Saturday, 2 May 2026

ఉచిత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

 ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలలో ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతుంది .అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆరు రోజుల పాటు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మే 18 వ తేదీ నుండి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నది. 18న మారథాన్ ఫిజికల్ లిటరసీ, 19న కెరీర్ స్కిల్ డే ,20న యూత్ లీడర్ షిప్ సబ్మిట్, 21న స్పోర్ట్స్ డే, 22న యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ సర్వ్ అండ్ సపోర్ట్ , 23న ఉద్యోగ సాధన కార్యక్రమాలను చేయాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిట శ్రీహరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబుల పర్యవేక్షణ లోనిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలు మే ఒకటి నుంచి మీ 12 వరకు జరగనున్నాయి. 

20వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యము..

మే ఒకటి న మహబూబ్నగర్, 2న నల్గొండ, 4న ఖమ్మం, ఐదున కరీంనగర్ ,ఆరు న పెద్దపల్లి ,ఆదిలాబాద్, 7న నిజామాబాద్ ,ఎనిమిదిన సంగారెడ్డి, వరంగల్, 11న రంగారెడ్డి ,12న హైదరాబాద్ జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు.

తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలు 250 క పైగా కంపెనీలు 20వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబోతున్నారు. జాబ్ మేళాకు వచ్చేవారు ఇంటర్ డిప్లమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉండి అనుభవం ఉన్నవారు అదే వధంగా కొత్తవారు కూడా తమ ప్రతిభకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. జాబ్ మేళాకు వచ్చేవారు రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రత్యేక వెబ పోర్టల్ ను క్రీడలు యువజన సర్వీసుల శాఖ రూపొందించింది. ఈ జాబ్ మేళాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు జిల్లాల క్రీడా శాఖ అధికారులు యువజన శాఖ అధికారులను సంప్రదించవచ్చు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ యాక్షన్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు శ్రీ బండారు జితేందర్, పిఆర్వో  రాష్ట్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ.

నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు వీరమని భక్తులు తదితరులు ఉన్నారు.

ఎడపల్లి పరిసర ప్రాంత ప్రజలు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోగలరని కోరారు.

ఫ్రీ కన్సల్టేషన్ @ కామారెడ్డి

 


కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల కీర్తి హాస్పిటల్ నందు రోగులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చూడబడును.

 మూడు రోజుల పాటు ఫ్రీ కన్సల్టేషన్ కలదు.కావున రోగులు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నిజాంసాగర్ చౌరస్తానందుకల కీర్తి హాస్పిటల్ ,జనరల్, సర్జికల్ ,డెంటల్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ లో సంప్రదించి ఉచితంగా సేవలు పొందవచ్చు. ఫోన్ నెంబర్ 08468469989 , సెల్ నెంబర్ 9392242750 నందు పూర్తి వివరాలకు సంప్రదించవచ్చు.


రక్త పరీక్షలు మరియు ఈసీజీ టెస్ట్ ల పై 50% తగ్గింపు కలదు.


Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ఆటోలో ఉచిత ప్రయాణం..

 మండే ఎండలలో ఆటో ఎక్కే ప్రయాణికులను ఎండ నుండి రక్షించేందుకు ఒక డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసల పల్లికి చెందిన భూక్య హంజ్యా /ఆటో అంజి తన ఆటో చుట్టూ గ్రీన్ మ్యాట్, పైన వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆటో లోపల రెండు చిన్న ఫ్యాన్లు అమర్చడంతో పాటు ప్రయాణికుల కోసం కూల్ వాటర్ సౌకర్యాన్ని సైతం కల్పించాడు .

అలాగే దివ్యాంగులు, గర్భిణులకు తన ఆటోలో " ఉచిత ప్రయాణం " కల్పిస్తున్నాడు. దీనితో ఆటో అంజిని పలువురు అభినందిస్తున్నారు.




Wednesday, 29 April 2026

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సొంతంగా నాట్య శిక్షణ సంస్థను స్థాపించారు .ఆ సంస్థ ద్వారా వందలాది మంది చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చి దిద్దు తున్నారు. 

వేసవి   సెలవులను వృధా చేయకుండా పేద విద్యార్థినలకు నాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు .

 నాట్య శిక్షణ ద్వారా పేరు తెచ్చుకున్న రవళి స్నాతకోత్ర స్థాయిలో గణితంలో బంగారు పతకం సాధించారు. తెలుగు విశ్వవిద్యాలయ  లలిత కళా పీఠంలో ఎంపీ ఎ పూర్తి చేశారు. ఇలా ఉన్నత విద్య అభ్యసించిన రవళి తాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న శాస్త్రీయ నృత్య రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేలకల్ రోడ్డులో సాయి రవళి సొంతంగా ..అందెల రవళి ..పేరిట నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అమ్మానాన్నలు, అమ్మమ్మ ప్రోత్సాహంతో చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు .

శిష్యులతో ప్రదర్శనలు..

 రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై రవళి తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు .ఇప్పటివరకు 300కు పైగా పిల్లలను ఉత్తమ నృత్య కారుణులుగా తీర్చిదిద్దారు. నాట్య మయూరి ,నాట్య విశారద.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ఉపకార వేతనాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకునేలా చేశారు .ఇటీవల దుబాయిలో జరిగిన నాట్య సమ్మేళనం కార్య శాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అక్కడి భారతీయ పిల్లలకు నృత్యం పై ప్రత్యేక కార్యాశాల నిర్వహించారు. వచ్చే నెల 1 వ తేదీన కేరళలో జరిగే నాట్య సదస్సులో తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. తనకు నాట్యం ప్రాణమని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తున్నానని సాయిరవళి  తెలిపారు.

Tuesday, 28 April 2026

పాలిటెక్నిక్ ఉచిత మెటీరియల్ పంపిణీ

 అక్షర కోచింగ్ విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. 

మద్నూర్ మండల కేంద్రంలో విజన్ జూనియర్ కళాశాలలో ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం అక్షర పాలిటెక్నిక్  కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పరీక్షకు అవసరమైన మెటీరియల్ను సంస్థ డైరెక్టర్ డాక్టర్ బాలు ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థులు సరైన ప్రణాళికా పరమైన అభ్యసనతోనే పాలిటెక్నిక్ లో సీటు సాధించడం జరుగుతుందని, దానికి కావాల్సన శిక్షణను అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ లో అందజస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

ఉచిత డిజిటల్ సహకార కోర్సులు

 తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ.. సహకార రంగానికి సంబంధించి...