నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖలతో పాటు , స్వచ్ఛంద సంస్థలు, గురుకులాలు, బ్యాంకులు, ఏ టి సి లు తదితర ఎన్నో సంస్థలలో యువతకు ఉపాధి అవకాశాలు పొందేందుకు, ఉద్యోగాలు పొందేందుకు , ఉన్నత విద్య లో ప్రవేశం పొందేందుకు .. ప్రవేశ పరీక్ష లకు " ఉచిత శిక్షణ లు " అందుబాటు లోనికి వచ్చాయి..
జీవితంలో ఎదగాలి,ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న విద్యార్థులే కాకుండా నిరుద్యోగ యువత కు,మహిళలకు,కార్మికులకు ఇవి ఎంతో సహాయకారిగా ఉంటున్నాయి. చదువు పై శ్రద్ధ, నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆసక్తి గలవారు ఉన్నత స్థాయి కి వెళ్లేందుకు ఈ ఉచిత శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొంటారు..అలాంటి సంస్థల సంక్షిప్త వివరాలు ఇవి..
టాస్క్ లో నైపుణ్య అభివృద్ధి..
చదువుతో పాటు భవిష్యత్ లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి " టాస్క్" శిక్షణలు ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వివిధ కోర్సులు చదవొచ్చు. ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. కంప్యూటర్ కోడింగ్, లాంగ్వేజెస్, ఏ ఐ టూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది.
ప్రైవేట్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ముఖాముఖి, బృంద చర్చ నైపుణ్యాలు నేర్పుతారు.
పూర్తి సమగ్ర వివరాలకు 91542 52588 , 7013675052 జిల్లా మేనేజర్ రఘుతేజ్ ను సంప్రదించవచ్చు.
భవన నిర్మాణ రంగంలో..
కార్మిక సంక్షేమ శాఖ, న్యాక్ ఆధ్వర్యంలో ప్లంబింగ్,శానిటేషన్,పెయింటింగ్,డెకొరేషన్, తాపీ మేస్త్రి, ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ పనులపై 15 రోజుల పాటు నైపుణ్యాలు నేర్పుతారు.
పూర్తి సమగ్ర వివరాలకు 98663 50200,99597 73079 నిజామాబాద్, 97045 87655 భీమ్ గల్.. ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచిస్తున్నారు..
స్వయం ఉపాధి కోసం భరోసా..
డిచ్ పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 19-45 ఏళ్ల వయసు గల గ్రామీణ మహిళలు ,యువతకు స్వయం ఉపాధి కోర్సులు నేర్పిస్తున్నారు.
మగ్గం వర్క్స్, హోం నీడ్స్ తయారీ,ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్,సర్వీస్,రిటైల్, కుట్టు మిషన్,కుట్లు అల్లికల లో నైపుణ్యం పొందవచ్చు.
పూర్తి సమగ్ర వివరాలకు..08461-222428 నంబరులో సంప్రదించాలి.
నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు..
పదో తరగతి పాసైన నిరుద్యోగ యువత కు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ను జిల్లాలోని 7 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏ టీ సీ) లలో నేర్పిస్తున్నారు.
ఇక్కడ అందించే కోర్సుల వివరాలు తెలుసుకునేందుకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ లో గానీ,94417 07536 నంబరును గానీ సంప్రదించవచ్చు.
నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు..
నీట్, జేఈఈ మెయిన్స్ ఉన్నత విద్య పోటీ పరీక్షలకు ప్రైవేటులో శిక్షణ కు భారీగా ఖర్చు అవుతుంది.అందుకే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కేజీబీవీ సీ వో ఈ లలో వంద మంది విద్యార్థుల చొప్పున ఉచిత శిక్షణ ఇస్తున్నాయి.ఇటీవలే ఇంటర్ పాసైన వారికి లాంగ్ టర్మ్ శిక్షణ కు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.సాంఘిక, బీసీ సంక్షేమ గురుకులాల ఆర్ సీ వో కార్యాలయాలలో సంప్రదించాలి.
బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ శిక్షణ..
టీ జీ పీ ఎస్ సి గ్రూప్స్ తో పాటు బ్యాంకింగ్, ఆర్ ఆర్ బి , స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగార్థులకు .. నిజామాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో 125 రోజులపాటు ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నారు . ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు.
పూర్తి సమగ్ర వివరాలకు 08462-241055 నంబరులో సంప్రదించాలి.
ఇవే కాకుండా వ్యవసాయ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో " రైతు శిక్షణ", "పశు వైద్యం","పాల ఉత్పత్తి" పై శిక్షణ లు అందుబాటు లో ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి