిత్స లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ ఫిజియోథెరపీ చికిత్స లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఆగస్టు 2026, సోమవారం

ప్రతి సోమ, గురు వారాల్లో ఉచిత ఫిజియోథెరపీ

 దివ్యాంగులు ఉచిత ఫిజియోథెరపీ ని సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ మండలం విద్యాధికారి బట్టు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాలలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి సోమ, గురు వారాల్లో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవిత కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపీ వైద్యులచే ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. పిల్లలకు అవసరమైన వ్యాయామాలు నేర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐ ఈ ఆర్ పీ లను నియమించినట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన,ఉపయోగకరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

27, మే 2026, బుధవారం

ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 భిక్కనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు వైద్యుడు నవీన్ సాయి ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మానసిక ఉపేశమానం కలుగుతుందన్నారు. ,"ప్రతి మంగళ, గురువారం " భవిత కేంద్రంలో ఈ "ఉచిత ఫిజియోథెరపీ శిబిరం " ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఈఆర్పి మహేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...