Showing posts with label ఫ్రీ కౌన్సిలింగ్. Show all posts
Showing posts with label ఫ్రీ కౌన్సిలింగ్. Show all posts

Thursday, 26 March 2026

ఎస్ఎస్సి విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్

 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షల విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి అడ్వాన్స్డ్ సైకలాజికల్  సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించిందని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ భరత్ తెలిపారు.

పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే స్ట్రెస్,యాంగ్జైటీ తదితర సమస్యలకు ఉచితంగా పరిష్కారం చూపి ,వారు విజయవంతంగా పరీక్షలు రాసేలా చూడాలని తమ అసోసియేషన్ పూనుకుందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 105 మంది సైకాలజిస్టులు , అసోసియేషన్ పిలుపు మేరకు ఉచిత టెలి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు..

జిల్లాల వారీగా వారు అందుబాటులో ఉండే సమయాలు, పేర్లతో పోస్టర్ లు రూపొందించామని ,ఫోన్ నెంబర్లు కూడా పొందుపరచామని ,పరీక్షా సమయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఆ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సలహాలు పొందవచ్చని తెలిపారు.

ఈ క్రమంలో విద్యార్థులకు మరియు సైకాలజిస్టులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఈ కింది నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు 

800855 3069,  మరియు 99633 38639, 8686 4442 00 .

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...