రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గద్వాల సీఐ శ్రీను సూచించారు రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అలా కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల మండలంలోని పూడూరు గ్రామంలో 100 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిఐటి శ్రీను రూరల్ ఎస్సై శ్రీకాంత్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని అది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా మన రక్షణ కవచమని అన్నారు ప్రధాన సమయంలో సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించే రహదారిపై పూర్తి అప్రమత్త తత్వం ఉండాలని సూచించారు అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు ప్రారంభించడం నుంచి ఆయన నష్టం నుంచి రక్షణ పొందవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పెద్దలు యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
Wednesday, 10 June 2026
Monday, 8 June 2026
ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ
రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ప్లాస్టిక్ తో నిర్మితమైన వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం పాడవాడమే కాకుండా భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నామని ఆయన తెలిపారు ఏ రూపంలో కూడా ప్లాస్టిక్ నిర్మితమైన వస్తువులు వాడకూడదని అలాగే మనకు రోజు వారి కార్యక్రమంలో ఉపయోగించే బస్తాలు వాడాలని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా కాటన్ తో తయారు చేసిన బ్యాగులు వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించడమే కాదు మనతోపాటు జీవిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే ఇలాంటి కాటన్ బ్యాగులను ఉపయోగించి మనకు అవసరమైన కూరగాయలు ఇతర వస్తువులను గాని తీసుకెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంజిలో గల కూరగాయల సంతలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచితంగా కాటన్ బ్యాగులు వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు తప్పకుండా అందరూ ఈ చిన్న మార్పుతో నిత్యజీవితంలో కాటన్ బ్యాగు ల వాడి భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ గిరీష్ కుమార్ గంగుల విజయ్ రమేష్ సుధాకర్ సంపత్ రాజశేఖర్ శిరీష్ కుమార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు
తాళ్ల రాంపూర్ లో ఉచిత చేప మందు పంపిణీ
నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు బెజ్జారపు లింబాద్రి తెలిపారు .గత 60 ఏళ్లుగా ఈ చేప మందు కోసం జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని ఆయన తెలిపారు. ఆస్తమా, దగ్గు ,దమ్ము వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చేప ముందు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని లింబాద్రి పేర్కొన్నారు.
నేటి నుంచి ఉచిత చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు ఉచితంగా చేప మందు పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తి ఉదయం పూట ప్రవేశిస్తుంది. అయితే ఈసారి ఈనెల 8వ తేదీ రాత్రి మృగశిర కార్తె వస్తుండడంతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు చేప ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని బత్తిని గౌరీ శంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు దూద్బౌలి లోని బత్తిన గౌరీ శంకర్ గౌడ్ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దూద్బౌలిలోని స్వగృహంలో బత్తిని కుటుంబ సభ్యులంతా దాన్ని తీసుకున్నాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉబ్బస రోగులకు వారి సహాయకులకు మూడు రోజుల పాటు వసతి, భోజనం, మంచినీళ్లు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Sunday, 31 May 2026
ఉచిత కుట్టు మిషన్లు పంపిణి
నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన మహిళల సాధికారత కొరకు స్థానిక అభ్యాస పాఠశాలలో రోటరీ ఆసరా కార్యక్రమం ద్వారా ఉచితంగా 60 కుట్టుమిషన్లను అలాగే వీటితో పాటు 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహ రావు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఒక మహత్తర సేవ కార్యక్రమానికి సాక్షులుగా నిలుస్తున్నామని ,ఆసరా పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్వీస్ ఈవెంట్ ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 60 కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .ఇది ఒక సహాయం మాత్రమే కాదు అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని ఉపాధిని మంచి భవిష్యత్తును అందించే ఒక గొప్ప ప్రయత్నం తెలిపారు. మహిళా సాధికారత అనేది సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే వారి కుటుంబం బలపడుతుందని దానితో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని ,ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరూ అభినందనీయులు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ ఐ డి 3150, గౌరవ అతిథులుగా ఆర్టీవో కే రాజేంద్ర కుమార్ నిజామాబాద్ పి డి జి రమేష్ వంగాల ,రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కె ఎస్ ఆర్ ప్రసాద్ ,రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొనగా ,ప్రాజెక్టు చైర్మన్గా రొటేరియన్ డాక్టర్ పి విష్ణు బాబు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రొటీరియల్ రంజిత్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మరియు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి సంగులూరు లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సెక్రెటరీ లక్ష్మీ విసిరెడ్డి ,రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సెక్రటరీ గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్ ,రొటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 27 May 2026
1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు
ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..
ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.
ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.
ఈ - దార్ పోర్టల్ అంటే..
ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..
పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.
వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.
రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.
బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు.
సత్వర వైద్యం అందుబాటులోకి..
కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు
ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.
ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..
ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.
ఉచితంగా స్టీల్ బాక్స్ ల పంపి
లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ ప్లాస్టిక్ నిషేధానికి గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ బాక్సులు గ్లాసులకు బదులుగా స్టీల్ గ్లాసులు ,స్టీల్ బాక్సులు వాడాలని గ్రామస్తులకు స్టీల్ బాక్సులు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. హోటల్స్ నిర్వాహకులకు గాజు గ్లాసులు వాడాలని వారికి గ్లాసులను పంపిణీ చేశారు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించేందుకు గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఉప సర్పంచ్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు.
వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరం
నిజామాబాద్ లోని గంగస్థాన్లోని వివేకానంద ఆడిటోరియంలో రామకృష్ణ సేవా సమితి వారు వివేక్ సంస్కార వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును సంస్థ తరఫున మంగళవారం ఏర్పాటు చేశారు .వక్తలు మాట్లాడుతూ బాలల హక్కులు ,సంరక్షణ ,చట్టాలపై అవగాహన కల్పించారు . సెల్ఫోన్ వ్యసనం అనర్థాల గురించి వివరించారు. చిన్నారులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని న్యాయ సేవా సంస్థ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది రాజకుమార్ సుబేదార్ సూచించారు.
Tuesday, 19 May 2026
నిరాశ్రయులకు ఉచిత వసతి
వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం,అనారోగ్యం,పేదరికం తదితర కారణాలతో ఎంతోమంది నిరాదరణకు గురై వీధి పలు అవుతున్నారు. అలాంటి నిస్సహాయులను ఆదుకునేందుకు ప్రారంభించిన సంస్థ శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘం.. అనాధల సేవనే భగవంతుడు సేవ అని భావించిన కారుణ్యానంద స్వామీజీ దాదాపు 86 ఏళ్ల క్రితం రాజమండ్రిలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. నాటి నుంచి నిరాదైనా నాకు గురైన వారికి కుష్టి రోగులకు ఆశ్రయం కల్పిస్తూ అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు.
పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ ఆటలు పాటలు నేర్పిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సంస్థను పెట్టిన స్వామీజీ మరణించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ సంస్థ బాధ్యతలను తీసుకున్నది.
మా సంస్థలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఎవరైనా చనిపోయి ,వారి సంబంధికులు రాకపోతే మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాము అని అన్నారు సంస్థ కార్య నిర్వహణ అధికారి బాధ్యతలు చూస్తున్న పితాని తారకేశ్వర రావు.
ప్రతి నెలా ఉచితంగా బియ్యం..
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో ఉన్న విద్యా హై స్కూల్ లో సోమవారం "రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ" అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేదలకు "ఉచితంగా బియ్యం పంపిణీ"చేశారు.
ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలా నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.మొత్తం 65 మంది పేద వృద్ధులకు బియ్యం అంద చేశామన్నారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాన్దేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జిందం నరహరి , S g శ్రీకాంత్, గోనె శ్రీధర్,తులసి పట్వారీ, ఖాన్దేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 28 April 2026
ఉచిత మజ్జిగ కేంద్రం ప్రారంభం
బోధన్ కోర్టు ప్రాంగణంలో సోమవారం న్యాయ సేవా సంస్థ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రము మరియు మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాంచన రెడ్డి ప్రథమ శ్రేణి జూనియర్ సివిల్ జడ్జి మార్కెల్ పూజిత అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ సాయి బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
కడుపారా పులిహోర ఉపశమనం ఇచ్చే అంబలి
నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు.
ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 1 April 2026
ఉచిత అంబలి@ నిజామాబాద్ కలెక్టరేట్
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రం కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఉచిత తాగు నీటి తో పాటు అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. టీఎన్జీవో సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు..
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...


