6, ఆగస్టు 2026, గురువారం

పేద పిల్లలకు ఉచిత విమాన యానం

 ఆకాశ యానం అందరికీ అందదు. ఆ అందని ఆకాశ ప్రయాణాన్ని పేద పిల్లలకు ఉచితంగా అందించేందుకు ఉత్తరాఖండ్ లో ఉన్న హల్ద్వానీ నగరంలోని పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ లోని విమానం బయలుదేరి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆదివారం జరిగిన ఈ విమాన ప్రయాణం లో 30 మందికి పైగా నిరుపేద కుటుంబాల పిల్లలు ప్రయాణించారు. ఆ పిల్లల కోసం విమాన టికెట్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు వ్లాగర్ సౌరభ్ జోషి, ఆయన సతీమణి అవంతికా భట్ లు బుక్ చేశారు. ఆ పిల్లల తో పాటు వారూ ప్రయాణించారు. నోయిడా లోని గేమింగ్ జోన్ లో పిల్లలను ఆడిస్తూ రోజంతా సరదాగా గడిపారు. 

రెస్టారెంట్ లో పిల్లలకు ఇష్టమైన పిజ్జాలు, బర్గర్ లు ఆర్డర్ చేశారు. ఆ పిల్లల సందడి, అల్లరి, సంతోషాలను వీడియో తీసి సౌరభ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశాడు. అవంతిక తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. 

పేద పిల్లల సంతోషం కోసం ఒక రోజు చేసిన ఖర్చు కన్నా వారి సంతోషం కోసం శ్రద్ధ చూపినందుకు సోషల్ మీడియాలో ఎంతో మంది అవంతిక జోడీ ని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం అవంతిక, సౌరభ్ లు విడిపోతున్నారని, అందుకే వారిద్దరూ వీడియోల్లో కనిపించడం లేదని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు తాజాగా వారి వీడియోలు సమాధానం ఇస్తున్నాయి. పురాతన కాలంలో పావురాలతో సందేశం పంపినట్లు, ఈ జోడీ వీడియో తో నెటిజన్ లకు సందేశం పంపింది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...