కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్ వారి సౌజన్యంతో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం అయ్యిందని సర్పంచ్ సాధ్విక, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ ,పాలకవర్గ సభ్యులు తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్ వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడంతోపాటు కంటి పరీక్షలు , చెవి ముక్కు గొంతు, వరిబీజం ,బీజ కుట్టు, గడ్డలు , కంతులు థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబాన్నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళనొప్పులు, నడుము నొప్పులు, నరాల సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ప్రమాదంలో వేసిన రాడ్స్ తీయడంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తాం అని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 104 మంది రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారని 60 మందికి వివిధ రకాల శాస్త్ర చికిత్సల అవసరమని గుర్తించామని తెలిపారు .ఆదివారం బీబీపేట పంచాయతీ ఆవరణలో మెడిసిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులు ఉదయం 8 గంటలకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఉచిత బస్సులో మెడిసిటి హాస్పిటల్ కు తీసుకు వెళ్లి శస్త్ర చికిత్సలతో పాటు " మందులను సైతం ఉచితంగా" అందజేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధ్విక, ఉప సర్పంచ్ ప్రశాంత్ తో పాటు పాలకవర్గ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మెడిసిటి హాస్పిటల్ వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర తో పాటు సిబ్బంది, రోగులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...

No comments:
Post a Comment