Friday, 15 May 2026

ప్రవేశం లభిస్తే ఉచిత కార్పొరేట్ విద్యా

 ఆదర్శలో ప్రవేశాలకు 20వ తేదీ వరకు గడువు..

గ్రామీణ ప్రాంతాలలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ స్థాయి విద్యను" ఉచితంగా" అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాలలో ప్రతిభ కనబరుస్తుండడంతో ఏటా వీటిలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

16 జూనియర్ కళాశాలలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఏఈసి గ్రూపులలో ఒక్కో విభాగంలో 40 సీట్లలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు .ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి mec స్థానంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఏఈసి( అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ గ్రూప్) ను ప్రవేశపెట్టారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ,అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. 

ఆదర్శ జూనియర్ కళాశాలలో అందజేస్తున్న "ఉచిత కార్పొరేట్ స్థాయి విద్య "ను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అనుభవం ఉన్న అధ్యాపకులు బోధించడం వలన ఏటా ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని, బాలికలకు వసతి సౌకర్యం కూడా ఉందని ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తోట గాంధీ తెలిపారు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...