Showing posts with label ఫ్రీ కోర్సెస్. Show all posts
Showing posts with label ఫ్రీ కోర్సెస్. Show all posts

Monday, 8 June 2026

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Sunday, 7 June 2026

స్పోకెన్ ఇంగ్లీష్ 7 రోజుల ఫ్రీ ట్రయల్

 స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం .7 రోజులు ఉచితంగా విన్న తర్వాత నచ్చితేనే కోర్స్ లో చేరవచ్చు.

స్పోకెన్ ఇంగ్లీష్ నిపుణురాలు ఐన భూక్యా గౌతమి గారు " జీరో టు హీరో " అనే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ను రూపొందించారు.దీనిని gyan tv యాప్ లో అందుబాటులో ఉంచారు. కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారికి 7 రోజులు ఉచితంగా క్లాసులు వినే అవకాశం కల్పించారు. కోర్స్ నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు.లేకపోతే మానేయవచ్చు.

Saturday, 6 June 2026

సంస్కృత భాష పై ఉచిత అవగాహన శిబిరం

 సంస్కృత భాష పై ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 9 10 మరియు 11 తేదీలలో సరళ సంస్కృత భాష అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శశికాంత్ పులకరిని కార్యదర్శి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృత భాష నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు శిక్షణ శిబిరం బోర్గాలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు మహిళలు భాషాభిమానులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9494 392393 ఫోన్ నెంబర్లో సంప్రదించాల్సిన సూచించారు.

Sunday, 31 May 2026

సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్

 డాక్టర్ మర్రి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం వారం రోజుల ఉచిత ఓరియంటషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తుంది .జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు .ప్రతిరోజు మూడు గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులు, సీనియర్ అధికారులు పాల్గొని అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు. పరీక్షా వ్యూహాలు, ప్రణాళిక ,వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు,కెరీర్ మార్గదర్శకత్వం పై ప్రధానంగా శిక్షణ అందిస్తారు. "శిక్షణ మాత్రమే ఉచితంగా "ఉంటుంది. బస ,భోజన సదుపాయాలు అభ్యర్థులే  ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది .ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ctsmcrhrdit24@gmail.com కు మెయిల్ చేయాలి.

Tuesday, 26 May 2026

ఉచిత కుట్టు మగ్గం వర్క్ బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ

 కుట్టు ,మగ్గం వర్క్, బ్యూటిషన్ కోర్సులలో ఉచిత శిక్షణ పొందేందుకు నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతులు ,మహిళలకు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు .జూన్ 1 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయని అన్నారు .ఎంపికైన వారికి 30 రోజుల పాటు" ఉచితంగా వసతి కల్పించి భోజనం " అందిస్తామన్నారు .ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు .ఆధార్ కార్డు, నాలుగు ఫోటోలు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్త పుస్తకం తో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకొని రావాలని తెలిపారు.

Monday, 25 May 2026

ఆర్మూర్ లో ఉచిత శిక్షణ

 


మామూలు రోజుల్లో సెల్ ఫోన్ దొరికితే చాలు పిల్లలు పట్టుకుంటారు ఇక వేసవి సెలవుల్లో అయితే సెల్ ఫోన్ టీవీ తదితర వాటికి అతుక్కుపోతారు. ఈ వేసవి సెలవులు మాత్రమే వినూత్నంగా సాగుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలతో పాటు ప్రైవేటు సమ్మర్ క్యాంపులు సైతం విద్యార్థులతో కిట కిట లాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల బియ్యం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మోడల్ స్కూల్ కస్తూర్బా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు మొత్తం 90 మంది రోజు హాజరవుతున్నట్లు హెచ్ ఎం తెలిపారు డ్రాయింగ్ హార్ట్ అండ్ క్రాఫ్ట్ సంగీతం యోగ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు వేసవి సెలవులను పిల్లలు వృధా చేయకుండా శిక్షణ పొందడం ప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Friday, 8 May 2026

వైదిక గణితంలో ఉచిత శిక్షణ

 వైదిక గణితంలో ఉచిత శిక్షణ.. మరియు ఫ్రీ సమ్మర్ క్యాంప్..



కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల శ్లోక పాఠశాల బ్రాంచి 2 లో ఉచిత వైదిక గణిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల సీఈఓ జాలిగామ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరగనుంది అన్నారు. 9 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు .శిబిరాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



Monday, 4 May 2026

ఉచిత డిజిటల్ సహకార కోర్సులు

 తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ..

సహకార రంగానికి సంబంధించి 160 కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8భాషలలో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతి దారులు,విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ ఐ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు.ఇందుకోసం ప్రత్యేకంగా  savidya.coop పేరిట ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది.

సవిద్య అంటే సహకార విద్యాలయం .ఇది దేశంలోనే మొట్ట మొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు,విద్యార్థులు, ఎగుమతి దారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ  ' సహకార్ సే సమృద్ధి ' చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణ ను అందిస్తుంది.

వ్యవసాయ పద్ధతులు ,ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160 కి పైగా  ఉచిత వీడియో కోర్సులు . తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషలలో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత  ఫీచర్లను  ఉపయోగించి కంటెంట్ ను వ్యక్తిగతికరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా ఙ్ఞానాన్ని అందించేందుకు ఏ ఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది. వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ,పంట దిగుబడిని మెరుగుపరచు కోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి.  విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధనా అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు ఎగుమతి దారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు , అంతర్జాతీయ వాణిజంపై అవగాహన పొందడానికి అవసరమైన  కోర్సులను సైతం ఇందులో పొందుపరచడం విశేషం.

నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ , క్రిబ్కో వంటి సహకార సంస్థలు సహకార విద్య ప్లాట్ ఫామ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 వేల సహకార సంఘాలను రెండు కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయడమే దీని లక్ష్యం.

మీరు savidya.coop లో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకుని , సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉ...