బీహార్ లోని సరాన్ జిల్లాలో ఆదివారం కంటి ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ఆదాని హాజరయ్యారు .సరౌన్ జిల్లా కేంద్రం శివారులలో 150 కోట్ల రూపాయల మేరకు ఆదాని ఫౌండేషన్ సహాయంతో భారీ స్థాయిలో ఇక్కడ అఖండ జ్యోతి కంటి ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు .ఇక్కడి మస్తీ చాకులో ఆసుపత్రి పూర్తి అయితే వార్షికంగా మూడు లక్షలకు పైగా కంటి ఆపరేషన్లు జరుగుతాయి. వేయి మంది కంటి వైద్యులకు అవసరమైన అధునాతన శిక్షణ అందుతుంది .శంకుస్థాపన కార్యక్రమానికి ఆదాని, ఆయన భార్య అదానీ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రీతి ఆదానీ హాజరయ్యారు. కార్యక్రమం నేపథ్యంలో ఆదాన్ని దంపతులు మాట్లాడారు తాము సేవనే ధర్మంగా పరిగణిస్తామని ప్రకటించారు .మొత్తం మీద ఇక్కడ ఆసుపత్రికి 500 కోట్ల రూపాయల మేర వ్యక్తిగత సహాయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తాము చేపట్టబోయే దీర్ఘకాలిక మానవీయ, సామాజిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల దిశలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా గౌతమ్ ఆదనీ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment