Saturday, 13 June 2026

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ పాషా  తెలిపారు. పదేళ్లుగా అకాడమీలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు వివిధ సర్వీసులలో ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను ఈనెల 20వ తేదీలోగా www.mseducationacademy.in  వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

హైద్రాబాద్, నిజామాబాద్,నిర్మల్, మహబూబ్ నగర్, హన్మకొండ, సదా శివ పేట, ఆదిలాబాద్, బోధన్ ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేస్తామని , టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తామని తెలిపారు.

మరిన్ని వివరాలకు 85208 60785 ,90300 45422 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

No comments:

Post a Comment

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...