ఫ్రీ అగ్రికల్చర్ ట్రైనింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ అగ్రికల్చర్ ట్రైనింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఆగస్టు 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల రైతులకు.. 3 రోజుల ఉచిత శిక్షణ

 జాతీయ స్థాయి సంస్థ అయిన ఎన్ ఐ పి హెచ్ ఎం పర్యావరణహితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలతో పాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తోంది. వర్మీ కంపోస్టులో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రం సూడో మోనాస్ బ్యాక్టీరియా కలిపి సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవడం.. పొటాష్, ఫాస్ఫేటులను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులను , జీవ రసాయనాలను రైతు స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం, మిత్ర పురుగుల సంతతిని పెంపొందించే చర్యలపై శిక్షణ ఇస్తారు. 

కనీసం 20 మంది రైతులు బృందంగా ఏర్పడి తమను 040-24015932 నంబరులో సంప్రదిస్తే " 3 రోజుల పాటు శిక్షణ ఉచితంగా " ఇస్తామని ఎన్ఐపిహెచ్ఎం మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు తెలిపారు. ఐతే భోజన ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల గుంటూరు ప్రాంత రైతులకు మిరప, పొగాకు సాగు లో శిక్షణ ఇచ్చామన్నారు. 

కేరళ, తమిళ నాడు ల నుండి శాస్త్ర వేత్తలు, రైతులు అధిక సంఖ్యలో శిక్షణ పొందుతున్నారని అధికారి తెలిపారు.తెలుగు రాష్ట్రాల రైతులు ఇట్టి ఉచిత శిక్షణ అవకాశాన్ని అధిక సంఖ్యలో ఉపయోగించుకుని లాభం పొందాలని కోరారు.

11, ఆగస్టు 2026, మంగళవారం

వెటివర్ ఫౌండేషన్..రైతులకు ఉచిత శిక్షణ

 వట్టి వేరు వేర్లు నేల కోతను 90% వరకు తగ్గిస్తాయి. వాన నీరు 60%వరకు భూమిలోకి ఇంకుతుంది. రైతుల్లో అవగాహన పెంచేందుకు వెటివర్ ఫౌండేషన్ వేలాది మంది రైతులకు క్షేత్ర స్థాయిలో " ఉచిత ప్రాక్టికల్ శిక్షణ" ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో గట్లవెంట నాటేందుకు సుమారు 2,000-3,000 వ్యాధి రహిత పిలకలు అవసరమవుతాయి. నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా ఫౌండేషన్ రైతులకు పంపిణీ చేస్తోంది. 

వట్టివేరుపై సమగ్ర శిక్షణ ఇస్తాం..

అనేక ఔషధ,సుగంధ పంటలతో పాటు వట్టి వేరు పంట సాగు పద్ధతులు , అనువైన నేలలు,ప్రాసెసింగ్ పద్ధతులు వాణిజ్య అవకాశాలు తదితర అంశాలపై రైతులకు హైద్రాబాద్ బోడుప్పల్ లోని కార్యాలయంలో అప్పుడప్పుడు శాస్త్రీయంగా,సమగ్ర శిక్షణ ఇస్తున్నామని సైంటిస్ట్ కిరణ్ బాబు తెలిపారు.నాణ్యమైన వట్టి వేరు పిలకలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు.



ఆసక్తి గల రైతులు సంప్రదించాలని ఆయన సూచించారు. 

డా. జీడీ కిరణ్ బాబు, సైంటిస్ట్ ఇంచార్జ్ , కేంద్రీయ ఔషధ , సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ ( సీ ఎస్ ఐ ఆర్ సీమాప్),బోడుప్పల్ , హైద్రాబాద్ 

+91-40-27201131,27200272,

Email.. crchyd@cimap.res.in


8, జూన్ 2026, సోమవారం

సేంద్రీయ సేద్యంపై తొమ్మిది నెలల ఉచిత శిక్షణ

 వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షయ కల్ప రైన్ మ్యాటర్ ఫెలోషిప్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది పాడి పశువుల పెంపకం బయోగ్యాస్ ఉత్పత్తి బయోడైజేష్టర్ ద్వారా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతి ప పై పై 19 నుంచి 27 మధ్యన వయసుగల యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన శిక్షణ కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి మూడు నెలలు రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది ఉచిత భోజనము వసతి తో పాటు ఉపకార వేతనం కూడా ఇస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది మరిన్ని వివరాలకు 70222 77155 నంబర్లో సంప్రదించవచ్చు

8, మే 2026, శుక్రవారం

రెడ్డీస్ ఫౌండేషన్ వారి ఉచిత మట్టి పరీక్షలు

 వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి పరీక్షల కార్యక్రమం కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండలంలో కారేపల్లి గ్రామంలో స్థానిక రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ రైతులు తమ పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం సమర్పించాలని సూచించారు.

ఈ పరీక్షల ద్వారా మట్టిలోని ముఖ్య పోషకాలైన నత్రజని పొటాషియం ఫాస్ఫరస్ లతోపాటు సూక్ష్మ పోషకాల స్థాయిని శాస్త్రీయంగా విశ్లేషించి, పంటలకు తగిన ఎరువుల వినియోగంపై మార్గదర్శకాలు అందిస్తారని తెలిపారు. అధిక ఎరువుల వినియోగం వల్ల మట్టి సారం తగ్గుతున్న నేపథ్యంలో సరైన మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు దిగుబడులు పెంచుకోవచ్చని నిపుణులు వివరించారు.

అలాగే భూమికి అనుకూలమైన పంటల ఎంపిక, భూమి సంరక్షణకు అవసరమైన సూచనలు కూడా రైతులకు అందించబడతాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పొలాల భూసారాన్ని పెంచుకోవాలని కోరారు.

మరిన్ని వివరాల కోసం కమ్యూనిటీ ఫెసిలిటేటర్ నక్క హరీష్ ను 8008768238 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

4, మే 2026, సోమవారం

ఉచిత డిజిటల్ సహకార కోర్సులు

 తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ..

సహకార రంగానికి సంబంధించి 160 కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8భాషలలో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతి దారులు,విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ ఐ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు.ఇందుకోసం ప్రత్యేకంగా  savidya.coop పేరిట ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది.

సవిద్య అంటే సహకార విద్యాలయం .ఇది దేశంలోనే మొట్ట మొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు,విద్యార్థులు, ఎగుమతి దారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ  ' సహకార్ సే సమృద్ధి ' చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణ ను అందిస్తుంది.

వ్యవసాయ పద్ధతులు ,ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160 కి పైగా  ఉచిత వీడియో కోర్సులు . తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషలలో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత  ఫీచర్లను  ఉపయోగించి కంటెంట్ ను వ్యక్తిగతికరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా ఙ్ఞానాన్ని అందించేందుకు ఏ ఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది. వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ,పంట దిగుబడిని మెరుగుపరచు కోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి.  విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధనా అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు ఎగుమతి దారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు , అంతర్జాతీయ వాణిజంపై అవగాహన పొందడానికి అవసరమైన  కోర్సులను సైతం ఇందులో పొందుపరచడం విశేషం.

నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ , క్రిబ్కో వంటి సహకార సంస్థలు సహకార విద్య ప్లాట్ ఫామ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 వేల సహకార సంఘాలను రెండు కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయడమే దీని లక్ష్యం.

మీరు savidya.coop లో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకుని , సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...