డాక్టర్ మర్రి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం వారం రోజుల ఉచిత ఓరియంటషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తుంది .జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు .ప్రతిరోజు మూడు గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులు, సీనియర్ అధికారులు పాల్గొని అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు. పరీక్షా వ్యూహాలు, ప్రణాళిక ,వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు,కెరీర్ మార్గదర్శకత్వం పై ప్రధానంగా శిక్షణ అందిస్తారు. "శిక్షణ మాత్రమే ఉచితంగా "ఉంటుంది. బస ,భోజన సదుపాయాలు అభ్యర్థులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది .ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ctsmcrhrdit24@gmail.com కు మెయిల్ చేయాలి.
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment