Tuesday, 19 May 2026

ఉచితంగా మామిడి మొక్కల పంపిణీ

 వేసవి అనగానే మనకు టక్కున గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. అందరూ పండ్లను తిన్న తర్వాత టెంకలను బయటపడేస్తుంటారు. అయితే బయటపడవేసే ఈ టెంకలను సేకరిస్తూ రైతులకు ఆదాయ మార్గాన్ని చూపుతున్నాడు కోల్ కతా కు చెందిన జస్మిత్ సింగ్. వైద్య శాస్త్రం చదివిన ఆయన , ఆంత్ర ప్రేన్యూర్ గా కూడా పని చేసిన ఆయనను నీరు లేక వరి పొలాలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న కొన్ని సంఘటనలు కలచి వేసాయి. అప్పుడే నీటి అవసరం ఎక్కువగా లేని ఎక్కువ కాలం ఆదాయం పొందే దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చింది మామిడి టెంక లను సేకరించాలనే ఒక ఆలోచన.



దాంతో ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో  "మామిడి టెంకలను పారేయకండి, వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టాక నాకు  పంపించండి "అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నుండో పార్శిల్ల ద్వారా వచ్చిన టెంకలను దీని కోసమే సొంతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలుగా పెంచుతున్నాడు .ఆ తర్వాత వాటిని " రైతులకు ఉచితంగా "పంచుతున్నాడు. అవి పెరిగి పెద్దయ్యాక రైతులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు పచ్చదనం పెంపొంది పర్యావరణానికి మేలు జరుగుతుందని అంటారు డాక్టర్ జస్మిత్ సింగ్.


No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...