Showing posts with label ఫ్రీ స్పోర్ట్స్ కోచింగ్. Show all posts
Showing posts with label ఫ్రీ స్పోర్ట్స్ కోచింగ్. Show all posts

Friday, 1 May 2026

ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్నదని విలువిద్య శిక్షకుడు మద్దుల మురళి తెలిపారు.

మే 2 వ తేదీ నుండి " ఉచిత వేసవి విలువిద్య శిక్షణా శిబిరం  "ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని , వేసవిలో విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశమని ,చదువులో ఆటలు కూడా భాగమేనని , శారీరక, మానసిక ఉల్లాసానికి ఒక మంచి వ్యాయామమని అన్నారు.

విద్యార్థుల తల్లి దండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి , పిల్లలను క్రీడలలో పాల్గొనే అవకాశం కల్పించి వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఈ స్టేడియంలో విద్యార్థులు అందరూ ముందు వరుసలో ఉండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింక్ ద్వారా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారుడు మద్దుల మురళి ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకు మద్దుల మురళి 98489 19480 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Tuesday, 28 April 2026

విద్యార్థులకు పోలీసుల ఉచిత వేసవి శిక్షణ శిబిరం..

 నార్నూర్ మండలంలోని విద్యార్థుల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మే నాలుగవ తేదీ నుండి 30వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రెండు నుండి పదవ తరగతి విద్యార్థులకు యోగ కరాటే కబడ్డీ వాలీబాల్ అంశాలలో "  ఉచిత శిక్షణ " ఇస్తారు. 

ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీ లోపు నార్నూర్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలి వివరాల కోసం 8712659942 లేదా 8712659961 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై కోరారు.

నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార...