రెండు దశాబ్దాలుగా ఉచిత సేవలు..అభయ ఫౌండేషన్
పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న నిరుపేద మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అభయ ఫౌండేషన్ గురువారం నాడు ప్రకటించింది. 100 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు "ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కూడా" కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీం పట్నం లోని అభయ ఆనంద నిలయంలో జరిగే ఈ ఉచిత శిక్షణ కార్య క్రమానికి "రీగల్ రెక్స్ నార్డ్, వీ ఎం ఆర్ లాజిస్టిక్స్ సంస్థలు సహకరిస్తున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది.
సీనియర్ ఇన్స్పెక్టర్ పీ. జగదీశ్వర్ పర్యవేక్షణలో ఇది జరగనుంది. అభ్యర్థినులను ఎంపిక చేయడానికి ఆదివారం రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్ లతో పాటు మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ముల్కనూర్, ఖమ్మం, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్, సిద్ధి పేట, సంగారెడ్డి లలో అర్హతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
మరిన్ని సమగ్ర వివరాలకు 9963002727,9959220450,7032813578 నంబర్ లలో సంప్రదించాలని అభయ ఫౌండేషన్ కోరింది. గత రెండు దశాబ్దాలుగా ఈ తరహా సేవలు అందిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.