నిరుపేద విద్యార్థుల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తూ వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రణీత్ గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితంలో రాణించాలంటే చదివే కీలకమని నమ్మిన వ్యక్తి ఆయన .ఆర్థిక సమస్యతో ఆ చదువు నిరుపేద విద్యార్థుల నుంచి దూరం కావద్దని తపన పడే మనిషి. అందుకే తన చిన్నప్పుడు మనకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని నాయనమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు అతని సేవా కార్యక్రమానికి ప్రేరణ నిస్తున్నాయి .ఇప్పటివరకు నగరంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు స్పోర్ట్స్ షూస్, స్కూల్ బ్యాగులు ,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పదో తరగతిలో 500 మార్కులు దాటిన ఆయా స్కూళ్లకు చెందిన 43 మంది విద్యార్థులకు తన నాయనమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన" కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్" ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ మొత్తంగా 21 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే ఈ స్కాలర్షిప్ సహాయం ప్రతి ఏడాది కొనసాగనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రణీత గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ట్రస్ట్ కార్యక్రమాల గురించి ఈ విధంగా వివరించారు.
2007లో ప్రణీత్ గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేసిన నరేంద్ర కుమార్ గారు అంచలంచలుగా సాగిన తన ప్రస్థానంలో వారి నాయనమ్మ గారు తరచూ చెప్పిన మాటలు తనను చాలా ప్రభావితం చేశాయన్నారు. తన తొలి జీతం మూడు వేల రూపాయలు వచ్చినప్పుడు కూడా అందులో 300 రూపాయలు సహాయం చేసే వాడిని .అన్నపూర్ణమ్మ ట్రస్ట్ తో స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఇప్పటివరకు 250 మంది విద్యార్థులను ఇంజనీరింగ్ ,ఎంబీఏ, ఎంసీఏ చదివించానని, ఇలా సహాయం అందుకున్న విద్యార్థులు చాలా గొప్ప స్థానాలలో ఉన్నారని.. ఒక విద్యార్థి అమెరికాలో స్థిరపడి తన ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని తనవంతు సహాయం అందించాడని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లు ఉండకుండా ఉన్న సమస్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులలో సాధ్యమైనంత వరకు సంబంధిత పాఠశాలలో మంచి టీచర్లను నియమించే బాధ్యత ట్రస్ట్ తరఫున తీసుకుంటున్నామని ఆయన తెలిపారు .వారికి ట్రస్ట్ జీతాలు చెల్లిస్తుందని ,చాలామంది హెచ్ఎంలు తమ పాఠశాలలో టీచర్లను నియమించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు .అందుకే మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వారి సూచనల మేరకు టీచర్ల నియామకానికి ప్రణాళికలు వేశామన్నారు. ఒక వ్యక్తి చదువుకొని బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది .చదువు లేకున్న సాధించే వారు చాలామంది ఉన్నారు, కానీ చదువు ఆయుధం లాంటిదని నేను బలంగా నమ్ముతున్నాను. మహా అయితే 15 ఏళ్లు చదువుతాము, ఆ తర్వాత అంతా జీవిత పోరాటమే. అందుకే ఆ చదువు ఫౌండేషన్ బలంగా ఉంటే విద్యార్థులు గొప్పగా రాణిస్తారు .
నాయనమ్మ ఆదర్శం..
సాయం, సేవ చేయాలని ఆలోచన నేను మా నాయనమ్మ నుంచే నేర్చుకున్నాను. నాయనమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఆమెది తన వద్ద ఉన్నదాంట్లో కొంత సహాయం చేసే మనస్తత్వం. సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటే డబ్బే కాదు ,ఏ రూపంలోనైనా సహాయం అందించగలను అని చెబుతుండేది. పది మందికి సహాయం చేసే ఆలోచనలు నాటుకు పోయేలా చిన్నప్పటి నుంచి నూరి పోసింది .ఏడో తరగతి వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడేది. నీ గురించే కాదు నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించమని చెబుతూ ఉండేది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా ట్రస్ట్ కార్య కలాపాలకు ప్రేరణ మా నాయనమ్మ .ఈ సేవలు మరింత విస్తృతంగా చేయాలని ఆలోచనతో ఉన్నాము.ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుంది ఆయన తెలిపారు.
ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చాక, మళ్లీ ఆ స్కూల్ ,కాలేజీలో అడుగుపెట్టిన వారు ఎంతమంది ఉంటారు? మనం ప్రతిదీ ప్రభుత్వం నుంచి పొందాము. మరి మనం ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను వినియోగించుకొని ఎదిగాము కదా.. మరి మనం ప్రభుత్వ పాఠశాలకు ఏం చేయగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటారు నరేంద్ర కుమార్ కామరాజు .
తమ ట్రస్ట్ ను సంప్రదించాలి అనుకుంటే 7337252627 నెంబర్ కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి