Showing posts with label ఫ్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్. Show all posts
Showing posts with label ఫ్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్. Show all posts

Tuesday, 14 April 2026

పుట్టగొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ

 నసురుల్లాబాద్ కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ లో ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు పుట్ట గొడుగుల పెంపకం పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి ఉన్న 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తులు జిల్లా కలెక్టరేట్ లోని DRDO ఆఫీస్ లో లేదా నసురుల్లాబాద్ లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.

శిక్షణ సమయంలో ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పూర్తి వివరాలకు..

92475 40478 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Monday, 13 April 2026

వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్.. ఉచిత శిక్షణ

 పర్యావరణ హిత కార్య క్రమాల్లో నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో గచ్చిబౌలి లోని EPTRI సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశ పెట్టింది.

ఇందులో ఒకటి 90 రోజుల ఉచిత శిక్షణ.. వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్స్ అని నిర్వహిస్తున్నారు.

అర్హులైన వారికి ఉచిత బస, క్షేత్ర స్థాయి పర్యటనల అనంతరం సర్టిఫికెట్ ఇస్తున్నారు.దీంతో రీసైక్లింగ్ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు.

స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. పర్యావరణ హిత కార్య క్రమాల్లో శ్రామిక శక్తిని పెంపొందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.ఇందులో భాగంగా పలు ఉచిత కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఇందులొ భాగంగా థియరీ,ప్రాక్టికల్ తరగతులతో ప్రాథమిక భావనలపై పరిజ్ఞానం అందించడం తో పాటు క్షేత్ర స్థాయి పర్యటనల కు భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

ఇందులో పొందిన నైపుణ్యాలతో పరిశ్రమలు , రీసైక్లింగ్ కేంద్రాలు,మున్సిపల్ కార్పొరేషన్ లలో ఉద్యోగాలు పొందవచ్చునని ప్రతినిధులు తెలిపారు.

ఇంటర్, డిగ్రీ,బీటెక్ లతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు.



Wednesday, 8 April 2026

ఆటోమొబైల్ కోర్సులో ఉచిత శిక్షణ

 ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ..


యాదాద్రి భువనగిరి జిల్లా ,భూదాన్ పోచంపల్లి మండలం, జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో, రెండు నెలల కాలవ్యవధి గల ఆటోమొబైల్ ఈవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు .

 ఎస్ఎస్సి విద్యార్హత కలిగి ఉండాలని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల 15వ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించబడుతుందని, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పారు.

 ఇతర వివరాలకు 80 19626324 మరియు 9032399 530 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

9 న ఉచిత జాబ్ మేళా @ బిచ్కుంద డిగ్రీ కళాశాల లో

 బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఐక్యూసీ మరియు టాస్క్ ల ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత జాబ్ మేళా ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కళాశాల వర్గాలు తెలిపాయి.

శ్రీ విజయ బయో ఫెర్టలైజర్స్ కంపెనీ తరఫున సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ లీడర్, టీమ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు.

దీనితోపాటు ముత్తూట్ ఫైనాన్స్ ఇంటర్ షిప్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి ఆరు నెలల అనంతరం జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి ప్రమోట్ చేస్తారని తెలిపారు. ఇంటర్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9908785718, 970 11 555 12, 970 40 44 029 మరియు 9492 7955 24 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Friday, 3 April 2026

టెక్నికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

 ఈనెల 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి 

భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు .

ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్సు కు ఐటిఐ..

 కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటవీ ,సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్సులకు పదవ తరగతి ..

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి క్విల్ట్ మేకింగ్ కోర్సులకు ఎనిమిదవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు .

అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల ఆరవ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు.

 పూర్తి వివరాలకు 9133 90 8,000 మరియు 9133 90 8 111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

గిరిజన యువతకు.. ఉచిత శిక్షణ

 భారత దేశ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రైకార్ ఎండి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.

 కేరళలోని కొచ్చిలో మే నెలలో శిక్షణ ప్రారంభం అవుతుంది అని వెల్లడించారు. రాష్ట్రం యువతకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్ తో పాటు ప్లేస్ మెంట్ కల్పిస్తారని వెల్లడించారు.

 ఈనెల 10వ తేదీ లోగా దరఖాస్తుల సమర్పించాలని కోరారు. వివరాలకు Https://dsapponline.com/sds/form/register.php   వెబ్సైట్ సందర్శించాలని సూచించారు

Monday, 30 March 2026

ఉచిత శిక్షణ @ నసురుల్లాబాద్

 కెనరా బ్యాంక్ వారి సహకారంతో నసురుల్లాబాద్, కామారెడ్డి జిల్లా లో ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ప్రారంభం అయింది.కేంద్రాన్ని ప్రారంభించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కు చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఉచిత శిక్షణ పొందడానికి అర్హులని అన్నారు.

తగిన ధృవ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించి శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని సూచించారు..

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఏప్రిల్ ఒకటి నుంచి 2026 27 ఆర్థిక సంవత్సరానికి గాని పలు కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తారు .

ఏకకాలంలో నిరుద్యోగ యువతకు ,మహిళలకు తొమ్మిది రకాల కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు .హాస్టల్ వసతి కల్పిస్తారు .కోర్సు పూర్తయిన తర్వాత ధ్రువపత్రము, మరియు టూల్ కిట్స్ అందిస్తారు. అభ్యర్థులు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు సిఫారసు చేస్తారు . ఏప్రిల్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇవ్వనున్నారు .ఈ అవకాశాన్ని 19 నుంచి 50 ఏళ్లలోపు వారు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. దరఖాస్తుల సమర్పణ పూర్తయిన వారం రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తారు .

పురుషులకు ..

ద్విచక్ర వాహన, సెల్ ఫోన్ ,సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్, సర్వీసింగ్, మరమ్మత్తులు,  ఫోటోగ్రఫీ ,ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్ , ప్లంబింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. 

స్త్రీలకు ..

టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, వస్త్ర బ్యాగుల తయారీ ,కొవ్వొత్తుల తయారీ ,పుట్టగొడుగుల పెంపకం తదితర అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.

 సమర్పించాల్సిన జిరాక్స్ పత్రాలు..

 అభ్యర్థులు కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా( పాసర్ /ఫెయిల్), అయిదు ఫోటోలు, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు సమర్పించాలి. ఇతర వివరాలకు కార్యాలయ సమయాలలో నేరుగా సంప్రదించవచ్చు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ @ డిచ్ పల్లి

 డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ..  08461-295428


ఈ నెల ఆఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 1 నుంచి స్వయం ఉపాధి కోర్సుల ఉచిత శిక్షణ ప్రారంభం..

డిచ్ పల్లి లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 2026-27 ఆర్థిక సంవత్సరం లో ఏప్రిల్ 1 నుంచి వివిధ రకాల ఉచిత స్వయం ఉపాధి శిక్షణ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది..

ఏక కాలంలో 10 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.. శిక్షణా సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తారు.. కోర్సు పూర్తి అయిన తర్వాత ధ్రువపత్రం,టూల్ కిట్స్ అందిస్తారు..

అభ్యర్థులు సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలకు సిఫార్సు చేస్తారు.

మార్చి నెల 31 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ ఒకటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన 19 నుండి 45 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవికుమార్ కోరారు..

ఈ కింది 10 అంశాల్లో శిక్షణ ఇస్తారు..

టైలరింగ్, మగ్గం వర్క్,బ్యూటీషియన్, CC కెమెరా ఇన్స్టలేషన్ మరియు రిపేరింగ్, ఏసీ ఇన్స్టలేషన్ అండ్ రిపేరింగ్, ఫోటోగ్రఫీ, తేనెటీగల పెంపకం, కూరగాయల నర్సరీ, పచ్చళ్ళ తయారీ, పుట్ట గొడుగుల పెంపకం

కావలసిన జిరాక్స్ పత్రాలు..

 ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా ( పాస్ /ఫెయిల్ ),5 ఫొటోలు, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు 

సందేహాల నివృత్తికి..

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్లోని ఆసక్తి కల యువతీ యువకులు తమ సందేహాల నివృత్తికి ఆఫీసు వేళల్లో 08461-295428 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు డైరెక్టర్ రవికుమార్..

Sunday, 29 March 2026

ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ

 ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

టాలెంట్ మేనేజర్ అనవిలాసిని,శిక్షకుడు విశ్వనాథ మోహన్ లతో కలిసి కరపత్రం ఆవిష్కరించారు. స్కిల్ ఇండియా కార్యక్రమం కింద పదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన ,16 నుండి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.శిక్షణ అనంతరం మల్టీ నేషనల్ కంపెనీలో 6 నెలలు అప్రెంటిస్ షిప్ చేయాలని సూచించారు. సందేహాల నివృత్తికి 76739 76699 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...