కామారెడ్డి లోని పార్శి రాములు కళ్యాణమండపంలో మార్చి 22వ తేదీన జిసిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు టిపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు .ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఐటి, ఇన్ఫర్మేషన్ ,బ్యాంకింగ్ ,ఫార్మసీ ,సర్వీస్ సెక్టార్ మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు .50 కి పైగా ప్రముఖ కంపెనీలు, కామారెడ్డి ప్రాంతంలోని వివిధ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూ నిర్వహిస్తారని ,200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment