3, అక్టోబర్ 2026, శనివారం

BSNL ఉచిత బీమా

 ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఆవిష్కరించింది ఎంపిక చేసిన ప్లాన్లపై ఉచిత ప్రమాద బీమా ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ఎస్ టి వి 202, ఎస్ టి వి 2 4 9 ప్లాన్ లపై లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా, సైబర్ మోసాలపై పదివేల రూపాయల  వరకు బీమా అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ సీఎండీ రాబర్ట్ జె రవి తెలిపారు. ఇలాంటి నూతన ఆఫర్ ఇస్తున్న తొలి సంస్థ మాదే అనుకుంటానని, గతంలో ఎయిర్టెల్ ఆఫర్ ఇచ్చినట్లు గుర్తు అని ఆయన పేర్కొన్నారు.

 ఇలాంటి ప్లాన్లతో రైతులకు, వ్యవసాయ కార్మికులు, చేపలు పట్టేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వినియోగదారుడిపై సంస్థకు వస్తున్న ఆదాయం 101 రూపాయలకు పెరిగింది. అంత క్రితం ఇది 71 రూపాయలుగా  ఉన్నది. భారతీయ ఎయిర్టెల్ మాత్రం 179 రూపాయలు మరియు 270 రూపాయలు ప్లాన్లపై లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఇచ్చింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...