ఫ్రీ డొనేషన్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ డొనేషన్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఏప్రిల్ 2026, బుధవారం

ఆసుపత్రికి ఉచితంగా సి ప్యాప్ యంత్రం అందజేత

 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీప్యాప్ యంత్రాన్ని కొందరి వైద్యులు ఉచితంగా అందజేశారు. ఆసుపత్రిలో విజయవంతంగా ఇన్స్టాలేషన్ పూర్తయింది.

 ఈ యంత్రాన్ని హైదరాబాదులోని అంకుర ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి ఇన్స్టాలేషన్ చేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఎం సి హెచ్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ మరియు డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షించారు. 

యంత్రం సక్రమంగా పనిచేస్తూ ,రోగులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు. ఈ యంత్రం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యుల తెలిపారు.

ఈ సందర్భంగా ఈ యంత్రాన్ని ఉచితంగా అందజేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉచితంగా వాటర్ ఫిల్టర్ అందజేత

 బిచ్కుంద మాజీ సర్పంచ్ మైపతి సిద్ధిరాం గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మహిపతి శ్రీనివాస్ గణేష్ మందిరం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ఉచితంగా అందజేశారు. 

సుమారు 41 రూపాయల వేల విలువ చేసే వాటర్ ఫిల్టర్ ను మంగళవారం బిగించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...