Monday, 4 May 2026

ఉచిత అంబలి పంపిణీ @కోనాపూర్, బాన్సువాడ

 బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని గ్రామస్తులు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.సోమవారం ఆయన గ్రామంలో ఉప సర్పంచ్ బంజ భూషణం, పంచాయతీ కార్యదర్శి భరత్ లతో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీ జెట్టి హన్మండ్లు , గ్రామ యువకులు పాల్గొన్నారు..

ఉచిత న్యాయము.. భారత దేశంలో ఇలా

 భారతదేశంలో ఉచిత న్యాయ సహాయము ఇలా పొందవచ్చు..

ఉచిత న్యాయము.. ఉచిత న్యాయం అనేది ప్రజల హక్కు. దీనికొరకై లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు వినియోగించుకోవాలి .బాధితులు న్యాయస్థానాలను ఇప్పుడు ఆశ్రయించడం చాలా సులభతరం .న్యాయ సహాయమే కాదు ,పరిహారం పంపిణీ సేవలు కూడా పొందవచ్చు. లోక్ అదాలతల నిర్వహణలో నంబర్ వన్ గా టి ఎస్ ఎల్ ఎస్ ఏ. బంధాలు తెగిపోకుండా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారము. 

ఉచితంగా న్యాయ సహాయం పొందడం అనేది ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇదే చెబుతోంది .కోర్టు పేరు చెబితే చదువుకున్న వారు, ఆర్థికంగా కొద్దో గొప్ప ఉన్నవారు కూడా హడలిపోతారు. కోర్టుల పోరాటం అంటే ఖరీదైన వ్యవహారమే. మరి నిరుపేదలు నిస్సహాయులు అభాగ్యులు అనాధలు ఏం చేయాలి? ఎలా న్యాయం పొందాలి దీనికోసం ఉద్భవించినవి లీగల్ సర్వీసెస్ అథారిటీలు వివక్ష లేకుండా న్యాయం అందరికీ సమానంగా అందాలనేది దీని మూల సూత్రము న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి అథారిటీ సహాయం అందిస్తుంది. పేదలకు ఉచిత న్యాయ సలహానే కాదు న్యాయవాదిని అందిస్తుంది అంతేకాదు పలు పథకాలు అందజేస్తుంది నవంబర్ 9వ తేదీన లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గా జరుపుకుంటారు 

నేషనల్ అథారిటీ.. 

చట్టాల పైన అవగాహన లేమి తో అనగారిన, బలహీన వర్గాలకు సరైన న్యాయం అందడం లేదని సుప్రీంకోర్టు భావించింది. ఉచిత న్యాయ సేవలను అందించడానికి, వివాదాల సామరస్య పూర్వక పరిష్కారానికి లోక్ అదాలత్ ల నిర్వహణ కోసం 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ /నల్సా ఏర్పాటు చేసింది నల్సా పాట్రన్ ఇన్ చీఫ్ గా భారత ప్రధాన న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు.

రాష్ట్ర అథారిటీ ..

ప్రతి రాష్ట్రంలో నల్సా విధానాలు, ఆదేశాలను అమలు చేయడానికి, ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి ,లోక్ అదాలతులను నిర్వహించడానికి రాష్ట్ర న్యాయ సేవల అథారిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి పాట్రన్ ఇన్ చీఫ్ గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవల అథారిటీకి జిల్లా న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

ఉచిత సేవలు ఎవరికి అంటే..

ఎస్సీ, ఎస్టీలు, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళా లేదా చిన్నారులు, మానసిక రోగులు ,దివ్యాంగులు ,ప్రకృతి విపత్తులు, జాతి హింస, కుల హింస, వరదలు, కరువు ,భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు లాంటి వాటిలో అనుకోని పరిస్థితుల్లో బాధితులు, పరిశ్రమలలో కార్మికులు, బాల నేరస్తులు ,మానవ అక్రమ రవాణా బాధితులుగా పోలీసు కస్టడీలో ఉన్నవారు.. వీరందరూ ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు.

అథారిటీ ఏం చేస్తుంది అంటే..

ఉచిత న్యాయ సహాయం ,లోక్ అదాలత్ నిర్వహణ, నల్సా పథకాల అమలు, బాధితులకు పరిహారం అందజేత, మీడియేషన్, ఉచితంగా న్యాయవాది ఏర్పాటు .


నల్సా కార్యాలయ అడ్రస్..


నల్సా ,భారత సుప్రీంకోర్టు, తిలక్ మార్క్,

 న్యూఢిల్లీ 1100 01 ,

హెల్ప్ లైన్ నెంబర్ 15100.


సిటిజన్ల కోసం..  

నల్సా కేంద్రం.. జై సల్మేర్ హౌస్, 26 మాన్సింగ్  రోడ్, న్యూఢిల్లీ 1100 11.

రాష్ట్ర అథారిటీ పరిధిలోని మొత్తం ప్యానెల్ లాయర్లు.. 252 ,

వీరిలో పురుషులు ..157 ,మహిళలు.. 75

 వీరి కాల పరిమితి మూడేళ్లు.

ప్రజాసేవకే అథారిటీ.. కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలతో పాటు మధ్యవర్తిత్వం ద్వారా అథారిటీ పరిష్కారం చూపిస్తుంది. నల్సా ద్వారా టీజీఎల్ఎస్ ఏ  అందించే ఈ సేవలు, పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల చెంతకే పలు పథకాలు చేరేలా వలంటీర్లు మీ వద్దకే వస్తున్నారు. మధ్యవర్తిత్వంతో న్యాయం సత్వరం దక్కుతుంది. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సేవలను తెలుసుకొని సహాయం పొందవచ్చు .మీకోసమే అథారిటీ అన్నది గుర్తుంచుకోండి.

మరిన్ని వివరాలకు tslsa.telangana.gov.in  వెబ్ సైట్  సందర్శించవచ్చు.

Sunday, 3 May 2026

ఉచితంగా తిరుపతి లడ్డూలు @ హైద్రాబాద్ లో

 


హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉచితంగా తిరుపతి లడ్డూల పంపిణీ..


హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 6 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.



 ఈ సందర్భంగా భక్తులకు ప్రతి ఒక్కరికి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచితంగా 2 తిరుపతి లడ్డూలు ఇస్తున్నారు.


ఉచిత కంప్యూటర్ శిక్షణ

 కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను శని వారం బాన్సువాడ సీఐ శ్రీధర్ ప్రారంభించారు.40 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేశ్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నర్సింలు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 May 2026

వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 గాంధారి మండలంలోని పెట్ సంఘం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభించినట్లు వాలీబాల్ కోచ్, వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారిణ, ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ వాలీబాల్ కోచ్ సోనియా సమక్షంలో శిబిరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు, ఆసక్తి గలవారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అంతర్జాలంలో 100 రూపాయలతో దరఖాస్తు చేసుకొని శిక్షణ పొందవచ్చని ఆమె తెలిపారు .శిబిరానికి బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున నెదర్లాండ్ కు చెందిన" లెట్స్ కీప్ ది బాల్ ప్లేయింగ్ ఫౌండేషన్ "వారు చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.



ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోండి

 తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేడ్ వాడలో గల షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాటి శుక్రవారం ప్రారంభించారు ఇప్పటివరకు పది బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని , ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు వారి విద్యాభివృద్ధికి కూడా ఎనలేని ప్రాధాన్యతనస్తూ పోటీ పరీక్షలలో ప్రతిభను కనబరిచి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన వసతి సదుపాయాలు పరిశీలించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత సహాయ అధికారి రాజా గంగారాం స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. 



జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

 ప్రజా పలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ హెల్త్ కేర్ ఐటి బిజినెస్ సర్వీసెస్ కస్టమర్ సర్వీసెస్ హాస్పిటల్ డిజిటల్ మీడియా లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత కోసం ఏడవ తేదీన నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ గార్డెన్స్ ఆర్మూర్ రోడ్ ల జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 50 కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి ఈ సందర్భంగా జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు స్థల వివరాలకు జిల్లా యువజన క్రీడల అధికారి కామారెడ్డి జిల్లా కార్యాలయాన్ని లేదా 9440846682 మరియు 9618126053  నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఆర్డిఓ గిరి, జిల్లా అధికారులు, జిల్లా యువజన క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

వేసవిలో క్రీడా శిబిరాలు

 వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీ...