Showing posts with label ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. Show all posts
Showing posts with label ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. Show all posts

Saturday, 4 April 2026

14 న ఉచిత మెగా రక్త దాన శిబిరం..

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట తెలిపారు. కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు .శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కామారెడ్డి లోని కర్షక్ బీఈడీ కళాశాల లో కామారెడ్డి రక్త దాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి సహకారంతో  తలస్సేమియ  వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 కార్యక్రమ సమన్వయకర్త బాలు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, ప్రతినిధులు సంఘయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...