ఫ్రీ మీల్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ మీల్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత అన్నదాన భవనం@ బోధన్

 నిజామాబాద్ జిల్లా లోని బోధన్ పట్టణం లోని నర్సి రోడ్డు మారుతీ మందిరం వద్ద భక్తుల సౌకర్యార్థం " ఉచిత అన్న దాన భవనం" నిర్మాణం చేయడం అభినందనీయమని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి గారు అన్నారు. 



శనివారం భవనంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం భవన నిర్మాణం చేపట్టిన కృష్ణ సైకిల్ స్టోర్స్ యజమాని వి. నరసింహ రావు గారి ని ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ రావు, శివాలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. 

5, ఆగస్టు 2026, బుధవారం

ఉచిత భోజనం@శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్, సీలేరు

 ఇప్పుడిప్పుడే పట్టణంగా ఎదుగుతున్న ఏజెన్సీ ప్రాంతం.. సీలేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ఊరిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చింది నక్కా జ్ఞానేశ్వర రావు గారి కుటుంబం. మొదట్లో వ్యవసాయం చేసిన ఆయన, తర్వాత శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెసిడెన్సీ అండ్ రెస్టారెంట్ ను పెట్టాడు. అప్పుడే అక్కడికి గర్భిణులు ఎక్కువగా రావడం గమనించాడు. వారందరూ మారుమూలన ఉన్న పర్వత ప్రాంతాల నుంచి సీలేరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వచ్చే గిరిజనులు. ఐతే వారి దగ్గర భోజనానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. తమ దగ్గర ఉన్నదేదో చేతిలో పెట్టి వెళ్ళి పోయే వారు. ఆయన కూడా ఇంతే ఇవ్వాలి అని పట్టు పట్టేవారు కాదు. పోనుపోను వారిని డబ్బులు అడగడమే మానేశాడు జ్ఞానేశ్వర రావు. అలా 2018 నుండి వారికి ఉచితంగానే భోజనం పెడుతున్నాడు ఆయన. 

కేవలం తన హోటల్ ను వెతుక్కుంటూ వచ్చే వారికి మాత్రమే కాకుండా , సీలేరు పీ హెచ్ సీ లో పని చేసే నర్సులకు రోజూ తన హోటల్ మీల్స్ టోకెన్లు ఇస్తున్నాడు. వారు దవాఖానకు వచ్చే గర్భిణులకు , వారి సహాయకులకు ఈ టోకెన్లు ఇచ్చి హోటల్ కు పంపిస్తున్నారు. అలా రోజూ కనీసం 20 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు శ్రీ జ్ఞానేశ్వర రావు. 

ఇక్కడ ప్రతి నెలా 9 వ తేదీన గర్భిణులకు అన్ని రకాల టెస్టులు చేస్తుంటారు. ఆ సమయంలో వంద మంది కి పైగా వస్తుంటారు. ఆ రోజున తన భార్య నాగమణితో కలిసి హోటల్ నుండి తానే స్వయంగా భోజనం తీసుకెళ్లి ఇస్తుంటాడు ఆయన. 

4, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత అన్న ప్రసాదం@ కడప కలెక్టరేట్

 అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జరిగినట్లుగానే కడప కలెక్టరేట్ లో కూడా ప్రతి సోమ వారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. చుట్టు పక్కల ఊర్ల నుండి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు తీసుకుని వస్తుంటారు. పెన్షన్ దరఖాస్తుల కోసం, ఇతర సహాయాల కోసం, అర్జీలు పెట్టుకుని అధికారుల వంక ఆశగా చూస్తుంటారు. అందుకే దానిని అధికారికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పిలుస్తుంటారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు కానీ వచ్చిన వారి ఆకలి మాత్రం తీరుతుంది. అలా అర్జీలు పట్టుకుని అక్కడికి వచ్చే వారందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఈ ఉచిత అన్నదానాన్ని శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. రాయల సీమ లో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను స్థాపించిన వ్యక్తి ఆయన. 

1986 లో నాటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్టీరామారావు గారి మీద అభిమానంతో బసవరామ తారకం న్యాయ కళాశాల అని పేరు పెట్టారు ఆయన. 2015 లో గోవర్ధన్ రెడ్డి గారు కడప కలెక్టరేట్ కు పని మీద వచ్చినప్పుడు , అర్జీలు పట్టుకుని మధ్యాహ్నం వరకు అధికారుల కోసం పడిగాపులు కాస్తూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసారట ఆయన. ఈ దుస్థితిని తొలగించాలని నాటి నుంచి ఈ అన్న యజ్ఞాన్ని ప్రారంభించారు. దీని కోసం నెలకు దాదాపు 50 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

పోలీసు అధికారిగా పనిచేసిన తన తండ్రి ,తల్లితో కలిసి ప్రతి రోజూ కొంత మంది పేదవారికి   ఇంటి వద్ద అన్నం పెట్టేవారని , నేను దానిని కొనసాగిస్తున్నాను, అంతే అంటారు వినమ్రంగా శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. 

24, మే 2026, ఆదివారం

పాయల్ ఫౌండేషన్.. ఉచిత అన్న దానం

 పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత అన్నదానం ..

బేల సబ్ మార్కెట్ యార్డులో పంటలను అమ్ముకోవడానికి వస్తున్న రైతులకు పాయల్ ఫౌండేషన్ ఉచితంగా అన్నదానం చేస్తూ ఆదుకుంటుంది. మార్కెట్ యార్డ్ కి వచ్చిన రైతులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమని పాయల్ శంకర్ ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు రైతులకు గన్ని బ్యాగులు, చల్లటి మంచినీటి వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు  ఇంద్రశేఖర్, భూపతి రెడ్డి ,నవీన్ ,దత్త నిక్కం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

22, ఏప్రిల్ 2026, బుధవారం

అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ

 వేములవాడ నాలుగవ వార్డు మహాలక్ష్మి వీధికి చెందిన పెంట మల్లేశం మరణించగా అంత్యక్రియల అనంతరం వారి కుటుంబానికి అన్నపూర్ణా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్ పర్సన్ తోటలహరి ద్వారా ఉచితంగా భోజనం అందించారు.

 పెంట స్వరూప్ ,రవి ప్రిన్స్ అందించిన సమాచారం మేరకు సకాలంలో భోజనం పంపించినట్లు చైర్పర్సన్ తోటలహరి తెలిపారు. 

వేములవాడ పట్టణంలో ఎవరైనా మరణించిన సందర్భంలో ట్రస్ట్ నంబర్ 8919376459 కు సమాచారం ఇస్తే బాధిత కుటుంబాలకు ఉచితంగా భోజనం అందిస్తామని అని తెలిపారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...