Showing posts with label ఫ్రీ హెల్త్ క్యాంప్స్. Show all posts
Showing posts with label ఫ్రీ హెల్త్ క్యాంప్స్. Show all posts

Monday, 8 June 2026

తాళ్ల రాంపూర్ లో ఉచిత చేప మందు పంపిణీ

 నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలంలోని తాళ్ళ  రాంపూర్ గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బెజ్జారపు లింబాద్రి తెలిపారు .గత 60 ఏళ్లుగా ఈ చేప మందు కోసం జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని ఆయన తెలిపారు. ఆస్తమా, దగ్గు ,దమ్ము వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చేప ముందు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని లింబాద్రి పేర్కొన్నారు.

నేటి నుంచి ఉచిత చేప ప్రసాదం పంపిణీ

 మృగశిర కార్తి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు ఉచితంగా చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తి ఉదయం పూట ప్రవేశిస్తుంది. అయితే ఈసారి ఈనెల 8వ తేదీ రాత్రి మృగశిర కార్తె వస్తుండడంతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు చేప ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని బత్తిని  గౌరీ శంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు దూద్బౌలి లోని బత్తిన గౌరీ శంకర్ గౌడ్ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దూద్బౌలిలోని స్వగృహంలో బత్తిని కుటుంబ సభ్యులంతా దాన్ని తీసుకున్నాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  పంపిణీ ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉబ్బస రోగులకు వారి సహాయకులకు మూడు రోజుల పాటు వసతి, భోజనం, మంచినీళ్లు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Saturday, 6 June 2026

కరక్ వాడిలో మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం

 గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో కరక్ వాడి అనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ వైద్య బృందం గ్రామ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మరియు ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందించింది. రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు ,కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అవసరమైన వారికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మెరుగైన చికిత్స అవసరమైన రోగులను మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్యాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేద మరియు గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్, పలమనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్, నర్సింగ్ సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఉచిత  వైద్య శిబిరంలో 300 మందికి పైగా గ్రామస్తులు వైద్య సేవలను వినియోగించుకుని లబ్ధి పొందారు.

Sunday, 31 May 2026

బీబీపేటలో ఉచిత వైద్య శిబిరం



 కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్ వారి సౌజన్యంతో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం అయ్యిందని సర్పంచ్ సాధ్విక, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ ,పాలకవర్గ సభ్యులు తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్  వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడంతోపాటు కంటి పరీక్షలు , చెవి ముక్కు గొంతు, వరిబీజం ,బీజ కుట్టు, గడ్డలు , కంతులు థైరాయిడ్ గడ్డలు,  గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబాన్నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళనొప్పులు, నడుము నొప్పులు, నరాల సమస్యలు,  కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ప్రమాదంలో వేసిన రాడ్స్ తీయడంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తాం అని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 104 మంది రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారని 60 మందికి వివిధ రకాల శాస్త్ర చికిత్సల అవసరమని గుర్తించామని తెలిపారు .ఆదివారం బీబీపేట పంచాయతీ ఆవరణలో మెడిసిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులు ఉదయం 8 గంటలకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఉచిత బస్సులో మెడిసిటి హాస్పిటల్ కు తీసుకు వెళ్లి శస్త్ర చికిత్సలతో పాటు " మందులను సైతం ఉచితంగా" అందజేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధ్విక,  ఉప సర్పంచ్ ప్రశాంత్ తో పాటు పాలకవర్గ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మెడిసిటి హాస్పిటల్ వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర తో పాటు సిబ్బంది, రోగులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ముత్తూట్ ఫైనాన్స్ ఉచిత వైద్య శిబిరం

 


ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని భీముగల్ మున్సిపల్ చైర్మన్ నాగమణి అన్నారు. శనివారం భీంగల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించారు. శిబిరం రీజినల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ బొమ్మ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి ఏడాదికి సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు దళిత శిబిరం ఏర్పాటు చేసిన ఫైనాన్సువారికి పట్టణ ప్రజల తరఫున చైర్మన్ మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతోటి ఫైనాన్స్ వారు ఆధ్వర్యంలో చైర్మన్ దంపతులకు శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, హరి నారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్ సిబ్బంది వినయ్ ,విగ్నేష్ , వర్ష తదితరులు పాల్గొన్నారు.



Monday, 25 May 2026

RIDO NGO ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

 నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్ ఐ డి వో ఎన్ జి ఓ ఆధ్వర్యంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .దంత సమస్యలతో బాధపడుతున్న పలువురికి  " ఉచితంగా వైద్య పరీక్షలు " నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథి గా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గౌతమ్ నగర్ కార్పొరేటర్ శివ చరణ్, నరేందర్ ,సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు తదితరులు పాల్గొని నిర్వహకులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్ఐడిఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు" ఉచిత వైద్య సేవలు " అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలు" ఉచిత వైద్య శిబిరాలు " మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయానికి సహకరిస్తున్న వైద్యులు, అతిథులు మరియు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Monday, 18 May 2026

జన్నేపల్లిలో ఉచిత వైద్య శిబిరం

 నవీపేట మండలంలోని చన్నేపల్లిలో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. కోశాలేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురికి దంత పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ మూడుసు గంగాధర్ ఉపసర్పంచ్ వీరేందర్రావు ఐద్య సిబ్బంది ప్రసూన మనీత్ రావు, అనిల్, అజయ్ కార్తికేయ భరత్ పాల్గొన్నారు. 



Tuesday, 28 April 2026

సహారా హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 మారుమూల తండాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముకుంద తాండా సర్పంచ్ ప్రకాష్ అన్నారు. 

సోమవారం ఆ తండాలో సహారా హెల్త్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు వైద్యం పట్టణ ప్రజలకు కాకుండా మారుమూల ప్రాంతంలోని తండాలలో నివసించే గిరిజనుల ఇంటింటికి వచ్చి వైద్యం అందించడం అభినందనీయం అన్నారు. 

గిరిజన ప్రాంతాలలో సిఎస్ఆర బాధ్యతతో ఆరోగ్యం పై అవగాహన కలిగించడం గొప్ప విషయం అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా 100 గిరిజన తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సహారా హెల్త్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు సర్పంచ్ ప్రకాష్ లక్ష్మణ్ నాయక్ మహిపతి సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 11 April 2026

ఉచిత కంటి వైద్య శిబిరం@మాక్లూర్

 మాకూర్ మండల పరిధిలోని ఆర్టీసీ కాలనీలోని మాక్లూర్ పోలీస్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఆటో డ్రైవర్లు మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి చూపు అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యం పై ముఖ్యంగా కంటిచూపుపై దృష్టి పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కాపాడవచ్చును సూచించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఐ డ్రాప్స్ అందించినట్లు పేర్కొన్నారు .

ఇందులో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ మాక్లోర్ ఎస్సై 2 మొగులయ్య నవీపేట్ ఎస్సై టు యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 9 April 2026

10 న ఉచిత ఆయుష్ వైద్య శిబిరం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోఎస్ కాలనీలో ఈ నెల 10వ తేదీన ఉచిత మెగా ఆయుష్ ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత తెలిపారు .ప్రజా పాలనా, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు ఎన్జీవోఎస్ కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు .

ఈ సందర్భంగా హోమియోపతి ,ఆయుర్వేదం ,యునాని పరీక్షలు ఉచితంగా జరపనున్నట్లు తెలిపారు. ఉదయం 6:30 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా నిర్వహణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 కామారెడ్డి పట్టణ ప్రజలు ,పరిసర ప్రాంతాల ప్రజలు, 14వ వార్డు ప్రజలు హోమియోపతి ,యునాని, ఆయుర్వేద పరీక్షలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  మరియు జిల్లా వైద్య అధికారులు హాజరవుతారని తెలిపారు .

ఈ కార్యక్రమంలో హోమియోపతి, ఆయుర్వేద, యునాని యోగ డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్  జునైద్ బేగం, డాక్టర్ విజయ, డాక్టర్ దేవయ్య, ఫార్మసిస్ట్ కిషోర్ ,యోగ మాస్టర్ బాల్ లింగం తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 8 April 2026

నేడు పెద్ద మల్లారెడ్డి లో వైద్య శిబిరం

 భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆర్వీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ సాయ గౌడ్ ,ఉప సర్పంచ్ చైతన్య మంగళవారం తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో ఆర్విఎం ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని అన్నారు. 

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శాస్త్ర చికిత్సలు ,ఇతర మెరుగైన వైద్యం కావాల్సిన వారిని గురువారం ప్రత్యేక వాహనంలో ఆర్విఎం ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు.


Saturday, 4 April 2026

ఉచిత వైద్య శిబిరం @ రెంజల్

 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెంజల్ జిల్లాపరిషత్ పాఠశాల లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నాయకుడు నల్ల నవీన్ కుమార్ తెలిపారు.

 రెంజల్ మండలం, పరిసర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇట్టి వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని ,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.

 ఇట్టి మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ,మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. శుక్రవారం నాడు ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు .

ఈ కార్యక్రమంలో కాలేవార్ సంజీవ్, సాయి ప్రకాష్, సాయి కమార్ ,సంజయ్, గంగరాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...