Wednesday, 29 April 2026

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సొంతంగా నాట్య శిక్షణ సంస్థను స్థాపించారు .ఆ సంస్థ ద్వారా వందలాది మంది చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చి దిద్దు తున్నారు. 

వేసవి   సెలవులను వృధా చేయకుండా పేద విద్యార్థినలకు నాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు .

 నాట్య శిక్షణ ద్వారా పేరు తెచ్చుకున్న రవళి స్నాతకోత్ర స్థాయిలో గణితంలో బంగారు పతకం సాధించారు. తెలుగు విశ్వవిద్యాలయ  లలిత కళా పీఠంలో ఎంపీ ఎ పూర్తి చేశారు. ఇలా ఉన్నత విద్య అభ్యసించిన రవళి తాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న శాస్త్రీయ నృత్య రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేలకల్ రోడ్డులో సాయి రవళి సొంతంగా ..అందెల రవళి ..పేరిట నాట్య శిక్షణాలయాన్ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అమ్మానాన్నలు, అమ్మమ్మ ప్రోత్సాహంతో చిన్నారులకు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు .

శిష్యులతో ప్రదర్శనలు..

 రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై రవళి తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించారు .ఇప్పటివరకు 300కు పైగా పిల్లలను ఉత్తమ నృత్య కారుణులుగా తీర్చిదిద్దారు. నాట్య మయూరి ,నాట్య విశారద.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు ఉపకార వేతనాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకునేలా చేశారు .ఇటీవల దుబాయిలో జరిగిన నాట్య సమ్మేళనం కార్య శాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అక్కడి భారతీయ పిల్లలకు నృత్యం పై ప్రత్యేక కార్యాశాల నిర్వహించారు. వచ్చే నెల 1 వ తేదీన కేరళలో జరిగే నాట్య సదస్సులో తన శిష్యులతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. తనకు నాట్యం ప్రాణమని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తున్నానని సాయిరవళి  తెలిపారు.

No comments:

Post a Comment

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...