నీట్ , జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ కం అడ్మిషన్ టెస్ట్ 2026 నాలుగవ ఎడిషన్ను ప్రకటించింది .ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్ ,కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు చెందిన ఐదు నుంచి 12వ తరగతి విద్యార్థులు, 12వ తరగతి పాసైన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు" ఉచితంగా పేర్లను నమోదు" చేసుకోవచ్చని వెల్లడించింది. అర్హులైన విద్యార్థులు 100% వరకు ట్యూషన్ ఫీజు మినహాయింపు తో కూడిన స్కాలర్షిప్ లను పొందవచ్చని, అర్హులైన మొదటి 500 మంది విద్యార్థులకు" ఉచిత విద్యను ఉచిత హాస్టల్ వసతిని" కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్లైన్ పరీక్షను ఎంచుకునే విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పరీక్షకు హాజరు కావచ్చు అని, ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 3,4, 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
20, ఆగస్టు 2026, గురువారం
5, ఆగస్టు 2026, బుధవారం
ఉచిత విద్య@విద్యాఛాయ పాఠశాల@ సిలిగురి
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి పట్టణానికి చెందిన శక్తిపాల్ ది నిరుపేద కుటుంబం. అన్నం దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో బాల కార్మికుడిగా మారాడు ఆయన. తర్వాత ఎంతో శ్రమించి సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నారు శ్రీ శక్తిపాల్. తన చిన్నప్పటి ఆకలి బాధలను మరచిపోలేదు శక్తిపాల్. తనకొచ్చే జీతంలో సగాన్ని వెచ్చించి రూ. 1 జనతా హోటల్ అనే పేరుతో సిలిగురిలో ఒక హోటల్ స్థాపించారు.
ఇక్కడున్న ప్రభుత్వ ఆఫీసులకు,ఆసుపత్రులకు,ప్రయాణికులకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. మరి ఆ ఒక్క రూపాయి ఎందుకు అంటే..నేను నడిపే బడిలో వారిని ఏదో రకంగా భాగస్వాములను చేయాలి కదా అంటాడు.
విద్యా ఛాయ పేరుతో సిలిగురిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు శక్తి పాల్ గారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే పేద వలస కార్మికుల పిల్లల సంక్షేమమే లక్ష్యంగా నడిచే ఈ బడిలో " ఉచితంగా చదువు " చెప్పడమే కాదు, రెండు పూటలా భోజనం పెడుతున్నాడు,ఉచితంగా బట్టలు,పుస్తకాలు అందిస్తున్నాడు శక్తి పాల్.ఇందుకోసం తన సంపాదనలో సగానికి పైగా వెచ్చిస్తున్నారు శక్తి పాల్..
3, ఆగస్టు 2026, సోమవారం
జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ లో ఉచిత విద్య
అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వంచరెడ్డి శ్రీకాంత్, వ్యాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. జిల్లా సందర్శనకు వచ్చిన విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా గారిని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కలిసి ఉచిత విద్య అందించాలని వినతి పత్రం అందచేశారు. ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆమె డీఈఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ గారు స్పందిస్తూ ఇతర జిల్లాల్లో ని ప్రొసీడింగ్స్ పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందించేలా త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు.
అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ లలో ఉచిత ప్రవేశం
దేశంలో వృత్తిపరమైన శిక్షణ లో నాణ్యతను, ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ ఫర్మేషన్ త్రూ ఐ టీ ఐ స్.. పీఎం సేతు పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించి సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి ఏ టీ సీ ను ఎంపిక చేశారు. దీని ద్వారా ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ పరికరాలు , డిజిటల్ ల్యాబ్ లు, ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా 1000 ఏ టీ సీ లను ఆధునీకరించనున్నది.
సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి తో పాటు మెదక్, దుబ్బాక, హత్నూర్ ఏ టీ సీ లు ఉన్నాయి. వీటిని స్పోక్ ఏ టీ సీ లు గా అప్ గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యూ ల్యాండ్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతోంది.
ఉచిత ప్రవేశం..
విద్యార్థులు ఈ కోర్సుల లో ప్రవేశం పొందేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. శిక్షణా కాలంలో ప్రభుత్వం రూ.2 వేల చొప్పున స్టైఫండ్ లేదా స్కాలర్ షిప్ ఇస్తుంది. కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలెక్షన్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థల లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వంద శాతం ప్లేస్ మెంట్ సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఆసక్తి గల వారు టీ జి ఐ టీ ఐ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైద్రాబాద్ వంటి నగరాలకు వెళ్ళనవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ఈ స్పోక్ ఏ టీ సీ ద్వారా ఉచితంగా పొంది మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
.
2, జులై 2026, గురువారం
ఒడిశా లో ఉచిత విద్య
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గతంలో ప్రకటించారు .బుధవారం రాత్రి ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది. కార్యక్రమం తర్వాత మోహన్ స్వయంగా విలేకరులకు ఈ విషయం చెప్పారు .ఏడాదిలో 38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ,రుసుములు ఉండవని స్పష్టం చేశారు. డ్రాప్ ఔట్లు తగ్గించడం, గుణాత్మకమైన విద్యా బోధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.
వదిరాజా భట్ @ ఓ శాట్..
వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...
-
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస...
-
డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం .. 08461-295428 డిచ్ పల్లి లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 2026-27 ఆర్...
-
నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...