పేదల ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు అంటే ఎంతో ఆందోళనగా ఉంటుంది ఎలా చేయాలా అని. అలాంటి పేద కుటుంబాలలో ఆశల దీపం వెలిగించి ఎంతో సహాయకారిగా ఉంటున్నారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ కు చెందిన నమ్కీన్ వ్యాపారి వినయ్ అగర్వాల్.
నాకు సోదరీమణులు లేరు , కానీ ఏ ఇంట్లో కూడా డబ్బులు లేకపోవడం కారణంగా ఆడపిల్ల పెళ్లి ఆగిపోకూడదు ..అనే ఆలోచనతో 2023 లో 11 మందికి,2024 లో 21 మందికి ,2025 లో 51 మంది యువతులకు వివాహాలు అన్నీ తానై జరిపించారు వినయ్ అగర్వాల్ గారు.
ఈ 2026 వ సంవత్సరంలో ఏకంగా 101 జంటలకు ఒకే వేదికపై జీవితాలను కలిపారు.ఇప్పటివరకు మొత్తం 184 మందికి వారి వారి మత ఆచారాల ప్రకారం ఘనంగా వివాహాలు జరిపించారు.జంటలకు టీవీ లు, ఫ్రిజ్ లు, బెడ్ లు సహా ఇంటికి అవసరమైన సామాగ్రినీ ఉచితంగా అందిస్తారు . అత్యంత పేద కుటుంబాలకు చెందిన యువతులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వినయ్ అగర్వాల్ తెలిపారు. ఏటా లబ్ధిదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతానని ఆయన వెల్లడించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి