అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఏడిఎన్హెచ్ కంపెనీ మన రాష్ట్రంలోని జిటిఎం సంస్థలు సంయుక్తంగా యూఏఈ లో ఆఫీస్ బాయ్ వెయిటర్ డ్రైవర్ పోస్టులకు ఉచితంగా వీసాలు జారీ చేయనున్నాయి ఈనెల 19న జీటీఎం సంస్థ బ్రాంచీలు ఉన్న సికింద్రాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల సిరిసిల్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. 23 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఉద్యోగాలకు అర్హులని జీత సంస్థ చైర్మన్ సతీష్ రావు ప్రతినిధులు తెలిపారు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగి ఉండడంతో పాటు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలని ఒంటిపై పచ్చబొట్లు టాటూస్ లాంటివి ఉండకూడదని పేర్కొన్నారు ఆఫీస్ బాయ్ లకు నెలకు 26 వేల రూపాయలు వెయిటర్ లకు 30 వేల రూపాయలు హెవీ డ్రైవర్ కు 62000 లైట్ డ్రైవర్లకు 45 వేల వేతనం ఉంటుందని తెలిపారు అయ్యా ఉద్యోగాలకు ఉచిత వసతి భోజన సదుపాయాలు ఉంటాయని వివరించారు ఉచితంగా వీసాలు జారీ చేయడంతో పాటు యూఏఈ కి వెళ్లడానికి విమాన చార్జీలను సైతం కంపెనీ భరించనున్నదని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్ 8332052299 నిజామాబాద్ 86868 60999 ఆర్మూర్ 83320 1399 9, జగిత్యాల 8332042299 సిరిసిల్ల 93916 61522 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Saturday, 16 May 2026
Saturday, 2 May 2026
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
ప్రజా పలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ హెల్త్ కేర్ ఐటి బిజినెస్ సర్వీసెస్ కస్టమర్ సర్వీసెస్ హాస్పిటల్ డిజిటల్ మీడియా లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత కోసం ఏడవ తేదీన నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ గార్డెన్స్ ఆర్మూర్ రోడ్ ల జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 50 కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి ఈ సందర్భంగా జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు స్థల వివరాలకు జిల్లా యువజన క్రీడల అధికారి కామారెడ్డి జిల్లా కార్యాలయాన్ని లేదా 9440846682 మరియు 9618126053 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఆర్డిఓ గిరి, జిల్లా అధికారులు, జిల్లా యువజన క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
ఉచిత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలలో ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతుంది .అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆరు రోజుల పాటు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మే 18 వ తేదీ నుండి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నది. 18న మారథాన్ ఫిజికల్ లిటరసీ, 19న కెరీర్ స్కిల్ డే ,20న యూత్ లీడర్ షిప్ సబ్మిట్, 21న స్పోర్ట్స్ డే, 22న యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ సర్వ్ అండ్ సపోర్ట్ , 23న ఉద్యోగ సాధన కార్యక్రమాలను చేయాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిట శ్రీహరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబుల పర్యవేక్షణ లోనిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలు మే ఒకటి నుంచి మీ 12 వరకు జరగనున్నాయి.
20వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యము..
మే ఒకటి న మహబూబ్నగర్, 2న నల్గొండ, 4న ఖమ్మం, ఐదున కరీంనగర్ ,ఆరు న పెద్దపల్లి ,ఆదిలాబాద్, 7న నిజామాబాద్ ,ఎనిమిదిన సంగారెడ్డి, వరంగల్, 11న రంగారెడ్డి ,12న హైదరాబాద్ జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు.
తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలు 250 క పైగా కంపెనీలు 20వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబోతున్నారు. జాబ్ మేళాకు వచ్చేవారు ఇంటర్ డిప్లమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉండి అనుభవం ఉన్నవారు అదే వధంగా కొత్తవారు కూడా తమ ప్రతిభకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. జాబ్ మేళాకు వచ్చేవారు రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రత్యేక వెబ పోర్టల్ ను క్రీడలు యువజన సర్వీసుల శాఖ రూపొందించింది. ఈ జాబ్ మేళాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు జిల్లాల క్రీడా శాఖ అధికారులు యువజన శాఖ అధికారులను సంప్రదించవచ్చు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ యాక్షన్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు శ్రీ బండారు జితేందర్, పిఆర్వో రాష్ట్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ.
Wednesday, 22 April 2026
ఏప్రిల్ 25న ఉచిత జాబ్ మేళా
పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు మేడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఏప్రిల్ 25న శనివారం రూమ్ నెంబర్ 233 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మెడిప్లస్ కంపెనీలో 45 ఫార్మసిస్ట్ జాబ్స్, 50 ఆడిట్ అసిస్టెంట్ ,201 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 25న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో రూమ్ నెంబర్ 233లో నూతన కలెక్టర్ భవన సముదాయంలో పెద్దపల్లి మొదటి అంతస్తులో వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని మరిన్ని వివరాలకు 8985 336947 మరియు 8121262441 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Friday, 17 April 2026
18 న ఉచిత జాబ్ మేళా @ రామాయంపేట
మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 18 తేదీ న ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. MSN కెమికల్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.
ఇంటర్ MPC,ఇంటర్ BI PC,ఒకేషనల్ MLT కోర్సులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
కళాశాల లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత జాబ్ మేళా కొనసాగుతుందని ఆమె చెప్పారు.విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.
17 నుండి 21 ఏళ్ల వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంపెనీ ఆకర్షణీయమైన వేతనం చెల్లిస్తుందని ఆమె తెలిపారు.
18 న ఉచిత జాబ్ మేళా @ కామారెడ్డి కలెక్టరేట్
కామారెడ్డి జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 18 తేదీన ఉచిత జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ కంపెనీ అయిన గూగుల్ పే లో ఉద్యోగాలు ఉన్నాయన్నారు.18-35 ఏళ్ల వయసు ఉన్న యువతీ యువకులు కామారెడ్డి కలెక్టరేట్ లోని రూమ్ నంబర్ 121 లో ఉదయం 10.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని కోరారు.
అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్ ల నకలు తీసుకొని రావాలని సూచించారు.
Friday, 10 April 2026
15 న ఉచిత జాబ్ మేళా @ బాన్సువాడ
ఏప్రిల్ 15 తేదీన ఉచిత మెగా జాబ్ మేళా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ వారి సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, హోటల్ మేనేజ్ మెంట్ చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
18 నుండి 30 ఏళ్ల లోపు వయసు గల వారు అర్హులనీ ,బ్యాంకింగ్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటిఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మా తదితర రంగాలలో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
ఇతర వివరాలకు 94933 10781,98484 30111 ఫోన్ నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.
Wednesday, 8 April 2026
9 న ఉచిత జాబ్ మేళా @ బిచ్కుంద డిగ్రీ కళాశాల లో
బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఐక్యూసీ మరియు టాస్క్ ల ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత జాబ్ మేళా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కళాశాల వర్గాలు తెలిపాయి.
శ్రీ విజయ బయో ఫెర్టలైజర్స్ కంపెనీ తరఫున సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ లీడర్, టీమ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు.
దీనితోపాటు ముత్తూట్ ఫైనాన్స్ ఇంటర్ షిప్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి ఆరు నెలల అనంతరం జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి ప్రమోట్ చేస్తారని తెలిపారు. ఇంటర్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9908785718, 970 11 555 12, 970 40 44 029 మరియు 9492 7955 24 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Saturday, 4 April 2026
6 న ఉచిత ఉద్యోగ మేళా
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నల ఆరవ తేదీన ఇటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగమేళా ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ జయకుమారి తెలిపారు హైదరాబాద్ కు చెందిన వివిధ రకాల సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది అన్నారు కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందని ఆసక్తి గల యువతీ యువకులు తగిన ధ్రువపత్రాలతో జాబ్ మేళా కు రావాలని సూచించారు.
Wednesday, 1 April 2026
ఉచిత మెగా జాబ్ మేళా @ మెదక్
మెదక్ జిల్లాలో ని యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం కోసం ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏప్రిల్ 2 వ తేదీన మెదక్ ప్రైవేట్ ఐటిఐ ప్రాంగణంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ అపోలో ఫార్మసీ లో పని చేయుటకు డి. ఫార్మసీ, బి ఫార్మసీ , ఎం ఫార్మసీ అర్హత ఉన్న వారు అర్హులని అన్నారు.వయసు 18 నుండి 35 మధ్య ఉండాలని ,జీతం 20 వేలవరకు లభిస్తుందని తెలిపారు.25 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు.17 వేల వరకు జీతంతో 20 ట్రైనీ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.
టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతలతో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..
బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ,న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, అర్హతలతో 5 ప్రొడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ..12 వేల వరకు జీతంతో..
ఆసక్తి,అర్హతలు గల వారు,అనుభవం, ఫ్రెషర్స్ కూడా తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళా కు రావాలని సూచించారు.
మిగతా వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Sunday, 15 March 2026
మార్చి 22న కామారెడ్డి లో ఉచిత మెగా జాబ్ మేళా
కామారెడ్డి లోని పార్శి రాములు కళ్యాణమండపంలో మార్చి 22వ తేదీన జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు టిపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు .ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఐటి, ఇన్ఫర్మేషన్ ,బ్యాంకింగ్ ,ఫార్మసీ ,సర్వీస్ సెక్టార్ మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు .50 కి పైగా ప్రముఖ కంపెనీలు, కామారెడ్డి ప్రాంతంలోని వివిధ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూ నిర్వహిస్తారని ,200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఉచిత జాబ్ మేళా..16-3-2026
నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో టాస్క్ మరియు కెరియర్ గైడెన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9:30 గంటలకు మెగా ఉద్యోగమేల నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఐటి ఎనేబుల్ సర్వీసెస్, బ్యాంకింగ్, బిపిఓ తదితర ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని అన్నారు. 2022 నుంచి 2026 వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన ,ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు అని అన్నారు. పూర్తి వివరాలకు 9059344379 మరియు 9191559027 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...