13, ఆగస్టు 2026, గురువారం

ఉచిత కుట్టు మిషన్ లు.. బీసీ మహిళలకు

 బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో కీలక స్కీంకు శ్రీకారం చుడుతున్నారు ప్రభుత్వ అధికారులు.  కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యమున్న పేద ,నిరుద్యోగ, బిసి మహిళలకు 100% ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమషన్లను ఉచితంగా అందజేయనున్నారు.

 రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను బీసీ మహిళలకు అందిస్తున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టుమిషన్లను అందజేయడం ఈ స్కీం యొక్క ఉద్దేశం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుట్టవృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని అర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్తు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. పథకం విధివిధానాలు ,కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు ,దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాము వెల్లడించారు. 



ఒక్కో కుట్టు మిషన్ విలువ 12,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 15 తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు నిర్ణీత గడువులో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి దశల వారీగా కుట్టు మిషన్ లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. . 

నిరుపేదలు,వితంతువులు, ఒంటరి మహిళలు,నిరాశ్రయులు,అనాథలు,దివ్యాంగులు, కుట్టు వృత్తి లో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

ఎంపిక ఇలా.. మండల స్థాయి కమిటీకి ఎం పీ డీ ఓ, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ల ప్రతినిధులు , కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి , డీ ఆర్ డీ ఏ ప్రతినిథి తో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో పదిమంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ ఆమోదించిన అర్హుల జాబితాను బీసీ సహకార సంస్థ ఎండి ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత టెండరింగ్ విధానంలో చేపట్టనున్నారు. 

అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.. బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలి, 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలకు మించ కూడదు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు .అర్హులు  https://tgobmms.chg.gov.in  వెబ్ పోర్టల్ ద్వారా మీ సేవ లేదా ఏదైనా ఆన్ లైన్ కేంద్రం ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కమ్యూనిటీకి నిబంధనల మేరకు ప్రాధాన్యముంటుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...