ఫ్రీ మగ్గం వర్క్ ట్రైనింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ మగ్గం వర్క్ ట్రైనింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మే 2026, మంగళవారం

ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

 నసురుల్లాబాద్ ఎస్టీ యువత శిక్షణ కేంద్రంలో కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు " ఉచిత మగ్గం వర్క్ శిక్షణ" కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RSETI సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ సోమ వారం రోజున ఒక ప్రకటన లో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 19 నుండి 50 ఏళ్ల లోపు మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. మగ్గం వర్క్ శిక్షణ కోసం శిక్షణా కేంద్రం లోని వసతి గృహంలో ఉండి శిక్షణ పొందాలని ఆయన వివరించారు.

9, మే 2026, శనివారం

బాల్కొండ లో ఉచిత మగ్గం వర్క్ పై శిక్షణ

 బాల్కొండ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ పై మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ఏపిఎం గగారం తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ మాట్లాడుతూ ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నేర్చుకున్న నైపుణ్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వ్యాపారానికి అవసరమైన రుణ సదుపాయాలు అందిస్తామని ఏపీఎం గంగారం చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప శిక్షకురాలు కీర్తన సంతోషి సీసీల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...